సుకుమార్‌రెడ్డికి పెద్దిరెడ్డి నివాళులు

రైల్వేకోడూరు : అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండల వైయ‌స్ఆర్‌సీపీ సీనియర్‌ నాయకుడు, వ్యవసాయ సలహా మండలి మాజీ చైర్మన్‌ పంజం సుకుమార్‌రెడ్డి (64)  కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ నిన్న క‌న్నుమూశారు. ఇవాళ ఆయ‌న భౌతిక‌కాయానికి వైయ‌స్ఆర్‌సీపీ రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్‌, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి నివాళుల‌ర్పించారు. కుటుంబ స‌భ్యుల‌ను ఓదార్చి ధైర్యం చెప్పారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం అశ్రున‌య‌నాల మ‌ధ్య‌ అంతిమయాత్ర నిర్వ‌హించారు. కార్య‌క్ర‌మంలో మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాష,  మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు, రాజంపేట మాజీ శాసనసభ్యురాలు, సీనియర్ నాయకులు కొండూరు ప్రభావతమ్మ , కడప పార్లమెంట్ నియోజకవర్గ ప‌రిశీల‌కుడు కొండూరు అజయ్ రెడ్డ, పుల్లంపేట ఎంపీపీ ముద్ద బాబుల్ రెడ్డి, యువనాయకులు పంజం సందీప్ రెడ్డి, వైస్ ఎంపీపీ ధ్వజా రెడ్డి , ఉపసర్పంచ్ తోట శివసాయి, జెడ్పీటీసీ రత్నమ్మ, తల్లెం భరత్ రెడ్డి, ఎంపీటీసీ బండారు మల్లికార్జున, విజయకుమార్ రెడ్డి, చెవ్వు శ్రీనివాసులు రెడ్డి, వతలూరు సాయికిషోర్ రెడ్డి, వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

Back to Top