జీపీఎస్‌తో ఉద్యోగులకు పెన్షన్‌ భద్రత

సీపీఎస్‌ రద్దుతో భవిష్యత్తులో మోయలేని భారం

సీఎం వైయస్‌ జగన్‌ బాధ్యతగా భవిష్యత్‌ కోసం ఆలోచించారు

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

సచివాలయం: జీపీఎస్‌తో ఉద్యోగులకు పెన్షన్‌ భద్రత కలుగుతుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఉద్యోగ సంఘాలతో సచివాలయంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. సమావేశం అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.

‘ఉద్యోగ సంఘాలతో జీపీఎస్‌పై చర్చించాం. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఆలోచించాలని కోరాం. సీపీఎస్‌ రద్దు చేస్తామని గతంలో చెప్పిన మాట వాస్తవం. సీపీఎస్‌ వల్ల నష్టం కలుగుతుందనే జీపీఎస్‌ ప్రతిపాదన తెచ్చాం. జీపీఎస్‌తో ఉద్యోగులకు పెన్షన్‌ భద్రత కలుగుతుంది. సీపీఎస్‌ రద్దు వల్ల ఇప్పటికిప్పుడు ప్రభుత్వంపై భారం పడదు. కానీ సీపీఎస్‌తో భవిష్యత్తులో మోయలేని భారం పడుతుంది. అందుకే సీఎం వైయస్‌ జగన్‌ బాధ్యతగా భవిష్యత్‌ కోసం ఆలోచించారు. జీపీఎస్‌లో అదనపు ప్రయోజనాలు కావాలంటే పరిశీలిస్తాం’ అని సజ్జల అన్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top