మాచర్ల: రామోజీరావు పల్నాడుపై విషపు రాతలు రాస్తున్నాడని, చంద్రబాబునాయుడు అధికారంలో ఉంటే అది దేవుడి రాజ్యం..లేదంటే ఆటవిక రాజ్యమా..రామోజీ..? నీ అన్యాయాలను బయటకు తీస్తుంటే నీ వ్యాపారం కూలిపోతుందని, నీ చిట్ ఫండ్ కంపెనీలన్నీ మూతపడతాయని ప్రజా ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కుతున్నావా..? అని రామోజీరావుపై ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. రామోజీ మీద, ఈనాడు పత్రిక మీద ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతుందని పల్నాడు ప్రాంతంపై అక్కసు వెళ్లగక్కుతున్నాడని మండిపడ్డారు. రామోజీ చెప్పినా, ఎన్ని తప్పుడు రాతలు రాసినా పల్నాడు పౌరుషాల పురిటిగడ్డ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. ఇచ్చిన మాట కోసం, ప్రజల కోసం పల్నాడు నాయకులు ప్రజలకోసం నడుస్తారని చెప్పారు. వైయస్ఆర్ సీపీ ప్రభుత్వంపై వ్యతిరేకంగా చంద్రబాబుతో కలిసి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడని, ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు.. చంద్రబాబు, రామోజీ వేషాలను నమ్మరన్నారు. చంద్రబాబు చేసే అవినీతి, దోపిడీలు, అన్యాయాలు, అక్రమాలు అన్నీ పల్నాడు ప్రజలు చూశారని, ఈ రాష్ట్రానికి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు పల్నాడు ప్రాంతానికి ఏం న్యాయం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. మాచర్లలో ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే.. పల్నాడు ప్రాంతాన్ని చులకన చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు మా ప్రాంతాన్ని చులకన చేసి, మా ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నావు. ఇక్కడి ప్రజల అదరాభిమానాలతో నాలుగు సార్లు శాసనసభ్యుడినైన నాపై బూతులతో వార్తలు రాస్తున్నావు. ఈ రాష్ట్రంలో పేద ప్రజలను రామోజీ, చంద్రబాబు కబంద హస్తాల నుంచి కాపాడేందుకు సరైన మొగుడు వైయస్ జగన్ వచ్చాడు కాబట్టే ఏదో ఒక రకంగా విషం కక్కుతున్నారు. పల్నాడు ప్రాంతంలో టీడీపీకి పుట్టగతులు లేవు. గత 20 ఏళ్లలో కనుచూపు మేరలో ప్రజలు నమ్మడం లేదు. ఈ నియోజవర్గానికి నువ్వు కిరాయి వ్యక్తిగా పంపించిన బ్రహ్మారెడ్డిని పంపావు. ఇదే బ్రహ్మారెడ్డిని 2004లో ప్రజలు చీదరించుకుని చిత్తు చిత్తుగా ఓడించారు. 2009లో మళ్లీ బీఫాం ఇచ్చి పంపితే ఓడించారు. అలాంటి వ్యక్తిని మళ్లీ పంపి అలజడులు సృష్టించే ప్రయత్నంచేస్తున్నారు. ఆ కిరాయి వ్యక్తి గురించి నేను ఎంత తక్కువ మాట్లాడితే నాకు అంత గౌరవం. ఆ వ్యక్తి సొంత బంధువులనే లారీ గుద్ది చంపించిన నీచ చరిత్ర ఉన్న వ్యక్తి. ఈ కిరాయి వ్యక్తి చేసేపనులకు వత్తాసు పలుకుతూ చంద్రబాబు, రామోజీ కలిసి పల్నాడుపై విషం చిమ్ముతున్నారు. చంద్రబాబుకి చాలెంజ్ చేస్తున్నా...ఇలాంటి తప్పుడు వెదవ రాజకీయాలు మానుకో..వయసు పెరుగుతోంది. టీడీపీ హయాంలో హత్యలు, అకృత్యాలు నీకు కనిపించలేదా..