2024లో మీ జెండాలను మడతేయడం ఖాయం!

మీడియా స‌మావేశంలో మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) 

శల్యుడు, శిఖండి కలిస్తే పవన్ కల్యాణ్

జెండాల సభలోనూ జగన్నామస్మరణే

నీవు అథఃపాతాళానికి తొక్కాల్సింది 24 సీట్లు ఇచ్చిన బాబునే కదా..!

వివేకాను చంపిన వ్యక్తితో పచ్చ జెండా మోపిస్తున్నది బాబు కాదా..?

నాడు అవినీతి, దగాకోరు చంద్రబాబు.. నేడు పడిలేచిన కెరటమా..!

పవన్‌ ను నమ్ముకుంటే కుక్క తోకపట్టుకుని గోదారి ఈదినట్లే: మాజీ మంత్రి పేర్ని నాని 

తాడేప‌ల్లి: 2024లో టీడీపీ, జ‌న‌సేన‌ జెండాలను మడతేయడం ఖాయమ‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు. టీడీపీ, జనసేన సభలో కేవలం ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నామస్మరణే చేశారు. వారికి ఎందుకు ఓటు వేయాలో చెప్పలేకపోయారని వ్యాఖ్యలు చేశారు.  ప్రజల క్షేమం, రాష్ట్ర క్షేమం చంద్రబాబు, పవన్‌కు పట్టదు. కాపుల ఆత్మగౌరవాన్ని పెంచే ఒక్క మాట కూడా చెప్పలేరు. పవన్‌ సినిమా డైలాగ్‌లు బట్టీ కొట్టారు. సినిమా వాళ్లు రాసిచ్చిన ‍స్క్రిప్ట్‌ను పవన్‌ చదివారు. నాడు అమరావతి.. ఒక కులానికే రాజధాని అని పవన్‌ అన్నారు. అమరావతి అందరికీ రాజధాని కాదు.. అది కొందరి రాజధానే అని పవన్‌ గతంలో ఎందుకన్నారు. ఆరోజుకు.. ఈరోజుకు.. అమరావతి విషయంలో ఏం మార్పు జరిగిందో పవన్‌ చెప్పాలని డిమాండు చేశారు. గురువారం తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో మాజీ మంత్రి శ్రీ పేర్ని వెంకట్రామయ్య (నాని) మీడియాతో మాట్లాడారు.

జెండాల సభలోనూ జగన్నామస్మరణే:
– టీడీపీ, జనసేన అధ్యక్షులు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు వాళ్ల పంపకాలకి సంజాయిషీ చెప్పుకునేందుకు జెండా పేరుతో ఒక సభ పెట్టారు. 
– జెండా సభ అనే కంటే జెండాల సభ అనాలి. రెండు జెండాల సభ కదా అది..మూడో జెండా కోసం ఎదురుచూస్తున్న సభ అది. 
– మూడో జెండా కోసం కాళీ కుర్చీ అట్టిపెట్టిన సభ అది. 
– ఆ సభలో కేవలం జగన్నామ స్మరణ తప్ప వారికెందుకు ప్రజలు ఓటేయాలి.. వారిద్దరి జెండాలు మోస్తున్న కార్యకర్తలు ప్రజలకు పొత్తులపై ఏమని చెప్పాలి అనే దిశానిర్ధేశం చేశారా? 
– వారికి అధికారం ఇస్తే ఏం చేయబోతున్నారనేది ప్రజలకు ఏమైనా సందేశం ఇచ్చారా? 
– ప్రజల క్షేమం, ఈ రాష్ట్ర క్షేమం గురించి ఊసే ఎత్తలేదు. 
– వీళ్లిద్దరికీ అధికారం కావాలట..ప్రజలకు మేలు చేయడానికి మాత్రం కాదట. 
– జగన్‌ని, ఆయనతో ఉండేవాళ్లపై దాడులు చేయడానికి వీళ్లకి అధికారం కావాలట. 
– ఇదీ జెండాల సభ ద్వారా వారిచ్చిన సందేశం. 
– కనీసం 2014–19లో వీరిద్దరి ప్రభుత్వం అధికారంలో ఉండగా ఏం చేశారనేది కూడా చెప్పుకోలేకపోయారు. 
– ఈ రాష్ట్రంలో పవన్‌కి, చంద్రబాబుకు ఐదేళ్లు అధికారం ఇస్తే ఒక్కటంటే ఒక్కటి వారు చేసిన మేలు చెప్పలేకపోయారు. 
– పోనీ కాపుల ఆత్మగౌరవాన్ని పెంచే ఒక్క మాటన్నా చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ చెప్పారా? 
– కాపుల ఓట్లు కావాలి.. కాపులు టీడీపీ జెండా మాత్రం మోయాలని చెప్తున్నారు. 
– ఆత్మాభిమానం చంపుకుని టీడీపీ జెండా మోయమని మాత్రం ఇద్దరూ కలిసి చెప్తున్నారు. 

