ప్రజలకు మరింత మేలు జరగాలంటే సీఎంగా జగనే ఉండాలి

వై ఏపీ నీడ్స్ జ‌గ‌న్ కార్య‌క్ర‌మంలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వ‌ర‌రెడ్డి

వైయ‌స్ జగన్ పాలనలో విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత

జ‌నవరి నుంచి అవ్వా తాతలకు 3 వేలు పెన్షన్

నాలుగేళ్లలో రాష్ట్ర ప్రజలకు రూ.4.65 లక్షల కోట్లు అందించాం

ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ నిజమైన ప్రజాస్వామ్య వాది

టీడీపీ పాలనలో కండువాలు కప్పుకున్న వారికే పథకాలు

ప్రభుత్వంపై ఎల్లో మీడియా గోబెల్స్ ప్రచారం మానుకోవాలి

పాజిటివ్ ఏజెండా తోనే ఎన్నికలకు వెళతాం

చాబాలలో 'వై ఏపీ నీడ్స్ జగన్' కార్యక్రమం 

ఉరవకొండ: రాష్ట్ర ప్రజలకు రానున్న రోజుల్లో కూడా మరింత మేలు జరగాలంటే రాష్ట్రానికి మరోమారు ముఖ్యమంత్రి గా వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఉండాలని ఉరవకొండ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. వజ్రకరూరు మండలం చాబాల గ్రామంలో గురువారం "వై ఏపీ నీడ్స్ వైఎస్ జగన్” కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా అధికారులు, సచివాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులతో కలిసి సంక్షేమ పథకాల డిస్ప్లే బోర్డును ఆవిష్కరించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలి అంశంపై సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రజలకు ఎంత మేలు చేశారో ప్రజలకు వివరంగా చెప్పడానికే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ముఖ్యంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తన పాలనలో దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విదంగా విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. గడిచిన నలుగున్నరేళ్ల పాలనలో ప్రజలకు ప్రత్యక్షంగా పరోక్షంగా 4.65 లక్షల కోట్ల రూపాయలు అందించారని తెలిపారు. గత టీడీపీ పాలనలో అయితే తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్న వారికే పథకాలు అందేవని కానీ తమ పాలనలో కులం, మతం, పార్టీ లు చూడకుండా అర్హత ఉంటే చాలు సంక్షేమ పథకాలు అందించామన్నారు.

 రాష్ట్ర ప్రభుత్వం పై ఎల్లో మీడియా నిత్యం తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. జగన్ చేసిన అభివృద్ధిని దుష్ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. ఒకవైపు ప్రతిపక్షాలు మరోవైపు ఎల్లో మీడియా ఎన్ని దుష్ప్రచారాలు చేసిన తాము మాత్రం పాజిటివ్ ఏజెండా తోనే ఎన్నికలకు వెళతామని చెప్పారు. అందుకే ఏపీ జగనన్న ఎంత అవసరమో తెలియ చెప్పేందుకు వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని 45 రోజుల పాటు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జగదీష్, వజ్రకరూరు సర్పంచ్ మొనలిసా, ఎంపీపీ రమావత్ దేవి, ఎంపీడీఓ విజయలలిత, తహశీల్దార్ అనిల్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ సుశీలమ్మ, ఎంపీటీసీ పెన్నహోబిలం, పార్టీ మండల కన్వీనర్ సోమశేఖర్ రెడ్డి,మాజీ వైస్ ఎంపీపీ నారాయనప్ప, సుదీర్ రెడ్డి, వైద్యనాథ్ రెడ్డి, ఉస్మాన్,సామా నాయక్, మహనంద రెడ్డి, శ్రీనివాసులు మారెన్న, మోహన్, నాగరాజు,రామచంద్ర, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Back to Top