రామోజీ..? రామోజీరావుకు కూడా చెప్తున్నా...టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసిన అభివృద్ధి ఏమిటి..? మా నాయకుడు ఈ నాలుగేళ్లలో పల్నాడు ప్రాంతానికి ఏం చేశారో గణాంకాలతో సహా చెప్పగలం. దీంట్లో పది శాతం నిధులు చంద్రబాబు తన 14 ఏళ్లలో నా నియోజకవర్గంలో ఖర్చు చేశావా అనేది నా సవాల్. అలా చేశానని చంద్రబాబు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని నేను చాలెంజ్ చేస్తున్నా. ఈ నాలుగేళ్లలో మేం ఎంత అభివృద్ధి చేశామో చెప్పగలం. గత ప్రభుత్వంలో చంద్రబాబు, టీడీపీ చేసిన దౌర్జన్యాలు అన్నీ ఇన్నీ కావు. నా నియోజకవర్గంలో సెప్టెంబర్ 16, 2014న జంగమహేశ్వరపాడు గ్రామానికి గుడిపాటి వెంకట్రామయ్య అనే వైఎస్సార్సీపీ నాయకుడిని దారుణంగా హత్య చేశారు. 2014 జులై 22న నెమిలి చినరామిరెడ్డి అనే మంచికల్లుకు చెందిన మా పార్టీ నాయకుడి రెండు కాళ్లను గొడ్డలితో నరికారు. 2014 సెప్టెంబర్ 11న చినగార్లపాడు గ్రామంలో గోవిందరెడ్డి అనే మా పార్టీ నాయకుడిని దారుణంగా చంపారు. 2014 నవంబర్ 20న నరమాలపాడులో బీసీ రజక కులానికి చెందిన రామడుగు వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని బీసీ నాయకుడు ఎదగకూడదని దారుణంగా నరికి చంపారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు సెప్టెంబర్16, 2014న వెంకట్రావ్ అనే యాదవ కులానికి చెందిన ఒక బీసీ నాయకుడిని దారుణంగా చంపారు. అప్పుడు మీకు ఇవన్నీ కనిపించలేదా..రామోజీరావు..? వారి ఐదేళ్ల పాలనలో వారు చేసిన అన్యాయాలు, దుర్మార్గాలు, హత్యలు అన్నీ ఇన్నీ కావు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ఈ రాష్ట్రం అంతా కరువుతో అల్లాడింది. ఆనాడు కరువుతో అల్లాడుతున్న పల్నాడు ప్రాంతంలో వైఎస్సార్సీపీ నాయకులను దారుణంగా చంపుకుంటూ వెళ్లడం వాస్తవం కాదా..? ఇలాంటి పనులు చేయడమే కాకుండా సరస్వతి సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి చంద్రబాబు, ఆయన బినామీ యరపతినేని ఆ భూములను ఆక్రమించి ట్రాక్టర్లతో దున్నేసింది నిజం కాదా..? ఇది అన్యాయం అని ఆనాడు మేం నిలదీస్తే మాపైనే 307 కేసులు పెట్టారు. ఒక ఫ్యాక్టరీ పెట్టుకోడానికి ప్రైవేటు భూమిని మా నాయకుడు కొనుగోలు చేస్తే వాటిని దౌర్జన్యంగా చంద్రబాబు డైరెక్షన్‌లో యరపతినేని ఆక్రమించింది నిజం కాదా..? రైతుల వద్ద నుంచి రామోజీరావు 3వేల ఎకరాలు రామోజీ ఫిల్మ్ సిటీ కోసం లాక్కొని 200 ఎకరాల్లో ఫిల్మ్ సిటీ కట్టి మిగతా 2800 ఎకరాలు నిరుపయోగంగా పెట్టింది నీకు వర్తించదా..? ఇవన్నీ ఎక్కడ బయటకు వస్తాయోనని ఆయన కనుసన్నల్లో ఎవరైతే పనిచేయరో వారిపై టార్గెట్ చేస్తున్నారు. మీకు వైయస్ జగన్ సరైన మొగుడు.. చివరి దశకు వచ్చిన చంద్రబాబు మా రాజ్యం కూలిపోతోంది...మాకు మొగుడు వచ్చాడు..మా ఆటలు సాగటం లేదనే ఈ రకమైన వార్తలు రాయిస్తున్నారు. కులాల మధ్య కుంపట్లు పెట్టి ఏదో రకంగా జనాన్ని నమ్మించాలనేదే వారి ఆలోచన. