నీ గాజు గ్లాస్‌ సింబల్‌ పోయింది.. ముందు అది చూస్కో

పవన్‌కు మాజీ మంత్రి పేర్ని నాని స్ట్రాంగ్‌ కౌంటర్‌

విజయవాడ: చెప్పులు పోతే ఎవరో ఒక ప్రొడ్యూసర్‌ కొని ఇస్తాడని, ముందు జనసేన గాజు గ్లాస్‌ సింబల్‌ పోయింది అది చూస్కోమని పవన్‌ కల్యాణ్‌కు మాజీ మంత్రి, వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పేర్ని నాని సూచించారు. పవన్‌ వ్యాఖ్యలకు పేర్ని నాని స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ‘అక్టోబర్‌ 18న వెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్తే ఎవడో నా ఒక చెప్పు కొట్టేశాడు. ఎదురుగా పవన్‌ ఆఫీస్‌ ఉందని అనుమానించలేం కదా..? నా ఒక చెప్పు పోయి 9 నెలలు అవుతోంది. ఆ ఒక చెప్పు పట్టుకెళ్లినోడు దాంతో ఏం చేసుకుంటాడో..? చెప్పులు పోయి మూడ్రోజులకే పవన్‌ కంగారు పడుతున్నాడు.  చెప్పులు పొతే ఎవరో ఒక ప్రొడ్యూసర్‌ కొనస్తాడు. ముందు జనసేన పార్టీ గాజు గ్లాస్‌ సింబల్‌ పోయింది అది చూస్కో’’ అని పవన్‌కు సూచించారు.  
 

Back to Top