సంక్షేమం, అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి

కమ్మూరు ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి

ఉరవకొండ: గత నలుగున్నరేళ్లలో రాష్ట్రంతో పాటు ఉరవకొండ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని, ఇచ్చిన సంక్షేమాన్ని చూసి తనను ఆశీర్వదించి ఎమ్మెల్యే గా గెలిపించాలని వైయ‌స్ఆర్‌సీపీ ఉరవకొండ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ప్రజలను కోరారు. బుధవారం కూడేరు మండలం కమ్మూరు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామ సర్పంచ్ రంగారెడ్డి, ఎంపీపీ నారాయణరెడ్డి, జెడ్పిటిసి అశ్విని, వైస్ ఎంపిపిలు దేవా, సుబ్బమ్మ, పార్టీ మండల కన్వీనర్ బైరెడ్డి రామచంద్రారెడ్డి, జేసిఎస్ కన్వీనర్ దేవేంద్ర, అగ్రి అడ్వైజరి బోర్డు చైర్మన్ నిర్మలమ్మ తదితరులతో కలసి 'ఇంటింటికీ మన విశ్వన్న' కార్యక్రమం నిర్వహించారు. ముందుగా గ్రామంలోని పెద్దమ్మ, మారెమ్మ ఆలయంలో మాజీ ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పలువురు పూలమాలలతో సత్కరించారు. మహిళలు హారతులు పట్టారు.ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రచార రథంపై పర్యటించారు. గ్రామస్తులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో మాత్రమే వచ్చే నాయకులను, వారు ఇచ్చే హామీలను నమ్మొద్దన్నారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి ఈ అభివృద్ధి, సంక్షేమాన్ని కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమ్మూరు నాయకులు, మండలంలోని పలువురు సర్పంచ్ లు,ఎంపిటిసిలు,  నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Back to Top