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇంత మందిని చంపినప్పుడు ఇది అన్యాయం అని రామోజీరావుకు గుర్తురాలేదా..? వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు మంత్రి అంబటి రాంబాబు ఎంపీటీసీలతో బస్సులో వెళ్తుంటే దాడి చేసి మా ఎంపీటీసీలను ఎత్తుకెళ్లిన పరిస్థితి మీకు కనిపించలేదా రామోజీ..? ఇది దౌర్జన్యం అనిపించలేదా...చంద్రబాబు..? చంద్రబాబు ఈ రాష్ట్రానికి పట్టిన శని...చంద్రబాబు అనే ఒక వెదవ ఈ రాష్ట్ర ప్రజలను పట్టి పీడిస్తున్నాడు. తన రాజకీయం కోసం చంద్రబాబు ఎంతగానైనా దిగజారే మనస్తత్వం అతనిది. సొంత మామను వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్న వెదవ చంద్రబాబు. అధికారం కోసం, సానుభూతి కోసం సొంత భార్యను అనని మాటలు అన్నాడని డ్రామాలు వేసిన వెదవ చంద్రబాబు. అతను ఒక కిరాయి వ్యక్తిని పంపి మాచర్ల నియోజకవర్గంలో గొడవలు సృష్టించి లబ్ధిపొందాలని ప్రయత్నంచేస్తున్నారు. మా మీద, మా నాయకత్వం మీద పల్నాడు అన్ని వర్గాలకు నమ్మకం ఉంది. అందుకే ఇక్కడి ప్రజలు వరుసగా మా కుటుంబాన్ని ఐదు సార్లు దీవిస్తున్నారు. మీలాగ సొంత బంధువులనే లారీలతో గుద్దించి చంపిన సంస్కృతి మాది కాదు. మేం చేస్తున్న అభివృద్ధి రామోజీకి కనిపించడం లేదా..? రూ.600 కోట్లతో రెండు నేషనల్ హైవే రోడ్లు మా నియోజకవర్గంలో వేస్తున్నాం. పంచాయతీ రాజ్ శాఖ నుంచి రూ.60 కోట్ల పనులు పూర్తి చేశాం. ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ నుంచి రూ.5.5 కోట్లతో అభివృద్ధి చేశాం. జలజీవన్ మిషన్ ద్వారా రూ.44 కోట్ల పనులు జరుగుతున్నాయి. 5 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు మాచర్ల నియోజకవర్గంలో నిర్మించాం. మాచర్ల ఆస్పత్రిని 50 పడకల ఆస్పత్రిగా అప్ గ్రేడ్ చేసి, రూ.3.5 కోట్లతో భవనాలు కట్టి ఈ మధ్యనే ప్రారంభం చేశాం. విజయపురిసౌత్‌లో రూ.5 కోట్లతో ఆస్పత్రి నిర్మాణం జరుగుతోంది. రూ.10 కోట్లతో 13 పీహెచ్‌సీల నిర్మాణం కొనుసాగుతోంది. రూ. 43 కోట్ల ఆర్ అండ్ బీ నిధులతో మేం రోడ్లు కూడా వేశాం. సీఎం వైయస్ జగన్ ఆశీస్సులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మేం చేస్తుంటే..వీళ్లకి మాత్రం కనిపించడం లేదు. నేను చాలెంజ్ చేస్తున్నా..రామోజీ, చంద్రబాబుకు చెప్తున్నా..వరికపూడిశెల అనే ప్రాజెక్టుకు 1996లో చంద్రబాబు శంకుస్థాపన చేశాడు. ఎన్నికలు అయిపోయాయి. కానీ ఆ ప్రాజెక్టును మర్చిపోయాడు. ఇదే ప్రాజెక్టు నుంచి 2009 తర్వాత అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించాను. 