ఉరవకొండ: దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రంలో లేని విదంగా 66 లక్షలా 34 వేల మందికి రూ.3 వేలు చొప్పున పింఛన్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని ఉరవకొండ వైయస్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి చెప్పారు .నియోజకవర్గంలోని కూడేరు మండల కార్యాలయం ప్రాంగణంలో వైయస్ఆర్ పెన్షన్ కానుక కింద పెంచిన రూ.3 వేల పింఛను పంపిణీ వారోత్సవాల సభకు మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, ఎంపీపీ నారాయణరెడ్డి, జెడ్పిటిసి అశ్విని, పార్టీ బిసి విభాగం జిల్లా అధ్యక్షుడు వీరన్న, పార్టీ మండల అధ్యక్షుడు బైరెడ్డి రామచంద్రారెడ్డి, వైస్ ఎంపీపీలు సుబ్బమ్మ, దేవా,జేసిఎస్ కన్వీనర్ దేవేంద్ర తదితరులు హాజరయ్యారు. ముందుగా సీఎం వైయస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి పింఛనుదారులు తమ అభిమానాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సంకల్పయాత్రలో పేదలు, వృద్ధులు, వితంతువుల కష్టాలను నేరుగా చూసిన జగన్ పింఛనును రూ.3 వేలకు వరకు పెంచుతానని ఇచ్చిన హామీని నూతన సంవత్సర కానుకగా అందచేశారని వెల్లడించారు. నాడు పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్లు 3 వేలకు పెంచి మాట తప్పని, మడమ తిప్పని నేతగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచారన్నారు. ఈ రోజు ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా పేర్కొన్నారు.వృద్ధులు, వితంతువులు, వికలాంగులపై అమిత ప్రేమ చూపుతున్న జగన్ గొప్ప మానవతావాదిగా ఆయన కొనియాడారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు మంచి చేస్తుంటే ఓర్వలేని ఎల్లో మీడియా నిత్యం ప్రభుత్వం మీద పడి ఏడుస్తోందన్నారు. ప్రతిపక్షాలు నిత్యం వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు, ప్రచారాలు చేస్తూ ప్రతిదీ రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చిన వైయస్ జగన్ మోహన్ రెడ్డికి మనమందరం అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.అనంతరం పెంచిన 3 వేలు పింఛను లబ్ధిదారులకు ఆయన అందజేశారు. కార్యక్రమంలో ఎంపిటిసి వెంకటలక్ష్మమ్మ, కో అప్షన్ సభ్యులు సర్దార్ వలి, జనరల్ సెక్రెటరీ తోపుదుర్తి రామంజి, రైతు విభాగం నాయకు సిద్దారెడ్డి, నీలకంఠ రెడ్డి, కిష్టప్ప, చంద్రశేఖర్, మంజునాథ్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, అధికారులు, వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాయకులు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్ లు,ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.