ఎచ్చెర్ల: సంక్షేమం.. అభివృద్ధి రెండూ కళ్ళుగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ అన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం ఎచ్చెర్ల మండలం తోటపాలెం గ్రామ సచివాలయం పరిధిలోని అఖింఖాన్ పేట, పెయ్యలవానిపేట గ్రామాల్లో గడపగడపకు-మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 548 ఇళ్లను ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్బంగా గొర్లె కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి గడప గడపకు-మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నామని, వాటిని పరిష్కరించేందు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు సక్రమంగా అందుతున్నాయ లేదా అని తెలుసుకుంటున్నామని చెప్పారు. ప్రజా రంజక పాలన సాగిస్తున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పై నిత్యం ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా అసత్య ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. ప్రజలకు వాస్తవం తెలుసునని అందుకే వారి ఆరోపణలను ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఎవరెన్ని ఆరోపణలు చేసినా వైయస్ జగన్ మాత్రం సంక్షేమం.. అభివృద్ధి రెండు కళ్లుగా భావించి పాలన సాగిస్తున్నారన్నారు. పార్టీలకతీతంగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తూ దేశానికి ఆదర్శనీయంగా నిలిచారన్నారు. గ్రామ సచివాలయం వ్యవస్థ ద్వారా ప్రజల చెంతకే పాలన తీసుకొచ్చారని తెలిపారు. నాడు-నేడు ద్వారా విద్యా వ్యవస్థ లో అనూహ్య మార్పులు తెచ్చారని చెప్పారు. కార్యక్రమంలో ఎచ్చెర్ల మండలం ఎంపీపీ మొదలవలస చిరంజీవి, ఎస్ఎం పురం పీఏసీఎస్ చైర్మన్ సనపల నారాయణరావు, జే.సి.యస్ ఇంచార్జి మూగి శ్రీరాములు,రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు కళ్లేపల్లి తిరుపతిరావు,నక్క కృష్ణమూర్తి వైస్ ఎంపీపీ ప్రతినిధి బెండు రామారావు, తదితరులు పాల్గొన్నారు.