వైయ‌స్ఆర్ సీపీలోకి మాజీ ఎమ్మెల్సీ అంగూరి ల‌క్ష్మీ శివ‌కుమారి

తాడేప‌ల్లి: పాయకరావుపేట నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో వైయ‌స్ఆర్ సీపీ అధినేత‌, ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ సమక్షంలో అంగూరి లక్ష్మీ శివకుమారి వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కండువా క‌ప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్‌ఆర్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ పి.వి.మిథున్‌రెడ్డి పాల్గొన్నారు.

Back to Top