జగన్ దగ్గర బ్లాక్ మెయిలింగ్ కుదరదమ్మా!:
– నిన్నటి సభలో చంద్రబాబు ప్రసంగిస్తుంటే.. వెనక కూర్చుని సినిమా డైలాగులను పవన్ కల్యాణ్ బట్టీ పడుతూ, ప్రాక్టీస్‌ చేస్తూ కనిపించాడు. 
– జూబ్లీహిల్స్‌ సొసైటీలో, కంటకీ రెస్టారెంట్లో ఏం చేశావో నాకు తెలుసు అని జగన్ గారి గురించి మాట్లాడుతున్నాడు. 
– ఎంతసేపూ జగన్‌ గురించి నాకు తెలుసు నాకు తెలుసు అని చెప్పడం దేనికీ? 
– ఈ బ్లాక్‌ మెయిలింగ్‌ ఎందుకు? టన్నుల కొద్దీ సమాచారం తన వద్ద ఉందంటాడు. 
– టన్నుల కొద్దీ సమాచారాన్ని బయటపెట్టవద్దని జగన్‌ ఏమన్నా బతిమిలాడుకున్నాడా? పోనీ మేమన్నా వద్దు బాబూ అని కోరామా? 
– టన్నుల కొద్దీ సమాచారం కాదు..ఒక కేజీ సమాచారం అయినా బయట పెట్టు. 
– నువ్వు నిజంగా నిఖార్సయిన వాడివి అయితే బయటపెట్టు. 
– ప్రతి సారీ జగన్‌..  నా దగ్గర నీ సమాచారం ఉందనడం దేనికీ దమ్ముంటే బయటపెట్టు. 
– ఉంటే దాచుకుని మురగబెట్టుకోవడం దేనికీ? బయటపెట్టవయ్యా... 
– బ్లాక్‌మెయిలింగ్‌ చేస్తున్నావా? జగన్‌మోహన్‌రెడ్డి వద్ద బ్లాక్‌ మెయిలింగ్‌ కుదరదమ్మా..! 
– జగన్‌మోహన్‌ రెడ్డి వద్ద బేరాలుండవమ్మా..చేతనైంది చేసుకో పవన్‌ కల్యాణ్‌. 

