జోరు వాన‌లోనూ కొన‌సాగుతున్న `గ‌డ‌ప గ‌డ‌ప‌కు  మ‌న ప్ర‌భుత్వం`

రేగ‌డ‌గూడురు గ్రామంలో ఎమ్మెల్యే శిల్పాచ‌క్ర‌పాణిరెడ్డికి అపూర్వ స్వాగ‌తం

నంద్యాల‌: శ్రీ‌శైలం నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి చేప‌ట్టిన గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం నిర్వీరామంగా కొన‌సాగుతోంది. సోమ‌వారం వెలుగోడు మండ‌లం రేగ‌డ‌గూడురు గ్రామంలో 66వ రోజు కార్య‌క్ర‌మాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. జోరుగా వ‌ర్షం కురుస్తున్నా లెక్క చేయ‌కుండా ప్ర‌తి గ‌డ‌ప వ‌ద్ద‌కు వెళ్లిన ఎమ్మెల్యే ప్ర‌భుత్వ ప‌థ‌కాల అమ‌లు తీరును అడిగి తెలుసుకున్నారు. ఇంకా ఏమైనా స‌మ‌స్య‌లు ఉంటే చెప్పాలంటూ వారి నుంచి వ‌చ్చిన ఫిర్యాదుల‌కు అక్క‌డిక్క‌డే ప‌రిష్కారం చూపుతున్నారు. గ్రామంలో ప‌ర్య‌టిస్తున్న చ‌క్ర‌పాణిరెడ్డికి వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, గ్రామ ప్ర‌జ‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. మ‌హిళ‌లు హార‌తి ప‌ట్టి, పూల‌వ‌ర్షం కురిపించారు. ఊరంతా పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొంది. తామంతా వైయ‌స్ జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తుగా ఉంటామ‌ని, మ‌ళ్లీ వైయ‌స్ జ‌గ‌న్‌ను ముఖ్య‌మంత్రిని చేసుకుంటామ‌ని ప్ర‌జ‌లు ఎమ్మెల్యేకు ఎదురెళ్లి చెబుతున్నారు. సంక్షేమ పథకాల ద్వారా మాకు జగనన్న మంచి పరిపాలన అందిస్తున్నాడు.. మళ్ళీ జగనన్న నే ముఖ్యమంత్రిగా చేసుకుంటాం అని శిల్పా చక్రపాణి రెడ్డి  కి ప్రజలు హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు   వేల్పనూరు-రేగ‌డ‌గూడురు ప్ర‌ధాన ర‌హ‌దారి అధ్వాన్నంగా ఉండేద‌ని, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ ప్ర‌భుత్వం వచ్చాక రోడ్డు నిర్మించి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించార‌ని ఎమ్మెల్యేకు గ్రామస్తులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.   

తాజా వీడియోలు

Back to Top