వైయ‌స్‌ జగన్ హయాంలో విద్యారంగం స్వర్ణయుగం

ఆర్‌ అండ్‌ బీ మంత్రి దాడిశెట్టి రాజా  

 పేదలు పెద్ద చదువులు చదువుకుంటుంటే యనమలకు ఎందుకు కడుపుమంట?

 యనమల ఇకనైనా పిచ్చి ప్రేలాపనలు మాను

 రాష్ట్రంలో విద్యా వ్యవస్థ సక్రమంగా సాగుతోంది
 
స్కూళ్లలో బాత్‌రూమ్‌లు కూడా కట్టలేని మీరా మాట్లాడేది?

సూటిగా నిలదీసిన మంత్రి దాడిశెట్టి రాజా

 యనమల ఇక్కడ పుట్టడం తుని దురదృష్టం
 
 నీ సొంత గ్రామంలోనూ హైస్కూల్‌ కట్టింది మా సీఎం శ్రీ వైయస్‌ జగన్‌

గుర్తు చేసిన మంత్రి  దాడిశెట్టి రాజా

  మన బాటలోనే ఆ విభాగంలో కేంద్ర బడ్జెట్‌ కేటాయింపు
 
 అనేక రాష్ట్రాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను అనుసరిస్తున్నాయి
 
ప్రెస్‌మీట్‌లో మంత్రి  దాడిశెట్టి రాజా స్పష్టీకరణ

తుని:  ముఖ్య‌మంత్రి వైయ‌స్‌ జగన్ హయాంలో విద్యారంగం స్వర్ణయుగమ‌ని ఆర్‌ అండ్‌ బీ మంత్రి దాడిశెట్టి రాజా పేర్కొన్నారు.  పేదలు పెద్ద చదువులు చదువుకుంటుంటే యనమలకు ఎందుకు కడుపుమంట? అని ప్ర‌శ్నించారు.  తుని నియోజకవర్గ దురదృష్టం కొద్దీ యనమల రామకృష్ణుడు అనే మహా మేధావి ఇక్కడ పుట్టాడు.  తాను పొరపాటున ఏపీలోనే పుట్టానని.. ఒకవేళ యూఎస్‌లో పుట్టి ఉంటే ఆ దేశ అధ్యక్షుడిని అయిపోయే వాడినని యనమల ఫీలవుతుంటాడ‌ని ఎద్దేవా చేశారు.  రాష్ట్రంలో విద్యా వ్యవస్థ గురించి ఆయన అనేక ప్రేలాపనలు పేలాడు.  రాష్ట్రంలోని ఏ పిల్లవాడిని అడిగినా విద్యా వ్యవస్థలో మార్పుల గురించి గొప్పగా చెబుతాడు.  నాడు–నేడు ద్వారా రాష్ట్రంలో పాఠశాలలు ఎంత అభివృద్ది చెందాయో ఇక్కడి వారికే కాదు.. ఇతర రాష్ట్రాల వారికీ తెలుసు. కేంద్ర బడ్జెట్‌లోనూ మన రాష్ట్ర బాటలో విద్యా వ్యవస్థలో నిధులు కేటాయించార‌ని మంత్రి తెలిపారు.

బాత్‌రూమ్‌లూ కట్టలేని మీరు..!:
– వెయ్యి సీబీఎస్సీ స్కూల్స్‌కి రాష్ట్రంలో గుర్తింపు లభించింది.
– 50 వేలకు పైగా శాటిలైట్‌ ఫౌండేషన్‌ స్కూల్స్‌ రాష్ట్రంలో ఉన్నాయని చెప్పడానికి గర్వ పడుతున్నాం.
– విదేశీ విద్య కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల విద్యార్థులకు రూ.1.25 కోట్ల వరకు, ఇతర విద్యార్థులకు కోటి రూపాయల వరకు ఫీజు రీయింబర్స్‌ చేస్తున్న ఘనత మా సీఎం శ్రీ వైయస్‌ జగన్‌కే దక్కింది.
– ఇంకా ఆ విద్యార్థులకు వీసా, ఫ్టైట్‌ టికెట్‌ ఛార్జీలు కూడా చెల్లిస్తున్నాం.
– చంద్రబాబు హయాంలో 75 శాతం పాఠశాలల్లో కనీసం బాత్‌రూమ్‌లు కూడా లేని పరిస్థితి.
– ఆడపిల్లలు స్కూల్‌కి వెళ్లి బాత్‌రూమ్స్‌ లేక ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలుసు.
– జగన్‌గారు సీఎం అయ్యాక నాడు–నేడు కింద ఎన్ని పాఠశాలలను సమూలంగా అభివృద్ధి చేశారో కళ్లుండి చూస్తే కన్పిస్తాయి.
– వసతి దీవెన కింద 10.50 లక్షల విద్యార్థులకు ఒక్కొక్కరికి 20 వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది.
– విద్యా దీవెన కింద ప్రతి మూడు నెలలకు రూ.700 కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం మాది.
– రూ.1700 కోట్లతో 44,392 పాఠశాలల్లో 37.63 లక్షల విద్యార్థులకు గోరుముద్ద ద్వారా లబ్ధి చేకూరుతోంది.

