ప్రతిపక్షాలకు వణుకు పుట్టి అందరూ కలిసి వస్తున్నారు

మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌

విజ‌య‌వాడ‌:  సీఎం వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డిని చూసి ప్రతిపక్షాలకు వణుకు పుట్టి అందరూ కలిసి వస్తున్నార‌ని మాజీ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్  అన్నారు. చంద్రబాబు గుంపును చూసి భయపడే ప్రసక్తే లేదన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు ధైర్యం ఉంటే సింగల్‌గా పోటీ చేయండి అంటూ స‌వాలు విసిరారు. గుంపుల్లా వచ్చిన ఎవరేం చేయలేరన్నారు. సీఎం వైయ‌స్ జగన్‌ను ఎదుర్కొనే సత్తా చంద్రబాబు, పవన్‌కు లేదన్నారు. సీఎం వైయ‌స్‌ జగన్ ప్రజలతో పొత్తులో ఉన్నారు. చంద్రబాబు ఎప్పుడు పొత్తులతోనే పోటీ చేస్తాడ‌ని విమ‌ర్శించారు. ప్రజలకు మంచి చేసే వాడికి పొత్తులు ఎందుకు. మా టార్గెట్ కుప్పం.. అక్కడి నుండే గెలుచుకొని వస్తామ‌న్నారు. వారిద్దరికీ ఏ నియోజకవర్గం నుండి నిలబడాలో క్లారిటీ లేదు. కుప్పం, మంగళగిరి కచ్చితంగా ఓడిపోతారని జోస్యం చెప్పారు. 

Back to Top