పార్టీల‌కు అతీతంగా సంక్షేమ ప‌థ‌కాలు

హంచనహల్‌లో `గడప గడపకు మన ప్రభుత్వం`లో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి

ఉరవకొండ: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పరిపాల‌న‌లో ప్ర‌జ‌లంతా సంతోషంగా ఉన్నార‌ని, `గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం`లో భాగంగా ఏ గ్రామానికి వెళ్లినా, ప్ర‌జ‌ల నుంచి అపూర్వ స్పంద‌న ల‌భిస్తోంద‌ని ఉర‌వ‌కొండ నియోజ‌క‌వ‌ర్గ వైయ‌స్ఆర్ సీపీ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వ‌ర్‌రెడ్డి అన్నారు. విడపనకల్లు మండలం హంచనహల్ (పెంచలపాడు) గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వ‌ర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ప్రతి గడపకు వెళ్లి ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు వివరించారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ నెరవేరుస్తున్నార‌ని వివ‌రించారు. పార్టీలకు అతీతంగా ప్రతీ పథకం అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వైస్సార్సీపీ నాయకులు,ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top