యనమల ఎందుకీ ప్రేలాపనలు?:
– మా ప్రభుత్వం వచ్చిన తర్వాత యనమల స్వగ్రామం ఏవీ నగరంలో నాడు–నేడు మొదటి దశలో పాఠశాలలకు రూ.60 లక్షలు ఖర్చు చేశాం.
– రెండో దశలో కోటి రూపాయల పనులు జరుగుతున్నాయి.
– ప్రేలాపనలు పేలడం కాదు యనమల.. కావాలంటే నేను వచ్చి ఆ పనులు చూపిస్తాను.
– నీ ఊరికి కిలోమీటరన్నర దూరంలో ఉన్న బెండపూడి హైస్కూల్‌ పిల్లల ఇంగ్లీష్‌ ప్రతిభను దేశ, విదేశీయులు ప్రశంసించారు.
– విదేశీయులు సైతం బెండపూడి పాఠశాలను పరిశీలించి రాష్ట్రంలో విద్యా వ్యవస్థను అభినందించారు.
– బెండపూడి స్కూల్‌ కూడా నీ ఇంటికి దగ్గరే కదా.. ఆ స్కూల్‌ పిల్లలతో కూడా మాట్లాడిస్తాను.
– అసందర్భ ప్రేలాపనలు పేలుతున్నావ్‌ కాబట్టే నేను సమాధానం చెబుతున్నా.

మీ ఊళ్లో హైస్కూల్‌ కూడా కట్టలేదు:
– మీ ఊర్లో అప్పర్‌ ప్రై మరీ స్కూల్‌ను హైస్కూల్‌ చేయాలని గ్రామస్థులంతా నిన్ను కోరితే, మన ఊర్లో పని చేయడానికి ఎవరుంటార్రా అని నీవన్న విషయం గుర్తులేదా..?
– 2014 నుంచి 2019 వరకూ ఇదే అంశాన్ని నేను ప్రస్తావిస్తే ఏమీ చేయలేక చచ్చినట్లు హైస్కూల్‌ తీసుకొచ్చావ్‌.
– ఆ హైస్కూల్‌ మంజూరు చేయించినా, బిల్డింగ్‌ కట్టలేదు. మొక్కుబడిగా కళ్యాణ మండపంలో నడిపారు.
– కానీ మా ప్రభుత్వం వచ్చాక, సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ నీ సొంత ఊళ్లో హైస్కూల్‌ కోసం భవనం కట్టించారు.
– ఇదంతా మర్చిపోయిన నీవు, ఇవాళ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుతుంటే ఛీ అనిపిస్తోంది

చంద్రబాబునీ వదలకు..:
– లోకేశ్‌ పాదయాత్ర ఫెయిల్‌ అయ్యింది. రాష్ట్రం మొత్తం అతన్ని బఫూన్‌  అని పిలుస్తున్నారు
– నువ్వు నెంబర్‌ 2 అంటారు. ఎన్టీఆర్‌నే వెన్ను పోటు పొడిచిన చరిత్ర నీది
– లోకేశ్‌ పాదయాత్రపై ఆడియో లీకులు ఇచ్చి టీడీపీని సొంతం చేసుకునే పనిలో అచ్చెన్నాయుడు ఉన్నాడు.
– నువ్వు మీ పార్టీలో నెంబర్‌ 2 కదా. అచ్చెన్నాయుడు కైవసం చేసుకోక ముందే పార్టీని నువ్వు తీసేసుకో.

తగిన బుద్ధి చెబుతాం:
– ఇక్కడ విద్యా రంగంలో అమలు చేస్తున్న సంస్కరణలు, నాడు–నేడు కింద పాఠశాలల్లో సమూల మార్పులు ఇతర రాష్ట్రాల వారిని కూడా ఆకర్షిస్తున్నాయి.
– ఇక్కడికి వచ్చి వాటిని చూస్తున్న ఆయా రాష్ట్రాల వారు, తమ దగ్గరా వాటిని అమలు చేస్తూ.. సీఎం శ్రీ వైయస్‌ బాటలో నడుస్తున్నారు.
 – మీ సీఎంగారు పిల్లల భవిష్యత్తుకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. రాబోయే రోజుల్లో వారు ఈ పోటీ ప్రపంచంలో నిలబడేలా వారిని తీర్చి దిద్దుతున్నారు. ఆ దిశలోనే విద్యా రంగంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు.
– ఈ మూడున్నర ఏళ్లలోనే ఒక్క విద్యా రంగంలోనే సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ దాదాపు రూ.56 వేల కోట్లు వ్యయం చేశారంటే, దీనిపై ఆయనకు ఉన్న చిత్తశుద్ధి ఏమిటన్నది అందరికీ అర్ధం అవుతోంది.
– అందుకే యనమల.. ఇకనైనా ఈ అసందర్భ ప్రేలాపనలు కట్టి పెట్టు.
– లేదంటే నీ ఇంటికి వచ్చి మీ ఊర్లో జరిగిన స్కూల్‌ అభివృద్ధిని స్వయంగా చూపించి, చెప్పుతో కొట్టినట్లుగా తగిన బుద్ధి చెబుతాం.

Back to Top