అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకోవాలి...

కృష్ణా: అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకోకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రక్షణనిధి హెచ్చరించారు. వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో నిర్వహించిన అగ్రిగోల్డ్‌ బాధితుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులు ఎక్కువగా ఉన్నా బాధితులకు న్యాయం చేయడంలేదని మండిపడ్డారు.అగ్రిగోల్డ్‌ ఆస్తులను దోచుకోవడంలో ఉన్న శ్రద్ధ న్యాయం చేయాలని లేకపోవడం దురదృష్టకరం అన్నారు.వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్‌ బాధితులకు ప్రతి పైసా చెల్లిస్తామన్నారు.

Back to Top