మూడేళ్లలో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి

 గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి

ఉరవకొండ: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా గడపగడపకు సంక్షేమ పథకాలు అందిస్తూ.. అవినీతికి తావులేని సుపరిపాలనను సిఎం జగన్‌ కొనసాగిస్తున్నారని ఉరవకొండ వైయ‌స్ఆర్‌సీపీ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. ఉరవకొండ మండలం రాకెట్ల తాండా గ్రామంలో మంగళవారం మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామస్తులు మాజీ ఎమ్మెల్యే కు ఘనంగా స్వాగతం పలికారు. ప్రతి గడపకు వెళ్లి సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ అందిస్తున్న పథకాలను ఆయన వివరించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రతీ పథకం అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తున్నామన్నారు. లబ్ధిదారులతో కలిసి ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎటువంటి అవినీతికి తావు లేకుండా లబ్ధిదారులకు నేరుగా సంక్షేమ ఫలాలు అందిస్తు దేశంలోనే అత్యంత పారదర్శకవంతమైన పాలలను జగన్ చేస్తున్నారని అన్నారు. తాము గడప గడపకు వెళ్లిన సందర్భంగా పలువురు లబ్ధిదారులు వైయ‌స్ జగన్ పాలనపై సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.లబ్ధిదారుల చిరునవ్వులే వైయ‌స్ జ‌గ‌న్‌ అందిస్తున్న సంక్షేమానికి నిదర్శనం అన్నారు. గడిచిన మూడేళ్ల పాలనలో రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయన్నారు.ఈ కార్యక్రమంలో బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ రమణ,ఎంపీపీ చందా చంద్రమ్మ, జెడ్పిటిసి ఏసీ పార్వతమ్మ, సర్పంచ్ శివమ్మ, జిల్లా అధికార ప్రతినిధి వీరన్న, పెన్నహోబిలం ఆలయ కమిటి చైర్మన్ అశోక్ కుమార్,బెస్త,కురుబ కార్పొరేషన్ల డైరెక్టర్లు కేవీ రమణ,కౌడికి గోవిందు, ఆమిద్యాల పిఏసీస్ చైర్మన్ తేజోనాత్, నాయకులు సీనా నాయక్, నాగరాజు, శ్రీనివాసులు,రామిరెడ్డి,సాలమ్మ,భరత్ రెడ్డి,చంగల మహేష్,నిమ్మల రమణ తహశీల్దార్ బ్రహ్మయ్య, ఈఓఆర్డీ దామోదర రెడ్డి, ఇతర అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు, వైయ‌స్సార్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top