విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ట్రేడ్ మార్క్ అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కొనియాడారు. విజయవాడలో ఐదో విడత వైయస్ఆర్ వాహన మిత్ర నిధులు విడుదల కార్యక్రమంలో వెల్లంపల్లి శ్రీనివాస్ అధ్యక్ష ఉపన్యాసం చేశారు. గత ప్రభుత్వం ఏ వర్గాన్నీ పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ప్రజలకు ఏం కావాలో అదే సీఎం వైయస్ జగన్ అమలు చేస్తున్నారు. విజయవాడ అభివృద్ధికి సీఎం వైయస్ జగన్ అనేక నిధులు ఇచ్చారని చెప్పారు. సీఎం వైయస్ జగన్ ఆధ్వర్యంలోనే విజయవాడ అభివృద్ధి చెందిందని చెప్పారు.