ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ ను మరోమారు ఆశీర్వదించండి

  'ఇంటింటికి మన విశ్వన్న' కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి

ఉరవకొండ: పేదల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని ఉరవకొండ నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ప్రజలను కోరారు. వజ్రకరూరు మండలం పందికుంట గ్రామంలో శనివారం 'ఇంటింటికి మన విశ్వన్న' కార్యక్రమంలో భాగంగా విశ్వేశ్వరరెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారం లో యాదవ కార్పొరేషన్ చైర్మన్ హరీష్ యాదవ్ పాల్గొన్నారు. ముందుగా గ్రామస్తులు పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేసిన మంచిని వారు వివరించారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు కే మీ ఓటు వేయాలని కోరారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి గడపకు వెళ్లి సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాలను వివరిస్తున్నట్లు వెల్లడించారు. తమకు అన్ని అందాయని, సంతోషంగా ఉన్నామని ప్రజలందరూ చెబుతున్నారన్నారు. నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారన్నారు. జగనన్న సంక్షేమ పథకాల వల్లే ధైర్యంగా ప్రజల్లోకి వెళ్తున్నామన్నారు. వచ్చే ఎన్నికలు పెత్తందారులు, పేదలకు మధ్య జరుగుతున్న ఎన్నికలుగా వారు అభివర్ణించారు.  ప్రచార కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Back to Top