2019లో మడత పెట్టింది మరచిపోయారా?
– సిద్ధం సిద్ధం కాదు యుద్ధాన్నిస్తాడట..2014 ఎన్నికల్లో జగన్‌ గారికి ఏం ఇచ్చావ్‌..? 
– 2019 ఎన్నికల్లో జగన్‌ గారికి వ్యతిరేకంగా పోటీ చేశావు కదా? అప్పుడు యుద్ధాన్ని చూపించలేకపోయావా? 
– సరుకు లేదా? మందు గుండు సామాగ్రి లేదా? 
– జగనే నీకు పెద్ద సినిమా చూపించి మడిచి తొంగోబెట్టాడు. 
– అమరావతే రాజధాని అంటాడు..జగన్‌మోహన్‌ రెడ్డి మూడు రాజధానులని విమర్శిస్తున్నాడు. 
– నువ్వు అంత పోటు గాడివైతే...2019లో నువ్వు ఏం మాట్లాడావో గుర్తు చేసుకో. 
– 2019లో అమరావతి ఒక కుల రాజధాని, అది అందరి రాజధాని కాదు అన్నావు కదా? 
– పేద మధ్య తరగతి వర్గాలు అక్కడ ఇళ్లు కట్టుకోవాలంటే ఉండటానికి చోటేది అని అన్నావు కదా? 
– అలాంటి పవన్‌ ఈ రోజు అమరావతే రాజధాని అంటున్నాడు.
– ఆరోజుకీ ఈ రోజుకీ మధ్య ఏం జరిగింది..? చంద్రబాబు, నీకు మధ్య ఏం లాలూచీ జరిగింది? 
– ఎవరన్నా ప్రశ్నిస్తే.. నన్ను ప్రశించేటట్టు అయితే బయటకు పోండి అంటాడు. నువ్వు వెళ్లమనక్కర్లేదు. వెళ్లమనకుండానే జనం పోతారు. 

24 తీసుకుంటే మాకేంటి.. సున్నా తీసుకుంటే మాకేంటి..?:
– ఆఫ్ట్రాల్‌ 24 సీట్లేనా అనడానికి జగన్‌ గారికేం పని? 
– నువ్వు 24 కాకపోతే..నాలుగు తీసుకో..రెండు తీసుకో..2014లో నువ్వు తీసుకున్నది సున్నా కదా!
– నువ్వు సీట్లు తీసుకోలేదని ఆ రోజు మాట్లాడామా? నువ్వు సీట్లు తీసుకోకపోతే ఎవరికి బాధ? 
– అది నీ పార్టీ నాయకులు రామచంద్రరావు, దుర్గేష్‌ల బాధ. నీ మాటలు నమ్మి, ఆశ పెట్టుకున్న జగ్గంపేట సూర్యచంద్ర లబోదిబో మని ఏడుస్తున్నాడు. అతనికి బాధ. 
– నిరాహార దీక్ష చేస్తుంటే హరిరామజోగయ్య గారికి ఫోన్‌ చేసి నేను ముఖ్యమంత్రి అవుతాను..నువ్వు దీక్ష విరమించమని కోరిన జోగయ్య గారికి బాధ. 
– మీ పార్టీ మనుషులను పంపి జోల పాట పాడి ముద్రగడ గారి ఇంటికి అయోధ్య, కాశీ వెళ్లివచ్చాక వస్తానన్న వారికి బాధ. 
– పోనీ నీకు ఓటు వేద్దామనుకున్న కొంత మంది కాపులకు బాధ ఉంటుంది. 
– అంతేకానీ నువ్వు 24 తీసుకుంటే వైఎస్సార్సీపీకి ఏంటి బాధ? 

2024లో మీ జెండాలను మడతేయడం ఖాయంః
– తాడేపల్లిగూడంలో నీ జెండాల సభల సాక్షిగా నీ జెండాను, చంద్రబాబు జెండాను 2024 ఎన్నికల్లో ప్రజలు మడతేయడం ఖాయం. 
– జగన్‌మోహన్‌రెడ్డి గారిని ఓడించడం కోసం మూడు ఎన్నికల నుంచి మీ ఇద్దరి డ్రామాలు ప్రజలు గమనిస్తున్నారు. 
– మరీ ప్రత్యేకించి కాపు కులం గమనిస్తోంది. కాపులను బీసీలుగా చేస్తానని నమ్మించి నిండాముంచిన మోసాన్ని వారి మదిలో మండుతోంది. 
– మీ ఇద్దరినీ కలిపి మడతేయడానికి సిద్ధంగా ఈ రాష్ట్ర ప్రజలున్నారు. 
– ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని పార్టీ పెట్టి..ప్రజల్ని వదిలి..ప్రతి ఎన్నికల్లో చంద్రబాబు కోసం నాలుక మడుతేస్తున్న వ్యక్తి పవన్‌ కల్యాణ్‌. 

