వరద బాధితులకు ఉచితంగా నిత్యావసరాలు

తాడేప‌ల్లి :  రాష్ట్రంలోని వరద బాధితులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయనుంది. వారానికిపైగా వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో ఈ సరుకులు పంపిణీ చేయనున్నారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. ఒక్కో కుటుంబానికి 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, లీటర్‌ పామాయిల్‌, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళా దుంపలు ఇవ్వాలని ఆదేశించింది. కాగా వాయుగుండం ప్రభావంతో ఇటీవల రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు అనేక ప్రాంతాలు నీటి మునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  

వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో కాసేప‌ట్లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఏరియ‌ల్ స‌ర్వే

 ఇటీవ‌ల కురిసిన వ‌ర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి వ‌చ్చిన వ‌ర‌ద నీటి కార‌ణంగా ప‌లు ప్రాంతాలు, పంట‌లు నీట మునిగాయి. వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల‌ను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కాసేప‌ట్లో ఏరియ‌ల్ స‌ర్వే ద్వారా ప‌రిశీలించ‌నున్నారు. కృష్ణా, గోదావ‌రి న‌దీ ప్రాంతాల్లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వ‌ర‌ద పరిస్థితిని ప‌రిశీలించ‌నున్నారు. 

Back to Top