చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడా ?.. లేక పనికిమాలిన నేతా?

రాష్ట్ర ప్రభుత్వానికి దేశ వ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి

పేద ప్రజలను ఆదుకోవడంలో దేశంలో నే ఏపి రోల్ మెడల్ 

చంద్రబాబు, లోకేష్ హైదరాబాద్ లో కూర్చుని ఆటలు ఆడుకుంటున్నారు

కన్నా లక్ష్మీనారాయణ చెబుతారు... టీడీపీ నేతలు మొరుగుతారు

టీడీపీ మాదిరిగా దోచుకునే ప్రభుత్వం మాది కాదు 

ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి 

వైయస్‌ఆర్‌ జిల్లా: విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వానికి విలువైన సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన ప్రతిపక్ష నేత చంద్రబాబు హైదరాబాద్‌లో కూర్చొని పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. కరోనా నియంత్రణ విషయంలో ఏపీ ప్రభుత్వం సీఎం వైయస్‌ జగన్‌ నేతృత్వంలో చిత్తశుద్ధితో పని చేస్తూ..దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటుంటే ప్రతిపక్షాలు ఇష్టం వచ్చినట్లు విమర్శిస్తున్నాయని మండిపడ్డారు. కన్నా లక్ష్మీనారాయణ ఏం చెబితే అదే విషయాన్ని టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని ఫైర్‌ అయ్యారు. ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం, అవినీతిరహిత పాలన అందించడమే సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి లక్ష్యమన్నారు. గురువారం కడప నగరంలోని వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డితో కలిసి శ్రీకాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..

 

