మా ప్రభుత్వంలో రైతే రాజు

అన్నదాత సంక్షేమమే సీఎం వైయస్‌ జగన్‌ ధ్యేయం

‘వైయస్‌ఆర్‌ జలకళ’ ప్రారంభించిన ప్రభుత్వ విప్‌ కొరుముట్ల శ్రీనివాసులు 

వైయస్‌ఆర్‌ జిల్లా: అన్నదాత సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని, మా ప్రభుత్వంలో రైతే రాజు అని ప్రభుత్వ విప్‌ కొరుముట్ల శ్రీనివాసులు అన్నారు. రైల్వేకోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలం తిప్పాయిపల్లిలో వైయస్‌ఆర్‌ జలకళ పథకం కింద ఉచిత బోర్‌ను ప్రభుత్వ విప్‌ కొరుముట్ల శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనేక పథకాలు అమలు చేస్తున్నారన్నారు. 

వైయస్‌ఆర్‌ రైతు భరోసా పథకం ద్వారా అన్నదాతలకు పంట పెట్టుబడి సాయం, రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన  విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందిస్తున్నామన్నారు. వైయస్‌ఆర్‌ జలకళ పథకం ద్వారా సన్న, చిన్నకారు రైతులకు ఉచిత బోర్లను వేయడమే కాకుండా మోటార్లు కూడా ఉచితంగా బిగిస్తున్నామన్నారు. వైయస్‌ఆర్‌ జలకళ పథకం ద్వారా రెండు లక్షల వ్యవసాయ బోర్లు ఉచితంగా తవ్వించడం ద్వారా రాష్ట్రంలో 5 లక్షల ఎకరాలకు ఉచితంగా సాగునీరు అందించడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. 
 

Back to Top