పండుగ‌లా `గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం`

సంక్షేమ పాల‌న‌ను వివ‌రిస్తూ ముందుకుసాగుతున్న ఎమ్మెల్యేలు

ప్ర‌తీ గ‌డ‌ప‌కూ వెళ్లి ప్ర‌జ‌ల స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌రిస్తున్న ప్ర‌జాప్ర‌తినిధులు

తాడేప‌ల్లి: గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం రాష్ట్ర వ్యాప్తంగా పండుగ‌లా ప్రారంభ‌మైంది. ప్ర‌జా ఆశీర్వాదంతో అఖండ మెజార్టీతో అధికారంలోకి వ‌చ్చిన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ‌డిచిన మూడేళ్ల‌లో మేనిఫెస్టోలో చెప్పిన‌దానికంటే ఎక్కువ‌గా, పాద‌యాత్ర‌లో ఇచ్చిన మాట‌కంటే మిన్న‌గా పాల‌న సాగిస్తోంది. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం సంక్షేమ‌, అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో ప‌రుగులుపెడుతోంది. సాచ్యురేష‌న్ మోడ్‌లో ప్ర‌తి గ‌డ‌ప‌కూ సంక్షేమ ప‌థ‌కాలు అందుతున్నాయి. ఈ నేప‌థ్యంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ సర్కారు మూడేళ్ల పాలన సందర్భంగా బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.  

మునుపెన్నడూ లేనివిధంగా పెద్దఎత్తున సంక్షేమ పథకాలను వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం అమలుచేసింది. అర్హ‌త ఉన్న‌వారంద‌రికీ సంక్షేమం సాయం చేర్చింది. ఈ నేపథ్యంలో.. అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను గడప గడపకు పంపించి ప్రజల నుంచి సలహాలను, సూచనలను తీసుకోవాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది. ప్ర‌జా ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మానికి ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. సంక్షేమ ప‌థ‌కాలు త‌మ కుటుంబాల‌కు ఎంతో ఆస‌రాగా నిలిచాయ‌ని వివ‌రిస్తున్నారు. కోవిడ్ క‌ష్ట‌కాలంలో సంక్షేమ సాయం అందించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు జ‌న‌మంతా కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నారు. `అస‌ని` తుపాన్ వ‌ల్ల ప‌లు చోట్ల చిరుజ‌ల్లులు కురుస్తున్న‌ప్ప‌టికీ కార్య‌క్ర‌మం కొన‌సాగుతూనే ఉంది.

గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా అవినీతికి ఆస్కారం లేకుండా  జవాబుదారీతనంతో పారదర్శకంగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే పథకాలను చేరవేస్తుండడంతో ప్రజల్లో వైయ‌స్ జ‌గ‌న్‌ప్రభుత్వం పట్ల మరింత విశ్వాసం పెరిగింది. ఇక ప్రభుత్వం ప్రకటించిన నవరత్నాల వార్షిక క్యాలెండర్‌ ప్రకారం.. లబ్ధిదారులకు గత మూడేళ్లుగా నేరుగా నగదు బదిలీని అమలుచేసింది. ఈ నేపథ్యంలో.. ఈ పథకాల అమలులో మరింత సామర్థ్యాన్ని పెంచేందుకు వీలుగా ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించడమే లక్ష్యంగా ‘గడప గడపకు మన ప్రభుత్వం’ నిర్వహిస్తున్నారు.  అలాగే, ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు, కార్యక్రమాల పట్ల ప్రజల్లో మరింత అవగాహన, చైతన్యం కల్పిస్తున్నారు. చివరి లబ్ధిదారునికి కూడా పథకాలు అందుతున్నాయా లేదా అనే విషయాన్ని ప్ర‌జ‌ల నుంచే  ఎమ్మెల్యేలు తెలుసుకుంటున్నారు. 

Back to Top