ఎన్టీఆర్‌ ఆదర్శమైతే ఎందుకు వెన్నుపోటు పొడిచారు..?

చంద్రబాబు, టీడీపీ నేతలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని ధ్వజం

కృష్ణా: స్వర్గీయ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన దొంగలు నేడు.. ఆయన వర్ధంతి, జయంతి కార్యక్రమాల్లో ఫొటోలకు దండలు వేసి ఆయనే మాకు ఆదర్శం అని చెప్పుకొని తిరుగుతున్నారని, ఎన్టీఆర్‌ మీకు ఆదర్శమైతే వెన్నుపోటు ఎందుకు పొడిచారని మాజీ మంత్రి, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ పేరు, ఫొటోలతో చంద్రబాబు, టీడీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మాజీ మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ గొప్పతనం గుర్తించిన వైయస్‌ జగన్‌ ప్రభుత్వం ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టిందని గుర్తుచేశారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి, ఆయన పార్టీని, పదవి లాక్కొని, ఆయన్ను క్షోభకు గురిచేసిన దొంగలను ఎన్టీఆర్‌ అభిమానులు మట్టి కరిపించారన్నారు. నేటికీ ఎన్టీఆర్‌ పేరును వాడుకొని ఓట్లు పొందాలని చూస్తున్నారన్నారు. 

Back to Top