బాబుతో పొత్తు కోసం పవన్‌ హైడ్రామా

ఇన్నాళ్లూ రహస్యంగా.. ఇవాళ ముసుగు తొలగించారు

రాష్ట్ర రాజకీయాల్లో సీఎం వైయస్‌ జగన్‌ ఒక్కరే నిజమైన హీరో

ప్ర‌జ‌ల దృష్టిలో ప‌వ‌న్ ఎప్ప‌టికీ జోరోనే..

కాపుల గురించి మాట్లాడే అర్హత పవన్‌కు ఉందా..?

మాజీ మంత్రి కురసాల కన్నబాబు

కాకినాడ: ఇన్నాళ్లూ ర‌హ‌స్యంగా సాగిన చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ల బంధం అని, ఇవాళ ముసుగు తీసి ప్రేమ‌ప‌క్షులు రెండూ ఒక్క‌ట‌య్యాయ‌ని మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఇద్దరూ కలిసి కాపురం చేయడానికి ఇంత సీన్‌ సృష్టించాలా అని నిలదీశారు. చంద్ర‌బాబును ముఖ్య‌మంత్రిని చేయ‌డానికి ప‌వ‌న్ ఆరాటప‌డుతున్నాడని ప్ర‌జ‌ల‌కు  అర్థ‌మైపోయింద‌న్నారు. చంద్ర‌బాబుతో పొత్తు కోస‌మే ప‌వ‌న్ క‌ల్యాణ్ హైడ్రామా న‌డిపాడ‌న్నారు. కాకినాడ‌లో మాజీ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. 

మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఇంకా ఏమ‌న్నారంటే.. 
ఎంతసేపూ వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని విలన్‌గా చూపడమే పవన్‌ పని. తాను హీరోగా పోరాడుతున్నాను కాబట్టి గెలుస్తానని పవన్‌ అనుకుంటాడు. కానీ వాస్తవానికి ఆయన ప్రజల దృష్టిలో హీరో కాదు. ఒక జీరో. రాష్ట్ర రాజకీయాల్లో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఒక్కరే నిజమైన హీరో. ఇది నిజం. పవన్‌కు ఎక్కడా స్థిరత్వం లేదు. మాటలకు ఎక్కడా పొంతన ఉండదు. అర్థం అసలే ఉండదు. ఇదే విషయాన్ని ఇవాళ హైడ్రామాలో బాగా చూపించారు. చివరకు ఆయనకు సంస్కారం కూడా లేదు. కనీసం చదువు, సంధ్య లేని, ఏ మాత్రం అవగాహన లేని, మూర్ఖులు కూడా మాట్లాడని మాటలు పవన్‌ మాట్లాడుతున్నాడు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి పవన్‌ తిడుతూనే బతుకుతున్నాడు.

కాపుల గురించి మాట్లాడే అర్హత ప‌వ‌న్‌కు లేదు
కాపుల గురించి మాట్లాడే అర్హత పవన్‌కు ఉందా? ఆయన తన పక్కన కమ్మ సామాజికవర్గానికి చెందిన నాదెండ్ల మనోహర్‌ను కూర్చోబెట్టుకున్నాడు. ఆ పార్టీలో ఏ కాపు నాయకులకూ కనీసం కుర్చీ వేయలేదు. ప‌వ‌న్‌ పక్కన కూర్చోవడానికే కాపులకు అర్హత లేదు. అలాంటప్పుడు నువ్వు కాపులను ఎలా ఉద్దరిస్తావు ప‌వ‌న్‌..? నీ పార్టీకి కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్, నిర్మాత ఎవరెవరో అందరికి తెలుసు. రంగా హత్యకు బాధ్యుడు ఎవరో తెలుసా..? ఆనాటి హోంమంత్రి హరిరామజోగయ్య రాసిన పుస్తకంలో చంద్రబాబే రంగ హత్యకు బాధ్యులు అని రాశారు.. అదే చంద్రబాబు చంకలో కూర్చొని రంగా దారుణ హత్య గురించి కన్నీళ్లు కారుస్తావా?.

ఆనాడెందుకు మాట్లాడలేదు?..
ముద్రగడ పద్మనాభంను కాపులు ఒక ఐకానిక్‌ గా చూస్తారు.. అటువంటి ముద్రగడ కుటుంబంలోని మహిళలను దుర్మార్గంగా, తప్పుగా, వల్గర్‌ గా మాట్లాడి, హింసించి, చాలా భయంకరంగా ఆత్మక్షోభ చెందేలా చంద్రబాబు సర్కార్‌ ప్రవర్తించింది. ముద్రగడ పద్మనాభంను నాలుగు గోడల మధ్య బంధించి హింసించినప్పుడు మీ రెస్పాన్స్‌ ఏదీ?. రాజకీయాలకు అతీతంగా ముద్రగడను పలకరించడానికి వచ్చిన చిరంజీవిని చంద్రబాబు సర్కార్‌ రాజమండ్రి ఎయిర్‌ పోర్టులో నిర్బంధించి తిరిగి వెనక్కి పంపించినప్పుడు తమరు ఏం చేశారు పవన్‌?

అప్పుడూ ఇప్పుడూ ఒకరే మీ టార్గెట్‌..
సినిమాల్లో కుమ్మేస్తా, పీకేస్తా అన్న డైలాగులు బాగుంటాయి. కానీ నిజ జీవితంలో, ముఖ్యంగా రాజకీయ జీవితంలో ఆ మాటలను ఎవరూ హర్షించరు. రాజకీయ పార్టీ పెట్టి బాధ్యత లేని రాజకీయం చేసే వరుసలో నెంబర్‌ వన్‌ పవన్‌. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీఎం వైయ‌స్ జగన్‌నే తిడతారు.. అధికారంలో వచ్చాక వైయ‌స్ జగన్‌నే తిడతారు. అప్పుడు, ఇప్పుడు పవన్, చంద్రబాబుది ఫెవికాల్‌ బంధం. చంద్రబాబు కబంధ హస్తాల నుంచి బయటకు వచ్చే పరిస్థితి పవన్‌కు లేదని ప్రజలే అనుకుంటున్నారు.

ఆరోజే ఎందుకు?..
చంద్రబాబుకు చెలికత్తే వేషం వేస్తున్నావు రాజకీయాల్లో.. కాదని చెప్పగలవా పవన్‌? విశాఖ గర్జన రోజే రావాల్సిన అవసరం ఏంటి? వచ్చి ర్యాలీగా వెళ్లాల్సిన అవసరం ఏంటి? విజయవాడలో జనవాణికి వచ్చినప్పుడు ర్యాలీ ఎందుకు పెట్టలేదు.. మరి అది విశాఖ గర్జనను డైవర్ట్‌ చేయడానికే కాదా?. విశాఖలో అల్లరి చేసి, మహిళా మంత్రి మీదు, బీసీ మంత్రి మీద దాడి చేసిన క్షమాపణ చెప్పాలన్న జ్ఞానం కూడా లేదు.. పైగా విజయవాడ వచ్చి వైయస్‌ఆర్‌ సీపీ నాయకుల్ని ఇష్టానుసారంగా తిట్టడం మీ సంస్కారానికి నిదర్శనం.

తాజా వీడియోలు

Back to Top