2014లో కూడా అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబును ప్రశ్నించాను. అప్పుడు అటవీ ప్రాంతంలో ఉంది కాబట్టి ప్రాజెక్టు కట్టడం అసాధ్యం అని నోట్ ద్వారా నాకు సమాధానం ఇచ్చారు. నీ మోసపూరిత మాటలతో పల్నాడు ప్రాంత ప్రజల ఓట్లు వేయించుకున్న చంద్రబాబుకు, ఆయనకు వత్తాసు పలికే రామోజీకి పల్నాడు ప్రాంతం గురించి మాట్లాడే అర్హత లేదు. సాధ్యం కాదు అని చంద్రబాబు చెప్పిన వరికపూడిశెల ప్రాజెక్టుకు వైయస్ జగన్ పూర్తిగా అనుమతులు తీసుకొచ్చారు. వైల్డ్ లైఫ్ టైగర్ ప్రాజెక్టుతో సహా అటవీ అనుమతులన్నీ మేం తీసుకొచ్చాం. ఈ ప్రాజెక్టు కింద 1.30 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వబోతున్నాం. నువ్వేదైతే సాధ్యం కాదని చెప్పావో..దాన్ని సాధ్యం చేసి చూపిస్తున్నాం. గడచిన నాలుగేళ్లలో రూ.2325.22 కోట్ల నిధులను మా నియోజకవర్గానికి తీసుకొచ్చి సంక్షేమం, అభివృద్ధిని తీసుకొచ్చాం. అభివృద్ధి అంటే ఇది కాదా...రామోజీ...ఇది నీకు కనిపించలేదా..? మీకు అభివృద్ధి చేయడం చేతకాదు...చేసే వారిపై బురద జల్లుతారా..? 1.30 లక్షల ఎకరాలతో రూ.1600 కోట్లతో వరికపూడిశెల శంకుస్థాపన చేయబోతున్నాం. మొత్తం ఒక్క మాచర్ల నియోజకవర్గానికే రూ.4వేల కోట్లు సీఎం వైయస్ జగన్ కేటాయించారు. గతంలోలానే ప్రజలు వైఎస్సార్సీపీని ప్రజలు అక్కున చేర్చుకుంటారనే భయంతోనే ఇలాంటి విష ప్రచారాలు చేస్తున్నారు. ఏదో ఒక రకంగా ఒక కిరాయి వ్యక్తితో ఇక్కడ అలజడులు సృష్టించాలని, దాని ద్వారా ఈ రాష్ట్రంలో ఏదో జరుగుతోందనే ప్రచారం చేయాలనే వెదవ ఆలోచన చంద్రబాబు చేస్తున్నాడు. వారి నుంచి కాపాడుకోడానికి వారు చేసే ఆకృత్యాలను ఎదుర్కొడానికి మా నాయకులను, కార్యకర్తలను కాపాడుకోడానికి చేసే ప్రయత్నం దౌర్జన్యమా..? మీకు చెప్పుకోడానికి ఏమీ లేవు...అంతేకాకుండా కావాల్సినన్ని దౌర్జన్యాలు చేశారు. పత్తికొండలో మా నారాయణరెడ్డిని చంపితే అది సత్యనారాయణ వ్రతమా..? కర్నూలులో ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీదేవి గారి భర్త నారాయణరెడ్డి లాంటి వ్యక్తులను నరికి చంపిన పరిస్థితి. చంద్రబాబు హయాంలో మా ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణరెడ్డిని దారుణంగా చంపితే అది సత్యనారాయణ వ్రతమా..? ఇలాంటి దౌర్జన్యాలు చేసి, అభివృద్ధి చేయలేక ఏదో విధంగా దౌర్జన్యాలు చేసి ప్రజలను పక్కదోవ పట్టించడానికి ప్రయత్నం. రూ.4వేల కోట్లతో ఒక నియోజకవర్గంలో కనీవినీ రీతిలో అభివృద్ధి చేస్తుంటే మేం చంబల్ లోయలో ఉన్నామా..? మాది ఆటవిక రాజ్యమా..? మంచి మనసుకు దేవుడు ఎప్పుడూ మంచి ఆలోచనలు ఇస్తాడు. ఈ ప్రాంతంలో ప్రజలను కాపాడటానికి దేవుడు మనిషి రూపంలో వైయస్ జగన్‌ని పంపాడు. ఆయన నేడు పల్నాడులో కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్లకి అభివృద్ధి అంటే తెలియదు..వాళ్ల హయాంలో అంతా కరువు. ఆ నాడు వాళ్లకు ఎదురు తిరిగి మాట్లాడిన వారిని చంపేయడం వారికి అలవాటు. ఎక్కడో గుంటూరులో ఉండే ఆ కిరాయి వ్యక్తి ప్రతి ఎన్నికకు వచ్చి పది రోజులు తిరిగి వెళ్తుంటాడు. ఇప్పుడు 2024లో వచ్చి నువ్వేం పీకుతావ్ మమ్మల్ని..