అనకాపల్లి: నర్సీపట్నంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడి అనుచరులు, తెలుగు దేశం కార్యకర్తలు సోమవారం రాత్రి నర్సీపట్నం వైయస్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్‌పై దాడిచేశారు. ఆయన కారు అద్దాలు ధ్వం సం చేశారు. కోర్టు స్టే ఉన్నా అనకాపల్లి జిల్లా నర్సీ పట్నం పెద్ద చెరువులో అక్రమంగా జరుగుతున్న సృష్టి క్షేత్రం పనులను అడ్డుకునేందుకు గణేశ్ వెళ్లారు. ఇంతలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు అనుచ రులు, టీడీపీ మూకలు అక్కడికి చేరుకున్నారు. కారు అక్కడ ఎందుకు పెట్టారంటూ వీరంగం సృ మాజీ ఎమ్మెల్యే గణేష్ తో టీడీపీ మూకలు వాగ్వాదం ష్టించారు. ఘటనాస్థలానికి వచ్చిన టౌన్ ఎస్ఐలు రమేష్, ఉమామహేశ్వరరావు సమక్షంలోనే టీడీపీ మూకలు గణేష్ కారు అద్దాలు ధ్వంసం చేశారు. అయినా గణేష్ సంయమనం పాటించారు. దాడిని ఖండించిన వైఎస్ జగన్ నర్సీపట్నంలో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పై జరిగిన దాడిని మాజీ సీఎం, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయ జగన్ ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. హైకోర్టు ఆదే శాలకు వ్యతిరేకంగా జరుగుతున్న కార్యక్రమాన్ని ప్రశ్నించినందుకు టీడీపీ ఎమ్మెల్యే, శాసనసభస్పీకర్ అయ్యన్నపాత్రుడు అనుచరులు ఉమాశం కర్ గణేష్‌ను అడ్డుకుని, ఆయన వాహనాన్ని ధ్వంసం చేయడం హేయమని పేర్కొన్నారు. 'ఒక మాజీ ప్రజాప్రతినిధి ఒక అంశాన్ని ప్రశ్నించి నందుకు దాడిచేయడం చంద్రబాబు హయాంలో పరిపాలన, శాంతిభద్రతల అమలు పూర్తిగా కుప్పకూలాయనడానికి నిదర్శనం. ఇలాంటి బరి తెగించిన, హింసాత్మక బెదిరింపులు సత్యాన్ని అణచివేయలేవు. ప్రభుత్వం ఆలస్యం చేయకుం డా చర్యలు తీసుకోవాలి. ఇందులో ప్రమేయం ఉన్న వారందరిపై కఠిన కేసులు నమోదు చేయా లి.' అని వైయస్ జగన్ డిమాండ్ చేశారు.