నీవు అథఃపాతాళానికి తొక్కాల్సింది బాబునే కదా..!
– బలిచక్రవర్తి వద్ద దానం పొందిన వారెవరు..విష్ణుమూర్తి వామనుడి రూపంలో దానం పొందాడు. 
– మూడో దానం కింద నెత్తి మీద కాలు పెట్టి పాతాళానికి తొక్కాడు. 
– ఇక్కడ సీట్లు దానం పొందింది ఎవరు..? 24 సీట్లు దానం పొందింది ఎవరు? 
–  చంద్రబాబు వద్ద 24 సీట్లు దానం పొందిన వామనుడివి నువ్వు..ఇప్పుడు ఎవర్ని తొక్కాలి. 
– నీకు సీట్లు దానం చేసిన చంద్రబాబును పాతాళానికి తొక్కేయాలి..ఖచ్చితంగా తొక్కేస్తావు. 
– పాతాళానికి తొక్కుతానంటూ సొల్లు కబుర్లు చెప్పొద్దు. 
– చంద్రబాబును నువ్వు పాతాళానికి తొక్కితే.. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో పేదరికం పోతుంది. 
– చంద్రబాబు ఒక్కటంటే ఒక్క మాట పవన్‌ కల్యాణ్‌ గురించి మాట్లాడలేదు..పొగడలేదు. 
– నేను జైళ్లో ఉంటే..నా కొడుకు ఢిల్లీ పారిపోతే..పవన్‌ కల్యాణ్‌ వచ్చి పార్టీని బతికించాడు అని ఒక్క మాట కూడా అనలేదు. 
– చివరికి పవన్‌ కల్యాణ్‌ సెల్ఫ్‌ డబ్బా తానే కొట్టుకున్నాడు. 

శల్యుడు, శిఖండి కలిస్తే పవన్ కల్యాణ్:
– అసలు పురాణాలతో పోల్చడానికి పవన్‌ కల్యాణ్‌కి శల్యుడి పాత్ర ఒక్కటే ఉంది. 
– మాకు కూడా ముఖ్యమంత్రి ఉంటే బాగుంటుంది కదా అని ఆశ పడి ఓటేద్దామనుకున్న కాపులకు నీవు శల్యుడివి. 
– పవన్‌ కల్యాణ్‌ తరఫున పోటీ చేస్తాం అని ముందుకు వచ్చే కాపులకు ఏం చెప్తున్నావు..? 
– మనకు బలం లేదు..బూత్‌ కమిటీలు, గ్రామ కమిటీలు లేవు.. మీరు గెలిపించలేరు అంటూ శల్యుడిలా చెప్పుకొస్తున్నావు. 
– శల్యుడిలా పార్టీని, పార్టీ జెండా మోసే కార్యకర్తలను, పోటీ చేద్దామనుకునే వారిని, ఓటేద్దామనుకున్న వారిని శల్యుడిలా పవన్ నిర్వీర్యం చేస్తున్నాడు. 
– నువ్వు శల్యుడివైతే వామనుడిని అంటావేంటి? 
– రాక్షస గణ నాయకుడైన చంద్రబాబు లాంటి దుర్మార్గుడికి, డబ్బు నామ స్మరణ చేస్తున్న లోకేశ్‌కు కొమ్ము కాస్తున్న శిఖండి కదా నువ్వు..? 
– శల్యుడు, శిఖండి రెండూ కలిసిన పాత్ర కదా నీది..? 

