4 నామినేటెడ్‌ ఎమ్మెల్సీ పదవులకు గవర్నర్‌ ఆమోదం

విజ‌య‌వాడ‌ : ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు నామినేటెడ్‌ ఎమ్మెల్సీ పదవులకు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ సోమవారం ఆమోదం తెలిపారు. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లేళ్ల అప్పిరెడ్డి, నాయ‌కులు తోట త్రిమూర్తులు, రమేష్‌ యాదవ్‌, మోషేన్‌రాజు పదవులు చేపట్టనున్నారు.

గ‌వ‌ర్న‌ర్‌తో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ దంప‌తుల భేటీ
ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు సోమవారం గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్ని కలిశారు. మర్యాదపూర్వక భేటీలో భాగంగా రాజ్‌భవన్‌కు సతీసమేతంగా వెళ్లిన సీఎం  వైయ‌స్ జగన్‌ దంపతులు గవర్నర్‌తో సమావేశమయ్యారు.  పలు కీలక అంశాలపై గవర్నర్‌తో దాదాపు 40 నిమిషాలపాటు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చర్చించారు. గవర్నర్ భార్య సుప్రవాహరిచందన్‌ని సీఎం సతీమణి వైయ‌స్‌ భారతి మర్యాదపూర్వకంగా కలిశారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top