గ్లోబల్‌ ఎడ్యుకేషన్, స్టార్టప్‌ కాంగ్రెస్‌ ఎక్స్‌పో బ్రోచ‌ర్‌ విడుదల

అమరావతి: గ్లోబల్‌ ఎడ్యుకేషన్, స్టార్టప్‌ కాంగ్రెస్‌ ఎక్స్‌పో బ్రోచ‌ర్‌ను మంత్రులు ఆదిమూలపు సురేష్, మేకపాటి గౌతమ్‌రెడ్డి విడుదల చేశారు. టెక్‌మార్క్‌ ఇండియా సౌజన్యంతో నవంబర్‌ 18, 19, 20న విశాఖలో సదస్సు  నిర్వహిస్తున్నట్లు మంత్రులు తెలిపారు. విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులతో పాటు  ఉద్యోగ అవకాశాలపై సీఎం వైయస్‌ జగన్‌ దృష్టి సారించారని చెప్పారు. రాబోయే రోజుల్లో ఏపీ విద్యా నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా ..పెట్టుబడులకు ప్రపంచ వ్యాప్తంగా కంపెనీలను ఆకర్శించే దిశగా అడుగులు వేస్తుందన్నారు.

ఐటీ, విద్యా నైపుణ్యం, స్టార్టప్‌ హబ్‌గా ఆంధ్రప్రదేశ్‌ మారుతుందని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు. సాంకేతికతతోనే చిన్నారులకు, యువతకు భవిష్యత్‌ ఉంటుందన్నారు. విద్యకు..టెక్నాలజీ, నైపుణ్యం జోడించినప్పుడే మరింత ప్రయోజనం కలుగుతుందన్నారు. yì జిటల్‌ లైబ్రరీ, ఇంటర్నెట్, టెక్నాలజీ, నైపుణ్యాలకు పెద్ద పీట వేస్తున్నామని చెప్పారు. బాబు వస్తే జాబు వస్తుందనే ఆర్భాటపు ప్రచారాలు చేసిన ప్రభుత్వాలను చూశామని తెలిపారు. కానీ సీఎం వైయస్‌జగన్‌ నాయకత్వంలో హామీలకు మించి చేస్తున్నామని మంత్రి సురేష్‌ తెలిపారు. దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా లక్షలాది ఉద్యోగాలిచ్చామని పేర్కొన్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top