వైయ‌స్ జగన్ పాలనలో మహిళలకు ఆత్మగౌరవం పెరిగింది

మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి

ఎవరిపైన ఆధారపడకుండా ధైర్యంగా జీవించేస్థాయికి తీసుకువచ్చారు

మేలు జరిగి ఉంటే అండగా నిలవాలని కోరిన దమ్మున్న సీఎం వైయ‌స్ జగన్

వచ్చే ఎన్నికల్లో మోసగాళ్లకు ఓటుతో బుద్ది చెప్పండి

ఉరవకొండలో వైయ‌స్ఆర్ చేయూత' నిధులు విడుదల 

4600 మంది మహిళలకు రూ.8.62 కోట్ల మెగా చెక్కును అందించిన మాజీ ఎమ్మెల్యే

ఉరవకొండ: ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి పాలనలో మహిళల సంక్షేమానికి పెద్దపీట వేసి ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చారని వైయ‌స్ఆర్‌సీపీ ఉరవకొండ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి అన్నారు. సోమవారం ఉరవకొండ మండల కార్యాలయం ఆవరణలో వైయ‌స్ఆర్ చేయూత సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళల అభ్యున్నతికి సీఎం వైయ‌స్ జగన్ పెద్దపీట వేసి అండగా నిలిచారని వెల్లడించారు. మహిళల అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేపట్టిన చర్యలతో రాష్ట్రంలో వారి ఆత్మగౌరవం పెరిగిందన్నారు. 

రాష్ట్రంలో ఇళ్లు లేని ప్రతి పేద మహిళకు సొంతింటి కలను నేరవేర్చాలన్న మంచి ఉద్దేశ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల మంది లబ్దిదారులకు ఇంటిస్థలాలు కేటాయించడంతో పాటు వారికి ఇళ్లు కూడ మంజురు చేసినట్లు తెలిపారు. అతంటితో ఆగకుండా ఇంటి స్థలాలు అందుకున్న లబ్దిదారులకు ఓక్క రూపాయి కూడా ఖర్చులేకుండా ప్రభుత్వమే వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి పత్రాలు అందజేయడం చారిత్రాత్మకమన్నారు. 

ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధిని కొనసాగిస్తున్నట్లుగా గ్రామసచివాలయ వ్యవస్థ ద్వార గ్రామ వలంటీర్లు ప్రజల ఇంటివద్దకే వెళ్లి సేవలు అందిస్తున్నారని, అంగన్వాడీ కేంద్రాల్లో మంచి పౌస్టికాహారం అందచేస్తున్నట్లు వెల్లడించారు. నాడు- నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలే మార్చినట్లు పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో సచివాలయ, ఆర్బికేలు,హెల్త్ సెంటర్లు నిర్మించారన్నారు. ఇప్పటి వరకు జగన్ 125 సార్లు బటన్లు నొక్కి ప్రజల ఖాతాల్లో 2.70 లక్షల కోట్ల రూపాయలు నేరుగా జమ చేసారన్నారు. 

మీ కుటుంబానికి మేలు జరిగి ఉండే నాకు అండగా నిలవాలని వచ్చే ఎన్నికల్లో ఓటు వేయాలని ప్రజలకు పిలుపు నిచ్చిన ఏకైక నాయకుడు సీఎం జగన్ ఓక్కరేరని చెప్పారు. అందుకే ఈ సారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీకి అండగా నిలిచి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి చేసుకోవాలని పిలుపునిచ్చారు. 

అనంతరం మండలంలోని 4600 మంది లబ్ధిదారులకు 8 కోట్ల 62 లక్షల 25 వేల రూపాయల మెగా చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నరసింహులు, వైస్ ఎంపీపీ శ్రీనాత్ రెడ్డి, సర్పంచ్ లలిత, జెడ్పిటిసి పార్వతమ్మ, కమ్మ, కురుబ కార్పొరేషన్ల డైరెక్టర్లు తేజోనాథ్, ఎంపీడీఓ అమృత్ రాజ్, గోవిందు, నాయకులు బసవరాజు, ఏసీ ఎర్రిస్వామి, అశోక్ కుమార్,ఓబన్న, ఆసిఫ్, చంగల మహేష్, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Back to Top