వివేకాను చంపిన వ్యక్తితో పచ్చ జెండా మోపిస్తున్నది బాబు కాదా..?:
– చంద్రబాబు చెవిలో ఒక తీగ పెట్టుకుని హూ కిల్డ్‌ బాబాయ్‌ అంటున్నాడు. 
– ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బాబాయి చనిపోయారు. 
– అప్పుడు పవన్, చంద్రబాబులు ఇద్దరూ జగన్‌ గారిపై ఏమైనా కేసు పెట్టారా? 
– కనీసం నింద కూడా మోపలేదు కదా..? అప్పుడేమో జగన్‌ నాట్‌ కిల్డ్ బాబాయి అంటారు. 
– ఇప్పుడేమో హూ కిల్డ్ బాబాయ్‌ అంటున్నారు. హూ కిల్డ్ ఎన్టీఆర్‌ అని కూడా అనుకోవచ్చు కదా? 
– వివేకా హత్య కేసులో దోషులు ఇవాళ నీతో తిరుగుతున్నారు. 
– వాళ్లు ప్రెస్‌మీట్లు పెట్టి పచ్చిగా ఇలా చంపాను అంటూ చెప్పిన ముద్దాయి నీ జెండా మోస్తున్నాడు. 
– ఈయన హూ కిల్డ్ బాబాయి అంటాడు. నోరా తాటి మట్టా? 
– 75 ఏళ్ల వయసొచ్చింది..ఊళ్లో తాటి చెట్టుకు, మర్రిచెట్టుకు కూడా వయసు వస్తుంది. 

2019లో బాబుతో శతృత్వం..2024లో స్నేహం ఎలా అయ్యింది..?:
– పవన్‌తో స్నేహం చచ్చేదాకా...పవన్‌తో శతృత్వం అవతలివారు చచ్చేదాకా అన్నాడు. 
– 2009లో నీకు ఉన్నది చంద్రబాబుతో శతృత్వమే కదా? ఆనాడు యువరాజ్యం అధ్యక్షుడిగా చంద్రబాబును ఎన్ని తిట్లు తిట్టావో మర్చిపోయావా? 
– మామ గారి నుంచి పార్టీని దొంగతనం చేశాడు, సైకిల్‌ గుర్తును లాక్కున్నాడు అన్నావ్‌. 
– మరి, 2009లో చంద్రబాబుతో శతృత్వం చచ్చేదాకా ఉందా? 
– 2014 వచ్చేసరికి చంద్రబాబుతో స్నేహం.. చచ్చేదాక శతృత్వం ఉండాలిగా.. మరి ఎందుకు లేదు? 
– 2019లో మళ్లీ స్నేహం పోయి శతృత్వం వచ్చిందేంటి? చచ్చేంతవరకూ ఉండాలిగా? 
– మళ్లీ 2024 వచ్చేసరికి చంద్రబాబుతో స్నేహం..అసలు నీ సొల్లు కబుర్లకు అర్ధం ఉందా? 
– పవన్‌ కల్యాణ్‌తో స్నేహం అంటే పవన్‌ కల్యాణ్‌ చచ్చేదాక అన్నాడు. 
– పవన్‌ కల్యాణ్‌తో శతృత్వం అవతలివాడు చచ్చేదాకా అన్నాడు. 
– 2014లో నరేంద్ర మోడీతో స్నేహం..2019లో శతృత్వం..మళ్లీ 2024లో స్నేహం. 
– ఈ పిల్లి మొగ్గలు ఏంటి పవన్‌ కల్యాణ్‌..? 
– మరి ఎవరో ఒకరు చచ్చేదాకా ఏదో ఒకటి ఉండాలి కదా? 
– ఎవడో మాటలు రాసిస్తే బట్టీ పట్టి చెప్పేయడం కాదు. సినిమా అయితే నాలుగురోజులు ఆడుతుంది. 
– కానీ ఇది రాజకీయం..ప్రజాక్షేత్రం. ప్రశ్నిస్తారు..నిలదీస్తారు... తప్పు మాట్లాడితే ఫినాయిల్‌ పెట్టి కడుగుతారు. 

