పాలకుడు శక్తివంతుడు కాబట్టే.. ద్రోహులంతా ఒక్కటయ్యారు

పక్కరాష్ట్రంలో కూర్చొని ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారు

చంద్రబాబుపై ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజం

అసెంబ్లీ: పాలకుడు శక్తివంతుడు అయితే.. ద్రోహులంతా ఒక్కటవుతారనే మాట ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాలకు అద్దం పడుతుందని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. రెండేళ్ల పరిపాలనలోనే ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. అదే విధంగా మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. ప్రతి సంక్షేమ పథకాన్ని పారదర్శకతతో అందిస్తున్నామని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రభుత్వం ఏరకంగా న్యాయం చేస్తుందో చూస్తున్నామన్నారు. 

అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. పాలకుడు ప్రజల మన్ననలను పొందుతున్నాడని శత్రువులంతా ఒక్కటై ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు పక్కరాష్ట్రంలో ఉంటూ అనునిత్యం అగ్గిరాజేసే విధంగా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. 24 గంటలు జూమ్‌లో ఉంటూ ఆ జూమ్‌లోనే మాక్‌ అసెంబ్లీ అంటూ మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నాడని దుయ్యబట్టారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పబ్లిసిటీకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని, ఎండ ఎక్కువగా ఉంది.. సూర్యుడితో మాట్లాడి 10 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గిస్తానని మాట్లాడారని గుర్తుచేశారు. సీఎం వైయస్‌ జగన్‌ 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల అవసరాలు గమనించారని, ఆ కష్టాలు ప్రజల నుంచి దూరం చేయడానికి 2 పేజీల మేనిఫెస్టో తెచ్చి.. 23 నెలల పాలనలోనే 95 శాతం అమలు చేశారన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ను చూసినప్పుడు నాయకుడు అంటే ఇలా ఉండాలనే భరోసా కలుగుతుందన్నారు. 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top