చంద్రబాబు రోడ్డుషోలకు, లోకేష్‌ పాదయాత్రలకు ప్రజా స్పందన లేదు

మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌

విజయవాడ:  చంద్రబాబు రోడ్డుషోలకు, లోకేష్‌ పాదయాత్రలకు ప్రజా స్పందన లేదని, అందుకే వాళ్ల మీద వాళ్లే రాళ్లు వేయించుకుంటున్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ఎస్సీ ఎమ్మెల్యేలు, మంత్రులపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. లోకేష్‌ పాదయాత్ర చాలా దారుణంగా ఉందని, పది మంది కూడా పాల్గొనడం లేదన్నారు. మేకలకు, గొ్రరెలకు లోకేష్‌ దండం పెట్టుకుంటూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. జగనన్నే మన భవిష్యత్తు కార్యక్రమంపై భవానీపురం ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజి మంత్రివర్యులు వెలంపల్లి శ్రీనివాసరావు స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వెల్లంప‌ల్లి మాట్లాడుతూ.. ఈ నెల 7వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా మెగా పీపుల్స్ సర్వే  నిర్వహించడం జరుగుతుందన్నారు. మొదటి 15 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కోటి కుటుంబాలకు పైగా ఈ సర్వే లో పాల్గొనగా 79 లక్షలకు పైగా మిస్డ్ కాల్స్ జగనన్న పాలనకు మద్దతుగా వచ్చాయ‌న్నారు.  ఈ సర్వే కార్యక్రమంలో క్షేత్ర స్థాయిలో 15 వేల సచివాలయాల పరిధిలో 7 లక్షల మంది జగనన్న సైనికులు పాల్గొన్నార‌ని తెలిపారు. మన పశ్చిమ నియోజకవర్గానికి విషయానికి వస్తే 90 వేళ 3 వందల 5 కుటుంబాలు  ఉంటె వాటిలో నేటికి 48 వేళ 8 వందల 13 కుటుంబాలు ఈ సర్వేలో పాల్గొన్నార‌ని చెప్పారు. ఎటువంటి దాపరికం లేకుండా పీపుల్స్ సర్వే కార్యక్రమానికి సంబందించిన మధ్యంతర ఫలితాల నివేదికను మీడియా ముఖంగా వెల్లడిస్తున్నామ‌న్నారు.  కుల, మత, వర్గ  వివక్ష లేకుండా ప్రతిపక్షాలు బలంగా ఉన్న ప్రాంతాలలో కూడా మా పరిపాలన ఎలా ఉందని దైర్యంగా అడగడం జరుగుతుందన్నారు. ఆయా ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు కూడా జగనన్నకు మద్దతుగా మాట్లాడడం మనం చూస్తూనే ఉన్నాం ఈ విషయాల పై ప్రత్యేక్షంగా మీరు ఆయా సచివాలయాల పరిధిలో తిరిగి ప్రతిస్పందనను స్వయంగా చూడమని ఆహ్వానిస్తున్నార‌ని చెప్పారు. ఈ మెగా పీపుల్స్ సర్వే పై చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు ఉల్లిక్కి పడుతున్నాయని వ్యాఖ్యానించారు. నవరత్నాల హామీలను వంద శాతం నెరవేర్చిన ఏకైక వ్యక్తి  వై యస్ జగన్ మోహన్ రెడ్డి అని చెప్పారు. వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి పధకాలు అందుకుంటున్న ప్రతి యొక్క కుటుంబం జగనన్నే మన భవిష్యత్తు అనే నినాదంతో రాబోయే రోజూలో జగనన్నను మరలా ముఖ్యమంత్రిని చేసేందుకు సిద్ధంగా ఉన్నార‌ని చెప్పారు.

దళిత ద్రోహి పవన్, చంద్రబాబు
దళితులపై దాడులను ప్రోత్సహిస్తున్న చంద్ర‌బాబు, పవన్ కళ్యాణ్ ద‌ళిత ద్రోహుల‌ని వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ విమ‌ర్శించారు. దళితులను అవమానిస్తూ మాట్లాడుతున్న పార్టీ చంద్రబాబు టీడీపీ పార్టీ అని మండిప‌డ్డారు. దళిత మంత్రి దాడి చేస్తే పవన్ కళ్యాణ్ కి కళ్లు పోయాయా అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రానున్న రోజులలో దళితులు తగిన రీతిలో చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లకు బుద్ది చెపుతారని హెచ్చ‌రించారు. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌కు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇన్‌చార్జ్‌లు క‌రువ‌య్యార‌ని పేర్కొన్నారు. అలాంటి చంద్ర‌బాబుకు ప‌వ‌న్ భ‌జ‌న చేస్తున్నార‌ని వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ విమ‌ర్శించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top