కరోనా గండం గట్టెక్కించడంపైనే సీఎం దృష్టంతా

నిత్యం సమీక్షలు చేస్తూ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు

అందరినీ ఆదుకునేలా సీఎం వైయస్‌ జగన్‌ చర్యలు తీసుకుంటున్నారు

తెలుగుదేశం పార్టీ మాఫియా ముఠాలా తయారైంది

జనం తనను మర్చిపోతారనే భయం చంద్రబాబుకు పట్టుకుంది

బాబుకు తెలిసిందల్లా సంక్షోభ సమయంలో దోపిడీ చేయడమే

తెలుగుదేశం పార్టీ రాజకీయ పార్టీ లక్షణాలను ఎప్పుడో కోల్పోయింది

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

తాడేపల్లి: కరోనా గండం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన సర్వశక్తులు ఒడ్డుతున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఒకపక్క కరోనా కట్టడికి సంబంధించి కఠిన నిర్ణయాలు తీసుకుంటూనే.. మరోపక్క ప్రజలకు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వకుండా చూస్తున్నారని, ఇంకోపక్క వలంటీర్ల వ్యవస్థ ద్వారా సమగ్ర కుటుంబ సర్వే చేయిస్తున్నారని వివరించారు. ప్రతీది పారదర్శకంగా చేస్తున్నారన్నారు. కానీ, మాఫియా ముఠాలా తయారైన తెలుగుదేశం పార్టీ నిత్యం ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీకి ఉండాల్సిన లక్షణాలను టీడీపీ ఎప్పుడో కోల్పోయిందన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే..
"తెలుగుదేశం పార్టీ అని పేరు ఎందుకుపెట్టారో ఎన్టీఆర్‌ కానీ, ఆ పార్టీలో తెలుగుదనం పార్టీని చంద్రబాబు దురాక్రమణ చేసుకున్నప్పుడే పోయింది. ఆ తరువాత ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సిన లక్షణాలు కోల్పోయింది. వాజ్‌పెయ్‌ పుణ్యంతో రెండోసారి అధికారంలోకి వచ్చి ఐదేళ్లు అయిపోయి  మళ్లీ 2014లో పదేళ్ల గ్యాప్‌తో అధికారంలోకి వచ్చిన తరువాత అసలు పార్టీ లక్ష్యాన్ని కోల్పోయి మాఫియా ముఠాలాగా తయారైంది.

విష ప్రచారం మీదే జీవితం, స్వలాభం చూసుకొని రాష్ట్రాన్ని ఐదేళ్ల పాటు ముంచేశారు. 2019లో జనం ఛీ కొట్టిన తరువాత ఇప్పుడు కొస ప్రాణంతో ఉన్న ఆ మాఫియా ముఠా కరోనా లాంటి సంక్షోభ సమయంలో జడలు వీరబోసుకొని నీచ విశ్వరూపం ప్రదర్శిస్తోంది. తెలుగుదేశం పార్టీ రాజకీయ పార్టీ లక్షణాలను ఎప్పుడో కోల్పోయింది. చంద్రబాబు తన పైత్యాన్ని కక్కుతూ రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లుతున్నాడు. తద్వారా అమాయక ప్రజలను గందరగోళంలోకి నెట్టేస్తున్నాడు.

కరోనా వచ్చిన తరువాత నిజంగానే రాజకీయాలు కొంత పక్కకు వెళ్తున్నాయి.. వెళ్లాలి కూడా.. ప్రధానంగా అధికార యంత్రాంగం, వైద్యులు బృందం ఒక సిస్టమ్‌ పనిచేస్తోంది. ఈ సమయంలో బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీ ఆలోచన చేయాల్సిందల్లా ప్రజలకు చేదోడు వాదోడుగా ఉండడం ఎట్లా.. అధికార యంత్రాంగం పనికి అడ్డంరాకుండా ఉండాలి. పనికి ఇబ్బంది పెట్టకపోవడమే గొప్పగా సహకరించడం. సీఎం వైయస్‌ జగన్‌ పొలిటికల్‌ యాక్టివిటీస్ గురించి అసలు ఆలోచించడం లేదు. నెలన్నర రోజులుగా కేవలం ఉన్నతాధికారులు, వైద్యులకు పనిచేసుకునే స్వేచ్ఛను ఇచ్చి పాలన పరమైన ఆదేశాల్లోకి మాత్రమే సీఎం ఎంటర్‌ అవుతున్నారు.

కరోనా వ్యాప్తిని ఎలా అరికట్టాలి. పాజిటివ్‌ ఉన్న వారిని ట్రేజ్‌ చేయడం ఎలా..? ఆ తరువాత వారిని ఐసోలేట్‌ చేయడం ఎలా..? ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా కట్టడి చేయడం ఎలా..? క్వారంటైన్‌, ఐసోలేషన్‌ కేంద్రాల్లో వైద్య పరికరాలు, మౌలిక వసతులు గురించి ఉన్నతాధికారులకు సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశాలు ఇస్తున్నారు. వలంటీర్ల వ్యవస్థ ద్వారా సమగ్ర కుటుంబ సర్వే చేయించడం, ఆధునిక వైద్య పరికరాలను తెప్పించడం,  మరోవైపు లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలకు జీవనోపాధి ఉండదు కాబట్టి వారికి ఆర్థిక సాయం అందజేయడం, ఇంకోవైపు అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌ ఉత్పత్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడడం. ఇవన్నీ ఒక నివేదికగా పెట్టుకొని సీఎం వైయస్‌ జగన్‌ అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇస్తున్నారు.

