తూర్పుగోదావరి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో 30 ఏళ్ళు వైయస్ జగనే ముఖ్యమంత్రిగా ఉంటారని వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు. నిన్న సీఎం వైయస్ జగన్ సమక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం.. ఈ రోజు మీడియాతో మాట్లాడారు. జనసేన వేరే పార్టీలో కలవడం కాదు త్వరలోనే క్లోజ్ అయిపోతుందని జోస్యం చెప్పారు.. పిఠాపురంలో వైయస్ఆర్‌సీపీకి సునాయాసంగా ఉంటుందన్న ఆయన.. సినిమావాళ్లు అతీతులు కాదు.. మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు.. మా ఇంటికొస్తే ఏం తెస్తారు అనే విధంగా సినిమా వాళ్ల వ్యవహారం ఉంటుందని దుయ్యబట్టారు.. 175 సీట్లలో పోటీ చేస్తానంటే బీజేపీ లో చేరతా అని చెప్పాను.. మీరు పోటీ చేసే 5-6 సీట్లలో నన్ను లాగొద్దు అని చెప్పాను.. జనసేన 70-80 సీట్లలో పోటీ చేయకుండా.. 20 సీట్లు కోసం నేను ఎందుకు? అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్‌ను మొత్తం సీట్లు త్యాగం చేయమనండి.. ఇంకా బాగుంటుంది అంటూ సెటైర్లు వేశారు. ఎన్టీఆర్ తర్వాత సినిమా నటులను ప్రజలు నమ్మలేదు అన్నారు ముద్రడగ.. నిన్న సీఎం వైయస్ జగన్ సమక్షంలో వైయస్ఆర్‌సీపీలో చేరాను.. కొన్ని శక్తులు నన్ను ఇంతకాలం సీఎం వైయస్ జగన్‌కి దూరం చేశారు… కానీ, వైయస్ఆర్‌సీపీ పార్టీ ఫౌండర్స్ లో నేను ఒక్కడిని అన్నారు. వైయస్ జగన్ ను సీఎం చేయడానికి నా ప్రయత్నం చేస్తాను అన్నారు. మా కుటుంబం 1951 సినిమాలలోకి వచ్చేటప్పటికి ఇప్పుడు ఉన్న నటులు ఎవరూ పుట్టలేదన్నారు.. మేం రాజకీయాల్లోకి వచ్చేటప్పటికీ ఇప్పుడు ఉన్న వారికి ఏబీసీబీలు కూడా రావు అంటూ సెటైర్లు వేశారు. వారు సినిమాల్లో హీరో కావొచ్చు.. నేను రాజకీయాల్లో హీరో అని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో మొలతాడు లేని వాడు.. లాగు లేని వాడు.. కూఏడా నాకు పాఠాలు చెప్తున్నారని ఫైర్ అయ్యారు. మీది ఏంటి పొడుగు… ఎందుకు మీ దగ్గరకి రావాలి అని నిలదీశారు. నేను రాజకీయాల్లోకి రావడానికి కాపులు కారణం కాదు అన్నారు ముద్రగడ.. నా దగ్గరకు వస్తానని చెప్పి ఇనప ముక్క నీటిలో నాన పెట్టారంటూ మండిపడ్డారు. రాజకీయాలు మా దగ్గర నేర్చుకోవాలని సూచించారు.. నా మీద రక రకాలు తప్పుడు పోస్టింగ్ లు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను ఏ ఉద్యమాలు చేసిన బీసీలు, దళితులు ముందు ఉన్నారు.. మీరు చెప్పినట్లు నేను ఎందుకు రాజకీయాలు చేయాలి? అని ప్రశ్నించారు.. మరోవైపు.. పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తాను అని ప్రకటించారు.. