అమరావతి ప్రజలపై చంద్రబాబుకు ప్రేమ లేదు

మాజీ మంత్రి కొడాలి నాని

ఆ నలుగురి అభివృద్ధే చంద్రబాబుకు కావాలి
 
మహిళలను అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తున్నారు

ఆస్తుల సంపాదనే చంద్రబాబు ధ్యేయం

ఉత్తరాంధ్ర సత్తాను ఎల్లోమీడియాకు చూపించాలి

ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లను బహిష్కరించాలి

విశాఖ:  చంద్రబాబుకు ఉత్తరాంధ్ర, రాయలసీమ, అమరావతి ప్రాంతాల ప్రజలపై ప్రేమ లేదని, అమరావతిలో ఉన్న ఆస్తులపై మాత్రమే ఆయనకు ప్రేమ ఉందని మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు. నారా లోకేష్‌ భవిష్యత్‌ కోసం, అమరావతిలో ఉన్న భూముల ఆస్తుల విలువ పెంచుకునేందుకు ఒకే ప్రాంతంలో లక్షన్నర కోట్లతో అభివృద్ధి చేయాలని ప్రయత్నం చేస్తున్నారన్నారు. మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతోనే సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిర్ణయం తీసుకున్నారన్నారు. విశాఖ గర్జన బహిరంగ సభలో కొడాలి నాని మాట్లాడారు. 

ఇవాళ విశాఖను పరిపాలన రాజధాని చేయాలని కోరుతూ ఇంత వర్షంలో కూడా మీ ఆకాంక్షను తెలియజేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. కార్యక్రమానికి హాజరైన పెద్దలకు, జేఏసీ నాయకులకు హృదయపూర్వక నమస్కారాలు. వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ రాష్ట్రంలో ఉన్న మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి. మూడు ప్రాంతాల ప్రజలు బాగుండాలి. రాబోయే తరాల్లో ప్రాంతీయ విద్వేషాలు రాకూడదు. ఒక ప్రాంతం అభివృద్ధి చెంది, మిగతా ప్రాంతాలు వెనుకబడి ఉంటే మా ప్రాంతం నుంచి వెళ్లిపోండి అంటూ ప్రత్యేక ఉద్యమాలు వచ్చే అవకాశం వస్తుంది. ఈ రాష్ట్ర సంపదతో ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన తరువాత అక్కడి నుంచి మరో ప్రాంత ప్రజలను వెళ్లగొడితే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు వస్తాయి. ఈ రోజు ఏపీలో అందరం కూడా ఏరకమైన బాధలు అనుభవిస్తున్నామో..అలాంటి బాధలు వచ్చే తరాలు అనుభవించకూడదనే సీఎం వైయస్‌ జగన్‌ మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చెప్పి..విశాఖను పరిపాలన రాజధాని, కర్నూలును జ్యుడిషియల్‌ రాజధాని, అమరావతిని శాసన రాజధానిగా చేయాలని భావించారు. ఈ రోజు చంద్రబాబు, ఈనాడు రామోజీ, ఏబీఎన్‌ రాధాకృష్ణ, టీవీ5 నాయుడు, పవన్‌కు ఒక్కటే బాధా. ఈ ప్రాంతంలో టీడీపీ లేదా? కర్నూలులో లేదా? ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లు లేవా? ఒక్క రెండు మూడు జిల్లాల్లోనే వ్యాపారాలు చేస్తున్నారా? ఈ ప్రాంతంపై ఉన్న ధ్వేషంతో అడ్డుకుంటున్నారు. అమరావతి ప్రాంతంలో కొన్ని వేల ఎకరాల భూములు కొన్నారు. వైయస్‌ జగన్‌ సీఎం అయ్యేనాటికి చంద్రబాబు గ్రాఫిక్స్‌చూపించి రూ.40 లక్షల పొలాన్ని రూ.4 కోట్లకు తీసుకెళ్లాడు. ఆ ప్రాంతాన్ని లక్షన్నర కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తే..వీళ్లు రూ.40 పెట్టి కొన్న ఎకరం భూమి ఎక్కడ రూ.10 కోట్లు, 12 కోట్లు అవుతుందోనని వందల ఎకరాలు కొన్నారు. ఈ రోజు వంద ఎకరాలు చంద్రబాబు చెప్పిన మోడల్‌లో లక్షన్నర కోట్లతో అభివృద్ధి చేస్తే..ఎకరం రూ.15 కోటు ్లచొప్పున వందల కోట్లు సంపాదించవచ్చు అన్నది వారి ఆశ. ఆ ఆస్తులు కొని ఈ దుర్మార్గులు ఈ ప్రాంతంపై విషం కక్కుతున్నారు. చంద్రబాబు అనే వ్యక్తి ఒక 420. పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచారు. పదవి కోసం పార్టీ నుంచి ఎన్టీఆర్‌ను మెడపట్టి బయటకు నెట్టారు. జూనియర్‌ ఎన్టీఆర్‌నుంచి ప్రతి ఒక్కరిని వేధించి 210 లోకేష్‌ కోసం ఎన్టీఆర్‌ కుటుంబాన్ని వేధిస్తున్నాడు. చంద్రబాబుకు ప్రేమ, కరుణ, దయ అన్నవి ఉండవు. ఆయనకు ఉత్తరాంధ్ర, రాయలసీమ, అమరావతి ప్రజలపై ప్రేమ లేదు. అమరావతిలో ఉన్న ఆస్తుల విలువ పెంచేందుకే గుళ్లు, గోపురాలు తిరుగుతున్నారు. ఈ ప్రాంతంలో ఏబీఎన్, టీవీ5, ఈనాడులను బ్యాన్‌ చేయాలని, టీడీపీ, జనసేనను బ్యాన్‌ చే యాలి. మీరు ఎవరు కూడా వాళ్ల పేపర్లు చూడవద్దు. టీవీలు చూడవద్దు. మీ ప్రాంతంలో ఉన్న కేబుల్‌ ఆపరేటర్లతో వాళ్ల ప్రసారాలను నిలుపుదల చేయించి కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లుగా వీళ్ల ఐదుగురికి మూతి పళ్లు పగిలిపోయేలా, ఈ ప్రాంతం వైపు చూడాలంటేనే భయపడేలా బుద్ధి చెప్పండి. మీ అందరికీ కృష్ణా, గుంటూరు జిల్లాల మద్దతు ఉంటుంది. మీ ప్రాంతానికి చెందిన దాదాపు 10 వేల మంది ముఠా, తాఫీ పనులకు మా గుడివాడకు వచ్చారు. వాళ్ల జీవన పరిస్థితులు ఎలా ఉన్నాయో మనమందరం చూశాం. ఈ వైజాగ్‌ మహానగరం, రూ.4, 5 వేల కోట్లు ఖర్చు చేస్తే వికేంద్రీకరణలో పరిపాలన రాజధాని ఏర్పాటు చేస్తే..ఇక్కడి నుంచి వచ్చిన ఆదాయంతో రాష్ట్రంలోని ప్రతి పేదవాడి సంక్షేమానికి పథకాలు అందించవచ్చు. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అందరూ కూడా ఇంత వానలో కూడా ఈ గర్జనను విజయవంతం చేసిన అందరికీ కొడాలి నాని కృతజ్ఞతలు తెలిపారు.
 

తాజా వీడియోలు

Back to Top