చంద్రబాబు హైదరాబాద్‌లో కూర్చొని జనం ఎక్కడ పట్టించుకోరో అనే  భయంతో జూమ్‌ అనే యాప్‌ ద్వారా ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లు, వీడియో కాన్ఫరెన్స్‌లు, లేఖల పేరుతో ఉనికి చాటుకుంటున్నారు. ప్రతిపక్ష నేత ఆయన అనుభవాన్నంత రంగరించి సలహాలు ఇవ్వడం తప్పులేదు. కానీ, ప్రభుత్వం ప్రజలకు ఉపయోగకరమైన పనులు చేసిన తరువాత చంద్రబాబు సలహాలు ఇస్తున్నారు. లేదా.. ఆ రోజు ఏదైనా అంకె ఎక్కువగా కనిపిస్తే దానిపై ప్రభుత్వం మీద బురదజల్లే ప్రయత్నం చేయడం.

చంద్రబాబు గత ఐదేళ్లలో వైరాలజీకి సంబంధించిన ల్యాబ్‌లను ఏర్పాటు చేయలేదు. కరోనా వచ్చిన తరువాత వైయస్‌ జగన్‌ ప్రభుత్వం 12 ల్యాబ్‌లను ఏర్పాటు చేసింది. ఇంకా ల్యాబ్‌ల సంఖ్య పెంచుతున్నాం. ఎక్కడో చేసిందాన్ని చూసి ఇక్కడెందుకు చేయలేదని చంద్రబాబు ప్రశ్నిస్తున్నాడు. ట్రూనాట్‌ ఎందుకు చేయాలని బాబు అంటుంటే ఆశ్చర్యంగా ఉంది. ట్రూనాట్‌ మెషిన్లు మేమే తెచ్చామని గొప్పలు చెప్పుకోవడం టీడీపీ మొదలుపెట్టింది. చంద్రబాబు తీసుకొచ్చింది టీవీలకు, ఒక్కటి వాడింది లేదు.. అన్ని పక్కనబెట్టారు.

కరోనా వ్యాధికి అవసరమైన కిట్లు మెడ్‌టెక్‌లో తయారవుతున్నాయి. వాటి ఉత్పత్తుల గురించి తెలుసుకునే ఓపిక కూడా చంద్రబాబుకు లేదు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలనే చెప్పడం.. చంద్రబాబు చెప్పిన తరువాతే చేస్తున్నారని ఎల్లోమీడియా రాయడం. తప్పులు జరగకపోయినా జరిగినట్లు టీడీపీ, ఎల్లోమీడియా చూపిస్తూ కన్ఫ్యూజన్‌ క్రియేట్‌ చేస్తున్నారు. పని సాఫీగా జరిగేందుకు, కరోనా కట్టడికి ప్రభుత్వం చేస్తున్న చర్యలకు అడ్డుపడొద్దని ఎన్నిసార్లు చెప్పినా టీడీపీ, ఎల్లోమీడియా ధోరణి మారడం లేదు.

కరోనా రావడానికి చంద్రబాబే కారణం అనే క్రెడిట్‌ కూడా తీసుకోవాలనే తపన కూడా టీడీపీ, ఎల్లో మీడియాలో కనిపిస్తోంది. ఒకపక్క జనం మాట వినడం లేదంటూ.. మరోపక్క కర్ఫ్యూతో ప్రజలను ఇబ్బంది పెడుతుందని మాట్లాడుతున్నారు. యంగ్‌ ముఖ్యమంత్రి జనంలోకి ఎందుకుపోవడం లేదని అంటారు.. మరోపక్క వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యేలు జనంలో తిరగడం వల్లే వైరస్‌ ఎక్కువైందని దుష్ప్రచారం చేస్తున్నారు.

సీఎం వైయస్‌ జగన్‌ గొప్పలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు. ఈ సమయంలో రాష్ట్రంలోని ప్రజలందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా.. గండం గట్టెక్కించడంపై దృష్టిపెట్టారు. ఇందుకు తన సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈ దృక్పథంతోనే అధికారులు, ఎమ్మెల్యేలు, కేబినెట్‌ మంత్రులు పనిచేస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు పేదలను ఆదుకునేందుకు సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు. క్వారంటైన్‌, ఐసోలేషన్‌ సెంటర్లలో వసతులు పరిశీలిస్తున్నారు.

చంద్రబాబుకు తెలిసిందల్లా సంక్షోభ సమయంలో దోపిడీకి అవకాశాలు వెతుక్కోవడం. టీడీపీ దోపిడీ గురించి చెప్పడానికి పుష్కరాలు ఒక్కటి చాలు. నామినేషన్‌ మీద వర్కులు కేటాయించి వేల కోట్ల దోచుకున్నారు. ఇప్పుడు అలా జరగడం లేదు. ప్రతీది పారదర్శకంగా జరుగుతుంది. కావాలంటే ఆర్టీఏకి వెళ్లి సమాచారం పొందవచ్చు. సీఎం వైయస్‌ జగన్‌ పారదర్శకంగా పరిపాలన చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అగ్రికల్చర్‌, మార్కెటింగ్‌ డిపార్టుమెంట్లు 4.50 లక్షల టన్నులకుపైగా  కూరగాయలు, పండ్లను మార్కెటింగ్‌ ఇంట్రవెన్షన్‌ ద్వారా ఆదుకున్నాం. సీఎం వైయస్‌ జగన్‌ స్వయంగా కూర్చొని ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్లే అధికారుల పని సులభమైంది. రైతు బజార్లు 110 ఉంటే వాటిని 950కి పెంచారు" అని సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు. 

తాజా వీడియోలు

Back to Top