వైయ‌స్ఆర్‌సీపీ లోక్‌స‌భ అభ్య‌ర్థి గోరంట్ల మాధ‌వ్ కు ఊర‌ట

ఏపీ ప్ర‌భుత్వ స్టే పిటిష‌న్ నిరాక‌ర‌ణ

నామినేష‌న్ వేసుకోవ‌చ్చ‌ని తెలిపిన హైకోర్టు

హిందూపురం వైయస్‌ఆర్‌సీపీ లోక్‌సభ అభ్యర్థి గోరంట్ల మాధవ్‌కు ఊరట లభించింది.ట్రిబ్యునల్‌ తీర్పును ఏపీ హైకోర్టు సమర్థించింది.ఏపీ ప్రభుత్వం వేసిన స్టే పిటిషన్‌ను హైకోర్టు నిరాకరించింది.గోరంట్ల మాధవ్‌ నామినేషన్‌ వేయొచ్చని హైకోర్టు పేర్కొంది. రాజకీయాల్లో చేరే క్రమంలో 2018, డిసెంబరు 30న గోరంట్ల మాధవ్‌ సీఐ ఉద్యోగానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రెండు నెలల క్రితమే వీఆర్‌ఎస్‌కి దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఏపీ ప్రభుత్వం ఆయన అభ్యర్థనను ఆమోదించకుండా పక్కనబెట్టింది. దీంతో ఆయనకు నామినేషన్‌ విషయంలో అడ్డంకులు వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తక్షణమే మాధవ్‌ వీఆర్‌ఎస్‌ను ఆమోదించాలని ట్రిబ్యునల్‌.. ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. 

 

Back to Top