గ‌డ‌ప గ‌డ‌ప‌లో ఘ‌న స్వాగ‌తం

నంద్యాల‌:  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల‌తో రాష్ట్ర‌వ్యాప్తంగా గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం నిర్వీరామంగా సాగుతోంది. నంద్యాల జిల్లా శ్రీ‌శైలం నియోజ‌క‌వ‌ర్గం మహానంది మండ‌లం అబ్బీపురంలో ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి  గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా గ్రామంలో ఆయ‌న‌కు అపూర్వ స్వాగ‌తం ప‌లికారు. ప్ర‌తి ఇంటి వ‌ద్ద ల‌బ్ధిదారులు ఎదురెళ్లి త‌మ‌కు ప్ర‌భుత్వం నుంచి అందిన సంక్షేమ ప‌థ‌కాల‌ను వివ‌రిస్తూ..మ‌ళ్లీ జ‌గ‌న‌న్న ప్ర‌భుత్వ‌మే రావాల‌ని ఆశీర్వ‌దించారు.  ప్రతి గడప దగ్గర హారతులు, పూలమాలతో ఎమ్మెల్యేకు స్వాగతం ప‌లుకుతున్నారు.  ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం నుంచి అందిన పథకాల గురించి వివరిస్తూ.. ప్ర‌జ‌ల సమస్యలను తెలుసుకుంటూ..వాటిని ప‌రిష్క‌రిస్తున్నారు. 

తాజా వీడియోలు

Back to Top