దార్శనికత ఉన్న నాయకుడు వైయ‌స్ఆర్

 దివంగ‌త నేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికి గవర్నర్‌ నివాళి..   

విజ‌య‌వాడ‌: దివంగత ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజశేఖరరెడ్డి వర్థంతి కార్య‌క్ర‌మాలు రాష్ట్ర‌వ్యాప్తంగా ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు. ఈ  సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌.. దివంగత నేత వైయ‌స్ రాజశేఖరరెడ్డికి నివాళుల‌ర్పించారు.  దార్శనికత ఉన్న నాయకుడు వైయ‌స్ఆర్ అంటూ గ‌వ‌ర్న‌ర్‌ కొనియాడారు. రైతులు, పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పని చేసిన వ్యక్తి వైయ‌స్ఆర్‌  అని పేర్కొన్న ఆయన.. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం వైయ‌స్ఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తుచేశారు.   ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డి నిలిచిపోయారని సోషల్‌ మీడియా వేదికగా ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ వరుస ట్వీట్లు చేశారు .

Back to Top