కాకికాడ: వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనలో ఎన్‌ఐఏ లోతుగా విచారించాలని మేం కోరితే తప్పేంటì అని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ప్రశ్నించారు. హత్యాయత్నం ఘటనపై నిగ్గు తేల్చాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. మా నేతపై హత్యాయత్నం జరిగితే దాన్ని లోతుగా దర్యాప్తు చేయాలని కోరడంలో తప్పేముందని నిలదీశారు. డీఎల్ రవీంద్రారెడ్డి అవుట్‌డేటెడ్ పోలిటిషీయన్ అని విమర్శించారు. సీఎం వైయస్ జగన్ సతీమణి వైయస్ భారతమ్మపై ఇష్టం వచ్చినట్లు ఊరుకునేది లేదని కన్నబాబు హెచ్చరించారు. కాకినాడులో కన్నబాబు మీడియాతో మాట్లాడారు. వైయస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం జరిగింది. ఇందులో ఏదైన కుట్రకోణం ఉందా తేల్చాలని ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా, ఈ రోజు ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా వైయస్ జగన్ పదే పదే కోరారు. హత్యాయత్నం అని నిర్దారించిన తరువాత ఎందుకు హత్యాయత్నం జరిగిందని తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని మేం అడుగుతున్నాం. దీనిపైన లోతైన అధ్యాయనం జరగాలని మేం కోరుతున్నాం. ఎలాంటి అధ్యాయనం జరుగకుండా కేసును మూసేస్తారా? . ఈ రోజు ఈనాడులో పెద్ద బ్యానర్ కథనం వేశారు. అందులో దాడి చేసిన నిందితుడు శ్రీనివాస్ ఎన్‌ఐఏకి ఎప్పుడు వాంగ్మూలం ఇచ్చాడు..ఆ వాంగ్మూలం ఇప్పుడు బయటకు వచ్చిందంటూ కథనం రాశారు. ఇందులో వారే తీర్పు కూడా ఇచ్చారు. వాళ్లే న్యాయమూర్తులు, న్యాయవాదులు అన్నట్లుగా చెబుతారు. 2019 ఎన్నికల్లో వైయస్ జగన్‌కు లబ్ధి కలిగేలాగా సానుభూతి పొందేందుకు జగన్ కోడికత్తితో దాడి ప్రణాళిక అమలు చేయించారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్న విషయం ఈ వాంగ్మూలంతో నిజమని తేలిందంటూ కథనం రాశారు. తీర్పులు ఇవ్వడానికి మీరెవరు అని ప్రశ్నిస్తున్నాం. వైయస్ జగన్‌పై దాడి జరిగినప్పుడు ఎగతాళిగా మాట్లాడారు. అప్పటి నుంచీ ఎల్లోమీడియా ఈ ఘటనపై తప్పుడు రాతలు రాస్తూనే ఉంది. హత్యాయత్నం ఎందుకు జరిగిందని దర్యాప్తు జరపాలి. దాని వెనుకలా ఎవరున్నారో తేల్చమని అడుగుతున్నాం. ఎల్లోమీడియా తమకు తోచిన కథనాలు రాసేస్తున్నాయి. వీళ్లు రాస్తారు..చంద్రబాబు ప్రచారం చేస్తారు. చంద్రబాబు అండ్ కో ..నోటికి వచ్చినట్లు మాట్లాడుతారు..దాన్ని వీళ్లు అచ్చు వేస్తారు. ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రశ్నిన్తే దుర్మార్గులు అంటారు. వీళ్లు రాసింది చదువుకుని ఆనందపడాలి. ఇందులో మేం అడిగే డిమాండులో తప్పేంటో చెప్పాలి. కుట్ర కోణం ఉందని అంటే ఎందుకు మీరు భుజాలు తడుముకుంటున్నారు. సంఘటన జరిగిన రోజునే ఈనాడు పత్రిక ఎంతగా సమర్ధించిందో అందరికీ తెలుసు. ఈ సంఘటనతో అప్పటి ప్రభుత్వానికి చెడ్డపేరు రాకూడదని చాలా చులకనగా, తేలికగా తీసిపడేసింది. దాడి చేసిన వ్యక్తి మీద ఎలాంటి కేసులు లేవని ఈనాడులో ఆ రోజే రాశారు. ఆ తరువాత అతనిపై నేరపూరిత చరిత్ర ఉందని తేలింది. సంఘటన జరిగిన గంటలోపే డీజీపీ మీడియా ముందుకు వచ్చి శ్రీనివాస్ వైయస్ జగన్ అభిమాని అన్నట్లుగా మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వానికి ఈ ఘటన సంబంధం లేదనట్లు గంటకే చెప్పారు. ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగితే ఆ ప్రభుత్వానికి బాధ్యత లేదా? దాన్ని చులకనగా కోడి కత్తి అంటూ మాట్లాడుతారా? వైయస్ జగన్ సతీమణి వైయస్ భారతమ్మ ఒక గృహిణిగా, పారిశ్రామికవేత్తగా సక్సెస్ అయ్యారు. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్తీ్ర ఉంటుందంటారు. ఇవాళ వైయస్ జగన్ విజయం వెనుక వైయస్ భారతమ్మ ఉన్నారు. అలాంటి మహిళ గురించి నోటికి వచ్చినట్లుగా మీకు వచ్చిన స్క్రిప్ట్‌తో పిచ్చి పిచ్చిగా మాట్లాడటం డీఎల్ రవీంద్రకు తగునా?. ఇదే భాషతో మేం ఎప్పుడైనా మాట్లాడామా?. ఇదే రకమైన భాష కేవంలం రవీంద్రారెడ్డి మాట్లాడమే కాదు..ఇవాళ లోకేష్, అనిత, అచ్చెన్నాయుడు లాంటి నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇలాంటి మహిళ గురించి మాట్లాడేవారికి కొంచమైన జ్ఞానం ఉండాలి కదా? రాజకీయాల గురించి పట్టించుకోని మహిళపై, ముఖ్యమంత్రి సతీమణి గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటమేనా మీ సంస్కారం. మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా? రోజు వైయస్ జగన్‌పై చేస్తున్న ఆరోపణలు, దుర్మార్గాలు అన్నీ ఇన్నీ కావు. ఒక రాజకీయ పార్టీ నడుపుతున్న నాయకుడిగా, ముఖ్యమంత్రిగా మీ విమర్శలు వైయస్ జగన్ భరిస్తాడు. కానీ ఆయన సతీమణి గురించి మాట్లాడేందుకు మీకు కొంచమైన జ్ఞానం ఉందా? . ఇదే మాటలు మీ ఇళ్లలోని మహిళల గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి భరిస్తున్నారని మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతారా? . ఇది మంచి పద్ధతి కాదు. ఈ రకమైన పద్ధతిని మీరు అవలంభించడం మంచిది కాదు. చంద్రబాబు ఈరకమైన పద్ధతిని చంద్రబాబు కట్టడి చేస్తే మంచిదని నేను సూచిస్తున్నాను. అసలు సంఘటనను వదిలేసి. దీని వెనుక ఏదైన కుట్ర ఉందా అన్నది విచారించమని మేం కోరితే..అదేదో తప్పులాగా మాట్లాడుతున్నారు. 2003లో అలిపిరిలో చంద్రబాబుపై హత్యాయత్నం జరిగింది. నిజంగా సానుభూతి కోసం చంద్రబాబు చేయించుకున్నాడని మేం మాట్లాడామా? నిజంగా సానుభూతి కోసమే చంద్రబాబు తనపై దాడి చేయించుకుంటే 2004లో చంద్రబాబుకు ఎన్ని సీట్లు వచ్చాయి. కేవలం 47 సీట్లు మాత్రమే వచ్చాయి కదా? చంద్రబాబుకు ఎందుకు సానుభూతి రాలేదు. వైయస్ జగన్ మహాశక్తిగా అవతరించారు. పాదయాత్ర ద్వారా ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించారు కాబట్టి ప్రజలు ఆయన్ను గుండెల్లో పెట్టుకున్నారు. మీలాగా డ్రామాలాడటం వైయస్ జగన్ చేతకాదు. చంద్రబాబు, ఆయన కొడుకు యాత్రల పేరుతో తిరుగుతున్నారు. వైయస్ జగన్‌కు తెలియనిది నటించడం, నన్ను మించిన మహానటుడు చంద్రబాబు అని నీకు పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ సర్టిఫికెట్ ఇచ్చారు.