 • కోవిడ్-19 నియంత్రణకు చేపడుతున్న చర్యలతో మన రాష్ట్ర ప్రభుత్వానికి దేశ వ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి..
 • లాక్ డౌన్ నేపథ్యంలో పేద ప్రజలను ఆదుకోవడంలో దేశంలో నే ఏపి రోల్ మెడల్ గా నిలిచింది..
 • ఇదంతా సిఎం వైయస్ జగన్ ఎప్పటికప్పుడు రివ్యూలు చేస్తూ తీసుకుంటున్న నిర్ణయాలు, వాటిని తూచ తప్పకుండా అమలు చేస్తున్న అధికార యంత్రాంగం, కిందిస్దాయి ఉద్యోగుల వల్లనే సాధ్యమైంది.
 • పదే పదే ప్రభుత్వంపై బురదచల్లుతున్న చంద్రబాబు ఈ విషయం తెలుసుకోవాలి.
 • ప్రతి రోజు కరోనా నివారణకు అధికారులతో ముఖ్యమంత్రి వైయస్ జగన్  సమీక్షా సమావేశం జరుపుతూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు..
 • చక్కటి పరిపాలన అందిస్తున్నా ప్రతిపక్షాలు బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నాయి.
 • చంద్రబాబు, లోకేష్ హైదరాబాద్ లో కూర్చుని ఆటలు ఆడుకుంటూ రాజకీయాలు చేస్తున్నారు..
 •  కాలక్షేపానికి భజన పరులతో  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. వాటిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.
 • బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాపిడ్ కిట్స్ పై ట్వీట్టర్‌లో చేసిన ఆరోపణలకు సంబంధిత మంత్రి వివరణ ఇచ్చినా అనవసర రాద్ధాంతం చేశారు.
 • నాలుగు రోజుల నుంచి  కన్నా లక్ష్మీనారాయణ, ఎల్లో మీడియా ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నాయి.
 • కన్నా లక్ష్మీనారాయణ చెబుతారు... టీడీపీ నేతలు మొరుగుతారు.
 • ప్రమాణ స్వీకారం రోజే ముఖ్యమంత్రి వైయస్ జగన్ అవినీతి రహిత పాలన అందిస్తానని స్పష్టం గా చెప్పారు.
 • అవినీతి నిర్మూలనకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ కట్టుబడి ఉన్నారు..
 • చంద్రబాబు హయాంలో ప్రతి పనిలో వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు.
 • లోకేష్ లాక్ డౌన్ ఉల్లంఘనలకు పాల్పడుతూ అచ్చోసిన ఆంబోతులాగా  మాస్కులు లేకుండా తిరుగుతుంటే ఎల్లో మీడియా ఏం చేస్తోంది.
 • రాష్ర్టాన్ని అప్పులపాలు చేసి తన పిప్పి పన్ను చికిత్స కోసం సింగపూర్ వెళ్లి ప్రభుత్వ సొమ్మును దోచుకున్న యనమల రామకృష్ణుడు ఈరోజు నీతులు మాట్లాడుతుంటారు.
 • నాలుగు పదుల వయస్సులో నాలుగడుగులు వేయలేరా అని వైయస్‌ జగన్  గురించి టిడిపి రాష్ర్ట అధ్యక్షుడు కళావెంకట్రావు మాట్లాడతారు.. కళావెంకట్రావు  అలా మాట్లాడటానికి...మీకు సిగ్గుందా.....
 • సీఎం వైయస్‌ జగన్ ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్ని రివ్యూలు చేస్తున్నారు. కరోనా వ్యాప్తిని అరికడుతూ పేదవారిని ఆదుకునేందుకు చేపడుతున్న కార్యక్రమాలు మీకు కనబడటం లేదా....
 • ఇప్పటికి రెండుసార్లు రేషన్ అందచేశారు.  మూడుసార్లు ఆరోగ్య సర్వే చేయించారు. వేయి రూపాయలను ప్రతి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. ఇవన్నీ మీకు కనబడటం లేదా? 
 • మీలాగా, మీ నాయకుడు చంద్రబాబు లాగా దోమలపై యుధ్దం, ఎలుకలపై యుధ్దం అంటూ దోచుకునే ప్రభుత్వం కాదిది. అందుకనే మా ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి.
 • అది చూసి ఓర్వలేక బురదచల్లుతూ విమర్శలు చేస్తున్నారు.
 • యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమ, అచ్చెన్నాయుడు లాంటివాళ్లు  వేల కోట్లు దిగమింగి ఈరోజు ఒక్కరూపాయి కూడా ప్రజలకు సేవలందించేందుకు ముందుకు రాకుండా ఇంట్లో కూర్చుని మొరుగుతున్నారు.
 • చంద్రబాబు సిగ్గులేకుండా అఖిలపక్షం మీటింగ్ పెట్టమని కోరతాడు. ప్రభుత్వంపై బురదచల్లుతూ ఇలా అడగమేంటి..కావాలంటే బాధ్యతగల ప్రతిపక్షంగా సలహాలు, సూచనలు ఇవ్వండి. మంచి సలహాలు పాటించకపోతే ప్రశ్నించండి.
 • రాష్ట్రంలో అనేక మంది పేద ప్రజలు, వలస కూలీలు ఇబ్బందులు పడుతుంటే వారి సమస్యలు ప్రతిపక్షాలకు పట్టవా..చంద్రబాబు ప్రతిపక్ష నేతా... లేక పనికిమాలిన వాడా....
 • హైకోర్టు మొట్టికాయలు వేస్తుందంటారు..మేం ఏం తప్పుచేశామండి.... పేదవారి పిల్లలను ఇంగ్లీషు మీడియంలో చదివించాలని చూడటం తప్పా. పేదవారంటే చంద్రబాబుకు ఎందుకు అంత కసి.
 • ఇంగ్లీషు మీడియం పై కోర్టులో పిల్ వేసిన వారి పిల్లలు ఏ మీడియం లో చదువుతున్నారు.
 • వచ్చే విద్యా సంవత్సరం లో ప్రతి మండలంలో తెలుగు మీడియం స్కూల్ ఏర్పాటు చేస్తాం..
 • తెలుగు మీడియం అని ఎవరైతే మాట్లాడుతున్నారో వారి పిల్లలని ఎంత మందిని ఆ స్కూల్ లో చేర్పిస్తారో చూద్దాం..
 • ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను చూసి ఓర్వలేక అనవసర రాద్ధాంతం చేస్తున్నారు...
 •  వైయస్సార్ కాంగ్రెస్ నేతలు ఎక్కడా లాక్ డౌన్ ఉల్లంఘించడం లేదు. పేదలను ఆదుకునే కార్యక్రమాలు చేస్తుంటే టిడిపి నేతలు రాజకీయం చేస్తున్నారు.
 • టిడిపి నేతలు కులాలు, మతాలు మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా ప్రజలకు టీడీపీ నేతలు సహాయం చేస్తున్నారా...?
 • ఒకే నెలలో మూడు సార్లు రేషన్ ఇచ్చిన రాష్ట్రం ఏదైనా ఉందా..
 • పాజిటీవ్ కేసులు దాచి పెట్టాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి  ఎందుకు ఉంటుంది.
 • కరోనా నియంత్రణే  కాకుండా వ్యవసాయ రంగంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగించేందుకు, పంటలకు సరైనధర లభించేలా చేసేందుకు వైయస్ జగన్ ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు.
 • వైద్యుల పై దాడులకు వ్యతిరేకంగా  కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన  ఆర్డినెన్స్ ను రాష్ట్ర ప్రభుత్వం స్వాగతిస్తోందని గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. 

తాజా వీడియోలు

Back to Top