చంద్రబాబూ ...నీకు ఇదేం కర్మ అని ప్రజలు అంటున్నారు

ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి పేర్ని నాని

2024 ఎన్నికల తరువాత చంద్రబాబు రాజకీయాల్లో కనిపించడు

వైయ‌స్ జగన్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తామని బాబు చెబుతున్నారు.
 
హెరిటేజ్‌లో ధరలు ఎలా ఉన్నాయి..?

రామోజీ అమ్మే ప్రియా పచ్చళ్ల రేటంతా..? 

తాడేప‌ల్లి: 2024 ఎన్నికల తరువాత చంద్రబాబు రాజకీయాల్లో కనిపించర‌ని మాజీ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. నిన్న‌టి దాకా వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌కు దోచిపెడుతున్నాడు..పంచిపెడుతున్నాడు అని వాగి..ఈ రోజున వైయ‌స్ జగన్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తామని చెబుతున్నారు. అప్పులు చేశామని గగ్గోలు పెట్టిన ఎల్లో బ్యాచ్‌ ఇప్పుడు వైయ‌స్ జగన్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తారట..!! అప్పుల్లో ఏపీ 8వ స్థానంలో ఉంది. చంద్రబాబు తెలుసుకోవాలి.  వైయ‌స్ఆర్, వైయ‌స్‌ జగన్ మాదిరిగానే పరిపాలిస్తామని చెబుతున్నావంటే..ఇదే నీ కర్మ అని బాబును ఉద్దేశించి పేర్ని నాని అన్నారు. 14 ఏళ్ల పాలన ఇస్తానని చంద్రబాబు ఎందుకు చెప్పడం లేదు..? 2014 టీడీపీ మేనిఫెస్టో ఎక్కడుందని ప్రశ్నించారు పేర్ని నాని. 600 హామిలిచ్చిన టీడీపీ మేనిఫెస్టోను వారి అధికారిక వెబ్ సైట్‌లో పెట్టుకోలేని పరిస్థితి అన్నారు. బీసీలను, ఎస్సీలను చంద్రబాబు అవమానించాడని పేర్ని నాని చెప్పారు. మత్స్యకారులను కూడా చంద్రబాబు బెదిరించాడని అన్నారు. బాబు ఇంకా పాతకాలం నాటి రాజనాల , కాంతారావు యుగం లోనే ఉన్నాడు   

పాపం..తనకు ఇవే చివరి ఎన్నికలని .. చంద్రబాబు అంటున్నారు. ఈ మాట‌లు విని రామోజీ రావు, రాధాకృష్ణ బాధప‌డుతుంటారు.. ఎన్ని జాకీలు పెట్టి లేపినా ..చంద్రబాబు లేచే పరిస్థితి లేద‌ని వాపోతుంటారు. ప్ర‌జ‌ల‌కు చివ‌రి ఎన్నిక‌ల‌ని చెబుతున్నాడు..ఓటు మనం వేయాలి. అధికారం చంద్రబాబుకు కావాలి. చివరి అవకాశం ప్రజలకట..!!. చంద్రబాబుతో ...ఇదేం కర్మ అని ప్రజలు అంటున్నార‌ని ఎద్దేవా చేశారు.

 టీడీపీ నిర్వ‌హించిన బాదుడే బాదుడు కార్య‌క్ర‌మం సూప‌ర్ హిట్ అని చంద్ర‌బాబు చెప్పుకుంటున్నాడు. అస‌లు చంద్ర‌బాబు బాదుడు గురించి ప్ర‌జ‌లు మాట్లాడుకుంటున్నారు. బాదుడే బాదుడులో టీడీపీ నేతలను జనం బాదారు. అసలు రేట్లు పెంచిందే రామోజీ, చంద్రబాబు. హేరిటేజ్‌లో కంది పప్పు రేటు ఎంత..? ప్రియా ఆయిల్ రేట్లు ఎంత..?. బయట ధరలు ఎంత ఉన్నాయి..?. హెరిటేజ్‌లో ధరలు ఎలా ఉన్నాయి..?. రామోజీ అమ్మే ప్రియా పచ్చళ్ల రేటంతా..?. ప్రియా పచ్చళ్ల రేటంతా..?. నూజెన్‌ ఆయిల్‌తో టీవీ5 నాయుడు ఎంత దోచుకున్నాడో..ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు కుట్రలను...చదివే సామర్ధ్యం ప్రజలకు వచ్చింద‌ని పేర్ని నాని గుర్తు చేశారు. 

చంద్ర‌బాబుకు అధికారమదమెక్కిన్నప్పుడు..వెంకన్న స్వామి వెంకన్న చౌదరిగా కనిపించాడు. బాబు తన కుట్రలతో..ఎన్టీఆర్‌ను మానసిక క్షోభకు గురి చేశాడు. 2024 తరువాత చంద్రబాబు మీద ఎన్టీ రామారావు పగ తీర్చుకోబోతున్నాడ‌ని పేర్ని నాని తెలిపారు. 

చంద్రబాబును చంపాల్సిన అవసరం ఎవరకుంది..?. బఠాని గింజ తెలివితేటలు ఉన్నవాడు కూడా ఇలాంటి ఆలోచ‌న చేయ‌డు.
చంద్రబాబును మర్డర్ చేయించాలని ఎవ‌రైనా కోరుకుంటారా..?. చంద్రబాబు దిక్కుమాలిన ప్రతిపక్ష నాయకుడు. చంద్రబాబు చేసిన పాపాలకు అంతులేదని పేర్ని నాని విమ‌ర్శించారు.  రాజకీయంగా చంద్రబాబు కుక్క చావు చస్తున్నాడని  పేర్ని నాని చెప్పారు. ఆ రోజు లక్ష్మీ పార్వతీ బ్యాగ్ పట్టుకుని, కాళ్ల పట్టుకుని ఎంత మోసం చేశావో ప్రజలందరికీ తెలుసు. మల్లెల బాబ్జీ మరణ వాంగ్మూలం చూస్తే చంద్రబాబు కుట్రలు బయట పడతాయన్నారు. చంద్రబాబు పాత సినిమాల విలనిజం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

 చంద్రబాబు, పవన్‌లను చూస్తుంటే జాలేస్తుందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఇవాళ చంద్ర‌బాబు ప్ర‌జ‌ల్లోకివెళ్లి సంక్షేమ ప‌థ‌కాలు ఆప‌ను, వైయ‌స్ జ‌గన్ కంటే ఎక్కువ ఇస్తాన‌ని చెబుతున్నారంటే..ఇదే సీఎం వైయ‌స్ జగన్ రాజకీయ సత్తా. చంద్రబాబుకు, దొంగ స్వామిజీకి పెద్ద తేడా లేదని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.  వైయ‌స్ జగన్ మీద పోరాటం చేయడానికి చంద్రబాబును దేవుడు బతికించాడట..!!.ఎన్టీఆర్‌ను కుట్రలతో చంపినందుకు రామారావు పెట్టిన శాప‌మే అని ప్ర‌జ‌లు అనుకుంటున్నార‌ని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. 

తాజా వీడియోలు

Back to Top