నీ తల్లి నీతో ఉందా పవన్ కల్యాణ్?:
– జగన్‌ గారు తల్లిని దూరం పెట్టారు..చెల్లిని గోడకేసి కొట్టారు అంటూ వ్యక్తిత్వ హననం చేస్తున్నాడు. 
– 2014 నుంచి జగన్‌ గారి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాటలు విపరీతంగా మాట్లాడుతున్నారు. 
– ఆయన్ను మాత్రం ఎవరేం అనుకూడదట. నీ తల్లి గారు ఏ రోజైనా నీతో ఉన్నారా పవన్‌ కల్యాణ్‌..? 
– ఏ రోజున్నా చంద్రబాబు తల్లి, తండ్రి, తమ్ముడు ఏ రోజైనా ఆయనతో ఉన్నారా? 
– తల్లి చనిపోతే ఖర్మ చేసి గుండు గీశావా చంద్రబాబూ..? ఇద్దరూ హైందవులం అని చెప్తుంటారుగా..? 
– మీ ఇద్దరి తల్లులు మీతో ఉండరు..జగన్‌ గారి తల్లి గురించి దూరం పెట్టాడు అని మాత్రం మాట్లాడతారు. 
– ఎప్పటి నుంచో ఆమె హైదరాబాద్‌లో సొంత ఇంట్లో ఉంటున్నారు. 
– ఆ ఇంట్లోనే ఇదివరకు కలిసి ఉండేవారు..జగన్‌ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె అక్కడే ఉంటున్నారు. 
– చెల్లిని గోడకేసి కొట్టారంటూ ఎంత కిరాతకపు మాటలు మాట్లాడుతున్నాడు. 
– మాట్లాడితే నన్ను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు అంటున్నాడు. 
– పెళ్లాలు అని ఎవరన్నారు..నాలుగు పెళ్లిళ్లు అన్నారు. 
– పోనీ ఆయనకు లెక్క రాలేదేమో..నీ నోటితోనే మూడు పెళ్లిళ్లు..రెండు విడాకులు అని చెప్పావుగా..సరిపోయింది. 
– నాలుగో పెళ్లాం కింద జగన్‌ రావాలా? నీ రాజకీయాలే తేడా అనుకుంటున్నావ్‌..ఈ తేడా కూడా ఉందా నీలో..? 

నాడు అవినీతి, దగాకోరు బాబు.. నేడు పడిలేచిన కెరటమా..!:
– గాయత్రీ మంత్రంలో బీజాక్షరాలు 24 కాబట్టి నేను 24 సీట్లు తీసుకున్నాను అంటున్నాడు. 
– ప్రతి దానికి లెక్క ఉంటుంది. పది తీసుకున్నావనుకో దశావతారాలు. తొమ్మిది తీసుకుంటే నవగ్రహాలు, ఎనిమిది తీసుకుంటే అష్టదిక్కులు, ఏడు తీసుకుంటే సప్తర్షుల సాక్షిగా తీసుకున్నానని ఏదంటే అది చెప్పొచ్చు. 
– నీ కులం కోరుకుంటున్నట్లుగా, నీ శ్రేయస్సు కోరుకుంటున్న హరిరామజోగయ్య, నువ్వు బుజ్జగించి ఇంటికి వస్తానని చెప్పిన ముద్రగడ గారు కోరుకుంటున్న 80 సీట్లకు కూడా ఏదో ఒక ఉపమానం ఉంటుంది. 
– పవన్‌ అంటే కన్నీళ్లు తుడుస్తాటడ..పవన్‌ అంటే రాఖీ అంట..ఆయనే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు..ఈ రాష్ట్రానికి 108 అట. 
– వయసు మీరిన వారి భుజం మీద కండువా అంటాడు. దానికి అర్ధం తెలుసా? 
– పెద్ద వయసులో ఉన్న వారి భుజంపై కండువా అంటే వారి పరువు. అది నీకుందా? 
– క్లైమోర్‌ మైన్స్‌ పేలినా పడిలేచిన కెరటం అని చంద్రబాబును ఎత్తేశాడు. ముసలి కెరటం బ్రహ్మాండంగా లేచింది. 
– మరి 2019లో చంద్రబాబు రాజకీయ దురందురుడు కాదా? 
– 2019లో చంద్రబాబు ఒక  దగాకోరు, అవినీతిపరుడు, ఒక కులం కోసం రాజధాని నిర్మాణం చేసినోడని నువ్వే చెప్పావుగా. 
– చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్‌కి జబర్ధస్త్‌ రైటర్లో, సినిమా రైటర్లో రాసిచ్చిన డైలాగులు ఇక్కడొచ్చి చెప్తే కుదరదు. 
– నువ్వు 24 తీసుకున్నా..ఎన్ని తీసుకున్నా..  నువ్వు ఉన్నది చంద్రబాబు పల్లకీ మోయడం కోసమే. 
– నువ్వు ఎత్తుకున్నావు కాబట్టి నీ కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్కరినీ ఎత్తుకోమంటున్నావ్‌. 
– నేను మీకు మేలు చేస్తే నా తల్లిని దూషిస్తారా అని గతంలో నువ్వు చించుకున్నావ్‌ కదా. 
– పది, పదిహేను సీట్లు కుక్కబిస్కెట్‌లు పడేస్తే వాళ్లే ఉంటారనుకుంటే కోపం రాదా అని ఆని ఆనాడు అన్నాడు. 
– నేనిస్తే మీరు తీసుకోండి...మీరిస్తే మేం తీసుకునే వాళ్లం కాదు అని బీరాలు పలికాడు. 
– అలానే నేడు చంద్రబాబుకు పవన్‌ కల్యాణ్‌ 22 పార్లమెంటు, 150 సీట్లు పారేసిన పనోడు పవన్‌ కల్యాణ్‌..  అని అనుకోవాలేమో.. !

