ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ పెంపు

అమరావతి: ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజారంజక పాలన అందిస్తున్నారు. అన్నివర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్నారు. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి పెంచుతూ జగన్ సర్కారు నిర్ణయం తీసుకుంది. 27 శాతం మధ్యంతర భృతి పెంచుతూ తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. ఈ నిర్ణయంతో సుమారు 4 లక్షల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. అయితే, రూ.815 కోట్ల మేర ప్రభుత్వానికి అదనపు భారం పడనుంది. జగన్ సీఎం అయ్యాక తొలి క్యాబినెట్ సమావేశంలోనే దీనిపై నిర్ణయం తీసుకున్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని 27 శాతం మేర మధ్యంతర భృతి పెంపుదల చేయాలని ప్రభుత్వం నిశ్చయించింది. ఈ పెంపు ఈ జూలై మాసం నుంచే ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తుంది.

 

Back to Top