అసెంబ్లీలో ఏ అంశంపైనైనా చర్చించేందుకు సిద్ధం

ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి

అమరావతి: అసెంబ్లీ సమావేశాల్లో ఏ అంశంపైనైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రతిపక్షం అడిగిన వెంటనే అసెంబ్లీ కొనసాగిస్తామని సీఎం వైయస్‌ జగన్‌ చెప్పారని తెలిపారు. సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు పారిపోకుండా అసెంబ్లీకి రావాలన్నారు. సభా సమయాన్ని వృథా చేయకుండా టీడీపీ సహకరించాలన్నారు. మా ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిస్తుందని మరోసారి రుజువైందన్నారు. 
 

Back to Top