చంద్రబాబుకు 2024 చివరి ఎన్నికలు

పులివెందులలో టీడీపీ ఒక్క పంచాయతీ అయినా గెలవగలదా..?

మాజీ మంత్రి కొడాలి నాని

కృష్ణా: చంద్రబాబుకు జీవితకాలం సమయం ఇస్తున్నాం.. పులివెందుల నియోజకవర్గంలో ఒక్క పంచాయతీ అయినా గెలవగలడా..? అని మాజీ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. నారావారిపల్లెలో గెలవలేని చంద్రబాబు కుప్పంలో ఎలా గెలుస్తాడన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలకు మాజీ మంత్రి కొడాలి నాని స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు 2024 చివరి ఎన్నికలని ఎద్దేవా చేశారు. ఎన్నికల తరువాత పవన్‌ జెండా పీక్కొని పారిపోతాడన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ దెబ్బకు చంద్రబాబు, పవన్, లోకేష్‌ రాజకీయ అనాథలుగా మిగిలారన్నారు. జనసేన పార్టీని పవన్‌ కల్యాణ్‌ చంద్రబాబుకు అంకితం చేశాడన్నారు. రాష్ట్రంలో సమస్యలు లేకనే ఇప్పటంపై విపక్షాల రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. 

చంద్రబాబుకు కొడాలి నాని సవాల్‌..
ప్రతిపక్ష నేత చంద్రబాబుకు కొడాలి నాని సవాల్‌ విసిరారు. ‘అరబిందో సంస్థతో నీకు సంబంధం లేదని ప్రమాణం చేయగలవా..? 2009–19 వరకు అరబిందో నుంచి చంద్రబాబు పార్టీ ఫండ్‌ వసూలు చేశాడు’ అని చెప్పారు. లిక్కర్‌ స్కామ్‌లో అరెస్టయిన వారిలో ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు లేడని కొడాలి నాని అన్నారు. 
 

Back to Top