అధికార లాంఛ‌నాల‌తో పెనుమత్స అంత్య‌క్రియ‌లు

అధికారుల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశం

తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్ సీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి పెనుమ‌త్స సాంబ‌శివ‌రాజు  పార్ధివ దేహానికి అధికార లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించాల‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించారు. ఈ మేరకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పెనుమ‌త్స సాంబ‌శివ‌రాజు  విశాఖ అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉద‌యం తుదిశ్వాస విడిచారు. పెనుమ‌త్స మృతిప‌ట్ల ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ తీవ్ర సంతాపం వ్య‌క్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఏకైక నాయకుడిగా ఆయన గుర్తింపును సొంతం చేసుకున్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top