వైయస్‌ఆర్‌ సీపీకి మద్దతు- ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు

అనంతపురం: సార్వత్రిక ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఏపీ సీపీఎస్‌ ఉద్యోగ సంఘం నేతలు రామాంజనేయులు, ప్రేమ్‌నాథ్‌రెడ్డిలు అన్నారు. సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ అనంతపురంలో ప్రభుత్వ ఉద్యోగులు నిరసన ర్యాలీ చేపట్టారు. నల్ల దుస్తులు ధరించి చంద్రబాబు సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీపీఎస్‌ రద్దు చేస్తానని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ ఇచ్చిన హామీ హర్షణీయమన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు వైయస్‌ఆర్‌ సీపీకి అండగా ఉంటారన్నారు. 

Back to Top