పవన్‌ ను నమ్ముకుంటే కుక్క తోకపట్టుకుని గోదారి ఈదినట్లే:
–  పవన్‌ కల్యాణ్‌ని నమ్ముకుని రాజకీయాల్లోకి వస్తే.. కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్లు  ఉంటుందని ఆయన అభిమానులు  గమనించాలి. 
– జగన్‌మోహన్‌రెడ్డి గారిని దూషించడమే పనిగా, జగన్‌ గారికి రాజకీయ ఎదుగుదల లేకుండా చేయడం కోసమే అన్నట్టుగా పవన్ కల్యాణ్ పార్టీ పెట్టానని చెబుతున్నాడు. 
– పవన్ కల్యాణ్ కు ఉన్నది జగన్‌ గారిపై ద్వేషం, చంద్రబాబుపై వల్లమాలిన ప్రేమ. 
– తన అన్న గారిపై  కంటే.. లక్షరెట్లు అమితమైన ప్రేమ చంద్రబాబుపై ఉంది. 
– బలం లేదు..బలం లేదు అంటూ మాట్లాడుతున్నాడు. ఎందుకొస్తుంది బలం..? 
– జగన్‌ గారు పార్టీ పెట్టినప్పుడు బలం ఉందా? 
– ఎవరైతే పవన్‌ని అభిమానిస్తూ..చంద్రబాబు జెండా మోయడానికి మానసికంగా ఇబ్బంది పడుతున్న వారిని రిక్వెస్ట్‌ చేస్తున్నా. 
– జగన్‌ గారు కాంగ్రెస్‌ వదిలి వచ్చినప్పుడు ఆయన బలమెంత? 
– తను, తల్లి గారు ప్రయాణం మొదలుపెట్టారు కదా? జగన్‌ గారు ఎంపీగా, విజయమ్మ గారు ఎమ్మెల్యేగా ముందుకు వెళ్లారు. 
– ఒక్క ఎమ్మెల్యే కూడా ఆనాడు ఆయన వెంట లేరు కదా? 
– 2014లో జగన్‌ గారు ముఖ్యమంత్రిగా అవలేదు కదా..67 సీట్లతో ప్రతిపక్షనేతగా ఉన్నాడు. 
– 2019లో ఇదే పవన్, చంద్రబాబులు కలిసి ఎన్ని కుట్రలు చేసినా, ముందు నుంచి ఒకరు, వెనుక నుంచి ఒకరు పొడవడానికి ప్రయత్నం చేసినా 151 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 
– జగన్‌ గారిపై యుద్ధం చేయడానికి 47 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న అనుభవం ఉన్నవాడే పవన్‌ మెడలమీద కూర్చుని కానీ యుద్ధం చేయడానికి ధైర్యం  చాలడం లేదు. 
– ఇంత బలంగా ఎలా తయారయ్యాడు..గెలిచినా ఓడినా అధికారం వచ్చినా రాకపోయినా ప్రజల కోసం మాత్రమే పనిచేస్తూ వెళ్లాడు కాబట్టే నేడు ఈ స్థితిలో ఈ స్థానంలో జగన్ గారు ఉన్నారు. 
– మాయావతి లాంటి వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వరకూ పోటీ చేస్తూనే ఉన్నారు కదా?. ములాయం సింగ్, లాలూ ప్రసాద్‌ యాదవ్, జయలలిత లాంటి వారు గెలిచే వరకూ పోటీ చేస్తూనే ఉన్నారు. 
– అది కదా రాజకీయం అంటే..గెలిచే వరకూ పోటీ చేస్తుంటేనే కదా నిన్ను నమ్మిన వారిలో నమ్మకం కలిగేది? 
– అది వదిలేసి..చంద్రబాబుకు ఊడిగం చేస్తూ, చెంచాగిరి చేస్తూ చంద్రబాబు గెలుపు కోసం కుంటిసాకులు చెప్తూ పార్టీని, కార్యకర్తలను నిర్వీర్యం చేశాడు. 

