సత్యసాయి జిల్లా: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు హిందూపురం నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం దిగ్విజయంగా సాగుతోంది. వైయస్ఆర్‌సీపీ నియోజకవర్గ ఇంచార్జ్ టీఎన్ దీపిక హిందూపురం మండలం చౌళూరు గ్రామపంచాయతీలో మంగళవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ నాయకురాలు చౌళూరు మధుమతి రెడ్డి , సర్పంచ్ నంజప్ప, ఎంపీపీ రత్నమ్మ,ఎంపీటీసీ కృష్ణవేణి ఆధ్వర్యంలో దీపికకు ఘన స్వాగతం పలికారు. పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో కలిసి దీపిక ప్రతి గడపకు వెళ్లి జగనన్న ప్రభుత్వం చేస్తున్న అబివృద్ధి , వారి కుటుంబాలకు అందుతున్న సంక్షేమ పథకాల లబ్ధి వివరాలను వివరిస్తూ ఆమె ముందుకు సాగారు. ప్రజలతో మమేకమై ఆప్యాయంగా పలకరిస్తూ సీఎం వైయస్ జగన్ ఇస్తున్న అనేక సంక్షేమ పథకాలు మీకు అందుతున్నాయా? లేదా?..అందకపోతే ఎందుకు రాలేదు అని ప్రజలను, వాలంటీర్ల ను, అధికారులను అడిగి తెలుసుకున్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలని అధికారులను ఆదేశించారు. హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ ఏనాడు ఈ విధంగా ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలను పట్టించుకోలేదని, ఈసారి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో లోకల్ అభ్యర్థి అయిన బీసీ మహిళ టీఎన్ దీపికను అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని గ్రామ ప్రజలు పేర్కొన్నారు. వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ నాగభూషణం,ఎంపీపీ రత్నమ్మ,సర్పంచ్ నంజప్ప, యు ఆర్ డి ఓ నటరాజ్, వైస్ ఎంపీపీ రామంజి,ఎంపీటీసీ కృష్ణవేణి, మండల కన్వీనర్ రాము,సింగల్ విండో అధ్యక్షులు రంగనాథ్,మాజీ సర్పంచ్ లు రాజు,బసప్ప,నాయకులు లోకేష్ రెడ్డి, సంతేబిదునురు రాజు,దాలప్ప, చంద్ర,చౌడప్ప జంగాలపల్లి సోమశేఖర్ రెడ్డి, వీరంపల్లి సుధాకర్ రెడ్డి ,ఓబుల్ రెడ్డి, సడ్లపల్లి బాబు రెడ్డి, , అనిల్ రెడ్డి, తిమ్మారెడ్డి , మలుగూరు సుధాకర్ రెడ్డి, వాసులాల్, విజయ్, స్థానిక నాయకులు, పి ఎన్ రామంజప్ప,నాగరాజు,సురేష్, సూరి, ముసాదిక్, రాజేష్, బాలు, ఉపేంద్ర, నవీన్, ప్రకాష్, గంగాధరప్ప, నాగరాజు, రామకృష్ణ, సుబ్బరెడ్డి, సాయి ప్రసాద్, అశోక్, ప్రసన్న, తలారి నరసింహప్ప, అజయ్ రెడ్డి, అశ్వత్తమ్మ, విజయమ్మ, సావిత్రమ్మ, తదితర అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు,సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు...