ఉరవకొండలో 'గడప గడపకు మన ప్రభుత్వం'

పాల్గొన్న నియోజకవర్గ వైయ‌స్ఆర్ సీపీ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వ‌ర్‌రెడ్డి

ఉరవకొండ: ఎన్నిక‌ల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్ర‌తీ హామీని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తూచా త‌ప్ప‌కుండా అమ‌లు చేస్తున్నార‌ని ఉర‌వ‌కొండ నియోజ‌క‌వ‌ర్గ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వ‌ర్‌రెడ్డి అన్నారు. ఉరవకొండ పట్టణంలోని 4వ వార్డులో సోమవారం 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమం అట్టహాసంగా నిర్వ‌హించారు. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వ‌ర్‌రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైయ‌స్ఆర్ సీపీ నాయకులు విశ్వేశ్వ‌ర్‌రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. మల్లేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వ‌హించిన అనంత‌రం ప్రతి గడపకు వెళ్లి సీఎం వైయ‌స్‌ జగన్ అందిస్తున్న పథకాలను ప్ర‌జ‌ల‌కు వివరించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో కలిసి ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం నెరవేర్చినట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రతీ పథకం అర్హులంద‌రికీ  అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, వైయ‌స్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Back to Top