నగరి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను నియంత్రించడంలో ఘోరంగా విఫలమైనందుకే సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులకు పాల్పడుతున్నారని, భయబ్రాంతులకు గురి చేస్తున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా ఆక్షేపించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, హోమంత్రి అనిత శాంతిభద్రతల పరిరక్షణలో పూర్తిగా విఫలమయ్యారని, అందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆమె దుయ్యబట్టారు. చిత్తూరు జిల్లా నగరిలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి.. కూటమి సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తమ టోపీ మీద ఉన్న మూడు సింహాలకు జై కొట్టడం మానేసి, కూటమిలోని మూడు పార్టీలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి ఆరోపించారు. నియంతలైన హిట్లర్, గఢాపీ ఇద్దరూ కలసి కూర్చీలో కూర్చిని పాలిస్తే ఎలా ఉంటుందో.. చంద్రబాబు పాలన అలా ఉందన్నారు. మహిళపై ఇంత క్రూరత్వమా? పెద్దిరెడ్డి సుధారాణి అనే సోషల్ మీడియా కార్యకర్తను తెలంగాణ నుంచి తీసుకొచ్చి 4 రోజులు చిలకలూరిపేట, ఒంగోలు, గుంటూరులలో తిప్పి చివరకు కోర్టులో హాజరు పర్చారని, పోలీసులు చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డారని మాజీ మంత్రి రోజా ఆక్షేపించారు. పోలీసులు తనపై చేసిన దాడి, తగిలిన గాయాలను కన్నీళ్లు పెట్టుకుంటూ సుధారాణి జడ్జికి చూపించడంతో అంతా చలించిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్ఆర్‌సీపీ మీద, పవన్ కల్యాణ్ మీద టీడీపీ సోషల్ మీడియాలో నీచాతినీచంగా పోస్టులు పెట్టినప్పుడు.. వారి మీద కేసులు ఎందుకు పెట్టలేదని డిప్యూటీ సీఎంను రోజా ప్రశ్నించారు. మామపైనే నగ్న కార్టూన్లు వేయించిన బాబు వ్యక్తిత్వ హననంలో చంద్రబాబు సిద్దహస్తుడన్న మాజీ మంత్రి.. పిల్లనిచ్చిన మామ ఎన్టీఅర్ నే బట్టులు విప్పి కార్టూన్లు వేయించిన ఘనడు చంద్రబాబు అని గుర్తు చేశారు. హోంమంత్రి అనిత ఇంటికి మూడు కిలీమీటర్ల దూరంలో కేజీహెచ్ కొండపై గంజాయి సాగు జరుగుతోందని, కుప్పంలో 84 ఎకరాల గంజాయి సాగు జరుగుతోందని డీఎస్పీ చెప్పారని గుర్తు చేశారు. చంద్రబాబు, అనిత రాజీనామా చేయాలని రోజా డిమాండ్ చేశారు. తిరుపతి, ఒంగోలులో మహిళలపై అత్యాచారాలు జరిగితే బాధితులకు అండగా నిలవాల్సింది పోయి, వారిని బెదిరించి, నేరస్తులకు ప్రభుత్వం నిలుస్తుండటం సిగ్గుచేటన్నారు. సినీ హీరో ప్రభాస్, అల్లు అర్జున్ లపై జనసేన సైకోలు దిగజారి పోస్టులు పెడుతున్నారని.. వారిని పవన్ కల్యాణ్ తన్నించి బుద్ధి చెప్పాలని రోజా హితవు పలికారు. అక్రమ అరెస్టులకు సపోర్ట్ చేస్తున్న పోలీసులను వదిలిపెట్టేది లేదన్న మాజీ మంత్రి.. డ్యూటీ కరెక్ట్ గా చేయకపోతే జగన్ గారు చెప్పినట్లే జరుగుతుందని హెచ్చరించారు.