వర్షాలు, వరదల కారణంగా నిర్వాసితులైన వారికి అండగా నిలవాలి

అనంత వర్షాలపై సీఎం వైయ‌స్ జగన్‌ సమీక్ష.. 
 

 తాడేపల్లి: వర్షాలు, వరదల కారణంగా నిర్వాసితులైన వారికి అండగా నిలవాలని సీఎం వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డి అధికారులను ఆదేశించారు.  అనంతపురంలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.  బాధిత కుటుంబాలకు రూ.2వేల చొప్పున తక్షణ సహాయం అందించాలని సీఎం వైయ‌స్ జగన్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందించాలని ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌ సూచించారు. వర్షాలు, వరద తగ్గముఖం పట్టగానే ఆస్తి, పంట నష్టంపై అంచనా వేసి పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని  అధికారులను ఆదేశించారు. 

తాజా వీడియోలు

Back to Top