జెండా మోసేవారిని కించపరుస్తావా?
– జెండా మోసే వారి ఆత్మస్థైర్యాన్ని కించపరిచే నాయకుడు ఈ ప్రపంచంలో ఒక్క పవన్‌ కల్యాణ్‌ మాత్రమే. 
– నువ్వు 24 సీట్లు కూడా తీసుకోవద్దు. ఏమీ తీసుకోకుండా చంద్రబాబుకు ఊడిగం చెయ్‌. 
– మాకేంటి..నువ్వు సమాధానం చెప్పుకోవాల్సింది నిన్ను ప్రశ్నించే, అభిమానించే, నీ హితవు కోరే వారికి మాత్రమే. 
– నువ్వు, చంద్రబాబు కలిసి పరిపాలన చేసినప్పుడు కూడా రోడ్లపై పోసిన పాలను ఎత్తుకుని టీ, కాఫీ కాసుకుని తాగేవారు కదా? 
– ఈ రాష్ట్రంలో పేదరికం పోగొట్టడానికి ఏకైక మార్గం విద్య అనే ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకున్న జగన్‌గారిని మరో పదికాలాలు పాటు మనం కాపాడుకుంటేనే ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా పేదరికం పోతుంది. 
– అనారోగ్యం వస్తే అప్పుల బారిన పడకుండా జగన్‌ గారు చేస్తున్న ప్రయత్నాన్ని ఒకసారి గమనించండి. 
– మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికీ చచ్చే లోపు ఒక్కరోజైనా సొంతింట్లో బతికి చావాలి అనుకునే తీరని కోర్కెను తీర్చే ప్రయత్నం చేసినవాడు జగన్‌ గారు. 
– మీ ఇంట్లో మంచి జరిగితేనే మరొక్కసారి తన గురించి మంచి మాట పక్కవాడికి చెప్పమనే జగన్‌ గారు కావాలా? 
– ఏం మంచి చేశారో, ఏం చేస్తారో చెప్పకుండా, వారి పాలన గురించి ఒక మంచి మాట కూడా చెప్పుకోలేని వారిద్దరు జగన్‌ గారిపై విషం చిమ్ముతూ పెత్తందార్ల పక్షాన భుజం కాస్తున్న వారి మాటలు నమ్ముతారా? 
– ప్రజలు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోమని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను అని పేర్ని నాని విజ్ఞప్తి చేశారు. 

Back to Top