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో పవన్ కల్యాణ్ ఎక్కడ పడుకున్నారు? అని నిలదీశారు. నాకు చెప్పడానికి ఆయన ఎవరు? ఉద్యమం జరిగినప్పుడు ఆయన ఎప్పుడైనా వచ్చారా? పవన్ కల్యాణ్‌కి నాకు సంబంధం ఏంటి? నిన్న కాక మొన్న పుట్టి.. నన్ను ప్రశ్నించడం ఏంటి? అంటూ ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు ముద్రగడ పద్మనాభం. ముద్రగడ ఇంకా ఏమన్నారంటే.. బేషరతుగానే వైయస్ఆర్‌సీపీలో చేరా ప్రజలకు సేవ చేయాలనే ఈ నిర్ణయం తీసుకున్నా జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రి చేయాలనే పార్టీలో చేరా దళితుల భిక్షతోనే ఈ స్థాయికి వచ్చా పవన్ కల్యాణ్ సినిమాల్లో హీరో కావొచ్చు.. నేను రాజకీయాల్లో హీరోను. వైయస్ఆర్‌సీపీ పార్టీ స్ధాపనలో నేను కూడ ఒక వ్యక్తిని. దురష్టవశాత్తూ కొన్ని శక్తులు నన్ను దూరం చేశాయి. మళ్ళీ ఇన్నాళ్ళకు పార్టీలో చేరడం ఆనందంగా ఉంది. ఎలాంటి కోరికలు లేకుండా సీఎం జగన్‌కు సేవ చేయాలని ఉంది. మేము సినిమా పరిశ్రమలోకి వచ్చినప్పుడు.. ఇప్పుడు ఉన్న నటులు పుట్టలేదు. బీసీలు, దళితులు మా కుటుంబానికి మద్దతుగా నిలిచారు ప్రత్తిపాడుకు ఉన్న మర్యాద దేశంలో ఎక్కడా ఉండదు. నేను రాజకీయాల్లో రావడానికి కాపులు కారణం కాదు. రాజకీయాల్లో మొలతాడు లేని వాడు కూడా నాకు చెబుతున్నాడు. కాపులు, దళితుల కోసం ఉద్యమం చేశాను. కిర్లంపూడి స్పరంచ్ పదవులు వస్తే బీసీని గెలిపించాను. నా వర్గాన్ని.. నా మనుషులను కాపాడుకోవడానికి ఏమైనా చేస్తాను. వాళ్లు సినిమాల్లో హీరో కావచ్చు.. నేను రాజకీయాల్లో హీరోని. సీఎం వైయస్ జగన్ కుటుంబానికి ఓ చరిత్ర ఉంది. ముఖ్యమంత్రి వైయస్ జగన్ దగ్గరకు ఎందుకు వెళ్ళావు.. మా నాయకుడు దగ్గరకు ఎందుకు వెళ్ళ లేదని పోస్టులు పెడుతున్నారు. నా మీద తప్పుడు పోస్టులు పెడుతున్నారు. మీరా నాకు పాఠాలు నేర్పేది. కాపు ఉద్యమం కోసం సానుభూతిగా ఒక ఉత్తరం రాశారా? మా కుటుబాన్ని చంద్రబాబు అవమానిస్తే.. ఈ ఐదేళ్ళు ఎక్కడ ఉన్నారు. మా మడుగులో దాక్కుని మాట్లాడడం బాగోలేదు. సినిమా వాళ్ళకు ఓటు వేస్తే ఆరు నెలలకు ఒకసారి వస్తారు. ఆరు నెలలకు.. సంవత్సరానికి వచ్చి రాజకీయాలు చేసేద్దాం అంటే ఏలా? జనసేన పార్టీ క్లోజ్ అయిపోతుంది. వేరే పార్టీలో కలవడం కాదు. సినిమా వాళ్ళు రాజకీయ నాయకులను గౌరవించరు. మీ ఇంటికి వస్తే ఏమీ ఇస్తారు.. మా ఇంటికి వస్తే ఏం తెస్తారు అనే విధంగా సినిమా వాళ్ళ వ్యవహరం ఉంటుంది గ్రహణం వీడింది కనుకే చంద్రబాబు 2019 ఎన్నికల తరువాత ఇంటికి వెళ్ళి పోయాడు. చంద్రబాబు చేసిన అవమానానికి నేను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాను చంద్రబాబు పతనం చూద్దువు గాని అని భగవంతుడు చెప్పాడు. మరో 30 ఏళ్ళు వైయస్ జగనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి. పేదల పెన్నిదిగా ఉన్న వైయస్ జగన్‌ను ప్రజలు దీవిస్తారు. పార్టీ ఆదేశాలను శిరసావహిస్తాను. ఏదైనా చేయడానికి సిద్దం 70-80 సీట్లు నుండి పోటీ చేయండి. ముఖ్యమంత్రి పదవి తీసుకోండి అని జనసేన నేతలకు చెప్పాను. మీరు తీసుకునే 20 సీట్ల కోసం నన్ను లాక్కండి అని చెప్పాను. చంద్రబాబు అరెస్ట్ అయిన తరువాత టీడీపీ గ్రాఫ్ పడిపోయింది. బీజేపీ నేతలు కూడా నన్ను ఫోన్ ద్వారా సంప్రదించారు. 175 స్ధానాలు పోటీ చేయండి అని అడిగాను. స్టీల్ ప్లాంట్, పోలవరం కోసం అడిగాను నేనెప్పుడూ పవన్‌కు సలహ ఇవ్వలేదు. నా ముఖం ఆయన.. ఆయన ముఖం నేను ఎప్పుడు చూడలేదని ముద్రగడ పేర్కొన్నారు.