మేం ప్రజల మధ్యలో ఉన్నాం. మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా కార్యకర్తలను మీరు చంపినా మేం వారిని కాపాడుకుంటూ ప్రజల మధ్యనే ఉన్నాం. అన్వర్ అరెస్టులోనూ రాజకీయాలు చేయడం సిగ్గుచేటు కారంపూడిలో ఒక చిన్న గొడవ జరిగింది. దాంట్లో రెండు పార్టీల మధ్య గొడవ జరిగితే ఇరు వైపులా కేసులు పెట్టారు. దాంట్లో విచారణలో భాగంగా అన్వర్ అనే వ్యక్తిని పోలీసులు తీసుకెళ్లారు. ఆ అన్వర్ అనే వ్యక్తిపై నాకు వ్యక్తిగత కక్ష ఏమీ లేదు. గతంలో అతను నా వద్దకు కూడా వచ్చిన వ్యక్తే. 20 ఏళ్ల నుంచి మేం ముస్లిం కుటుంబాల మధ్య జీవనం సాగిస్తున్నాం. నిత్యం సోదరభావంతో కలిసి మొలిసి జీవిస్తున్నాం. ఎక్కడో గొడవ జరిగి అరెస్టు చేస్తే ఏదో జరిగిపోతోందని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో కూడా నేను చెప్పాను...బ్రహ్మారెడ్డి నీకు...నీ పక్కన కుక్కలా తిరిగే యరపతినేనికి సినిమా చూపిస్తా. ఆధారాలు లేకుండా, సందర్భం లేకుండా నోటికి ఏది వస్తే అది పిన్నెల్లి సోదరులంటూ ఆరోపణలు చేస్తున్నారు. మీ కళ్లముందే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే మాపై ఆరోపణలు చేస్తున్నారు. మళ్లీ చెప్పున్నాం...వ్యక్తిగతంగా ఎవర్నీ వదిలిపెట్టం..అందరికీ సినిమా చూపిస్తాం. జలకళ ద్వారా మీ పార్టీకి ఊడిగం చేసినా మీరు సాయం చేయని కార్యకర్తలకు కూడా నేను బోర్లు మంజూరు చేయించాను. 2024లోనూ సీఎం వైయస్ జగనే.. ఇది గుర్తుంచుకోండి...మీకు సరైన మొగుడు వచ్చాడు... 2024లో మీకు, మీ చంద్రబాబుకు సరైన గుణపాఠం చెప్తాడు. 2024లో వైయస్ జగన్ మరో సారి ముఖ్యమంత్రి కాబోతున్నాడు.. నీ పేపర్లో నువ్వే ఈ వార్త రాస్తావు గుర్తుపెట్టుకో రామోజీ.. అంతే కాదు...చంద్రబాబును హైదరాబాద్ ఎర్రగడ్డ ఆస్పత్రిలో జాయిన్ చేశారు అనే వార్త కూడా రాయాల్సి వస్తుందని గుర్తుపెట్టుకో. మా ప్రాంత ప్రజల అభీష్టం మేరకు నేను కూడా ఐదో సారి ఎమ్మెల్యేగా గెలవబోతున్నాను. గుర్తుపెట్టుకో రామోజీ ఈ వార్త కూడా నీ పత్రికలో రాయాల్సి వస్తుంది. ఇది ఆ దేవుడు రాసిన స్క్రిప్ట్...ఇది దేవుడు గీచిన గీత...దేవుడు రాసిన రాత. రాష్ట్రంలో పేద వర్గాల కోసం దేవుడు పంపిన వ్యక్తి సీఎం వైయస్ జగన్. గడచిన నాలుగేళ్లలో రూ.2.16 లక్షల కోట్లు నేరుగా వారి ఖాతాలకు పంపిన మహానేత వైయస్ జగన్. చంద్రబాబు లాంటి ఎంతమంది గుంటనక్కలు వచ్చినా, రామోజీరావు లాంటి వారు ఎన్ని విషపు రాతలు రాసినా జరిగేది ఇదే. చంద్రబాబు, ఆయన బినామీలు తలకిందులుగా తపస్సు చేసినా ఈ రాష్ట్ర ప్రజలు వైయస్ జగన్‌ని గుండెల్లో పెట్టుకుని చూసుకోవడం ఖాయం. 45 ఏళ్లు పత్రికారంగంలో ఉన్న రామోజీరావు మీ వ్యాపారాల కోసం, చిట్‌ఫండ్ కంపెనీలను కాపాడుకోడానికి పల్నాడు ప్రాంతంపై విషం కక్కవద్దు. మీ పత్రికపై ఉన్న క్రెడిబిలిటీ జీరో అవుతుంది. చివరి రోజుల్లో దిగజారిపోయి ఈ విధంగా చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఎక్కువ చేస్తే నిన్ను, చంద్రబాబును ప్రజలు చీదరించుకునే పరిస్థితి వస్తుంది.