దిగజారుడు రాజకీయాలకు కేరాఫ్‌ అడ్రస్ చంద్రబాబు

సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి

జనాగ్రహ దీక్షలో మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి

ఉరవకొండ: దేశ రాజకీయాల్లో అత్యంత దిగజారుడు విధానాలకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ అని మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. సీఎం వైయ‌స్‌ జగన్‌పై టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఉరవకొండలో వైయ‌స్ఆర్ సీపీ నేతలు ‘జనాగ్రహ దీక్ష’  చేప‌ట్టారు. ఈసందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చి, అది విఫలం కావడంతో 36 గంటల దీక్షకు చంద్రబాబు దిగారని ఎద్దేవా చేశారు. బాబు చేపట్టిన దీక్ష అప్రజాస్వామికమని అది ఒక బూటకపు దీక్షగా అభివర్ణించారు. రాజకీయ విమర్శ చేయవచ్చు కానీ వ్యక్తిగతంగా విమర్శించకూడదని హితవు పలికారు. రాష్ట్రంలో అన్ని ఎన్నికల ఫలితాలతో ఓటమి చవిచూసిన తరువాత టిడిపికి ఇక పుట్టగతులు ఉండవని అర్ధమైన చంద్రబాబు, లోకేశ్‌లు ఏదో రకమైన కుట్ర రాజకీయాలు చేసి, ప్రజల్లో భావోద్వేగాలు పెంచి శాంతిభద్రతలకు భంగం కలిగించి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని మండిప‌డ్డారు. పట్టాభి వెనుక ఉండి మాట్లాడించింది చంద్రబాబేన‌ని, అందుకే పట్టాభి వ్యాఖ్యలను ఇప్పటికి వరకు తప్పుబట్టలేదన్నారు. బూతు వ్యాఖ్యలకు చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ గోవిందు, విడపనకల్లు జెడ్పిటిసీ హనుమంతు, సర్పంచ్ లలితమ్మ, ఎంపిపి చంద్రమ్మ, వైస్ ఎంపిపి శ్రీనాత్ రెడ్డి, పెన్నహోబిలం ఆలయ కమిటీ చైర్మన్ అశోక్ కుమార్, ఆమిద్యాల పిఏసీఎస్ చైర్మన్ తేజోనాథ్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ సుశీలమ్మ, వైయ‌స్ఆర్ సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top