తాడేపల్లి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బతుకే అబద్ధమని మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) విమర్శించారు. చంద్రబాబు కోసమే పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టాడని ధ్వజమెత్తారు . రైతులకు పరామర్శ పేరుతో చంద్రబాబుకు అనుకూల రాజకీయం చేస్తున్నాడని మండిపడ్డారు. 6 నెలలకు ఒకసారి పవన్ రోడ్డుపైకి వస్తున్నాడని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ ప్రతిపక్షంలో కూడా పవన్ విమర్శించేవాడని దుయ్యబట్టారు. విమర్శలు చేసేందుకే ఇప్పుడు మళ్లీ రోడ్డుపైకి వస్తున్నాడని ఫైర్ అయ్యారు. తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్ని నాని మాట్లాడారు. చంద్రబాబు అనుకూల రాజకీయం పేరు ఏమో రైతుల పరామర్శ. పవన్ చేసేదంతా చంద్రబాబు అనుకూల రాజకీయమని మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులకు ఎప్పుడు ఏ విపత్తు వచ్చినా అండగా సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిలబడింది. అలాంటి ప్రభుత్వాన్ని దూషించటానికి ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కాలు పెట్టారు. దానికి పవన్ పెట్టిన పేరు రైతుల పరామర్శ. చేసేదంతా చంద్రబాబు అనుకూల రాజకీయం. చంద్రబాబు కోసమే.. టీడీపీ పది కాలాల పాటు బాగుండాలని.. ఒక రాజకీయ పార్టీని పవన్ కల్యాణ్ ఏర్పాటు చేశారు. ఆరు నెలలకు ఒకసారి రోడ్డు మీదకు పవన్ వచ్చేది జగన్ గారిపై విమర్శల కోసమే* పవన్ కల్యాణ్ టెంపరితంగా మాట్లాడతారు. పవన్ కంటే పది ఆకులు ఎక్కువే ప్రజలే చదివారు. వైఎస్ఆర్సీపీ నాయకులు అంతా నన్ను తిట్టడానికి మాత్రమే రోడ్ల మీదకు వస్తున్నారు. మరి, పవన్ కల్యాణ్ ఆరు నెలలకు ఒకసారి జగన్ గారిని తిట్టడానికి తప్ప దేనికి వస్తున్నావు. ఇవాళ జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడుగా జగన్ గారు ఉన్నప్పుడు కూడా ఆయన్ను తిట్టడానికి తప్పిస్తే పవన్ ఎందుకు వచ్చాడు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన్ను తిట్టడానికి రావాలి. కానీ, జగన్ గారిని తిట్టడానికి ఆరు మాసాలకు ఒకసారి రోడ్డు ఎక్కే వ్యక్తి పవన్. ఈ విషయం పవన్ రాజకీయ చరిత్ర చూస్తే.. అందరికీ అర్థమవుతుంది. వారాహి యాత్ర అంటాడు. వాయిదాలు వేస్తూపోతాడు జూన్ నుంచి ప్రజల్లో తిరగటానికి సిద్ధంగా ఉన్నారట. గ్రామాల్లో, బస్తీల్లో, పేటల్లో అప్పు రేపు అని రాస్తారు. అలాగే వాయిదాల పద్ధతిలో ఎప్పుడు చూసినా అప్పు రేపే. నవంబరులో అమ్మవారి దగ్గరకు వచ్చి పూజలు అన్నాడు. ఏదీ ఆ వ్యాన్. దసరా నుంచి రాష్ట్రమంతా తిరిగి.. సందు సందు బజారు బజారు తిరుగుతాను అంటున్నాడు. రేపు జూన్ నుంచి తిరుగుతాను అంటాడు. మళ్లీ షరతులు వర్తిస్తాయి. డిసెంబరులో ఎన్నికలు వస్తే జూన్ నుంచి తిరుగుతాను అంటాడు. రాజకీయాల్లో ఇంతటి పనోడు మనకు ఎవ్వడూ దొరకడు. ప్రజల కోసం పదిరోజుల పనిచేయకుండా సీట్లు ఇవ్వలేదనటం ఏమిటో? ప్రజాజీవితంలో పవన్ పనిచేసింది ఎక్కడ? పట్టుమని పదిరోజులు షూటింగ్‌కు వెళ్లకుండా జనం కోసం పనిచేసింది ఎక్కడ? 2013లో పార్టీ పెట్టావు. ఇప్పుడు 2023. పదేళ్లలో ఎప్పుడైనా పట్టుమని పదిరోజులు ఆంధ్రాలో జనం కోసం బ్రతికింది ఏముంది? ఏ ఒక్కరోజైనా ఏ ఒక్క ట్రిప్‌లో అయినా.. శని, ఆదివారం రావటం. రెండు రోజుల్లో నాలుగు మాటలు జగన్‌ను తిట్టడం వెళ్లి షూటింగ్ చేసుకోవటం, ప్యాకప్. నాదెండ్ల, నాగబాబు తప్ప ప్రజల మాటలు విన్నావా పవన్ ప్రజల కోసం బ్రతుకుతున్నామంటే అది ఒక రాజకీయ నాయకుడు వారి మధ్య తిరగాలి కదా. ప్రజల మధ్య బ్రతకాలి కదా. వారి కష్టాలు వినాలి కదా. ఎంతసేపూ నాదెండ్ల మనోహర్ మాటలు వినటం తప్పితే ప్రజల మాటలు విన్నావా? మీ ఇంకో అన్నయ్య (నాగబాబు), నాదెండ్ల మనోహర్ తప్పితే పవన్‌తో మాట్లాడినవారు ఎవరైనా ఉన్నారా? 2 లక్షల పుస్తకాలు చదివాను అంటావు. రోబోలో రజనీకాంతా ఏమిటీ? కాపులను బీసీల్లో చేరుస్తామని హామీ ఇచ్చి మోసం చేసింది చంద్రబాబే కాపుల కోసం ముద్రగడ పోరాడితే దాడి చేశారు ఆనాడు చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదు పవన్ 2014 ముందు కాపుల్ని బీసీల్లో చేరుస్తానని చంద్రబాబు ఊరూరా తిరిగి చెప్పటమే కాకుండా మేనిఫెస్టోలో కూడా పెట్టారు. మరి అప్పుడు పవన్, చంద్రబాబు ప్రభుత్వమే కదా. మరి ఆనాడు చంద్రబాబు ఎందుకు ప్రశ్నించలేదు. చంద్రబాబు ఆ హామీ మేరకు పనిచేయకపోతే ప్రభుత్వంపై ఒత్తిడి మేరకు ముద్రగడ ఉద్యమం చేస్తే.. దీక్ష చేస్తున్న ఆయన కుటుంబంపై వందలాది పోలీసులు జొరబడి తన్నుకుంటూ తీసుకెళ్లి ఎదురుకాల్పుల పేరుతో ముద్రగడ పద్మనాభంను చంపేస్తారేమో అని చిరంజీవి, దాసరి నారాయణరావు భయపడి రాజమండ్రి వస్తే వారిద్దరినీ ఎయిర్‌పోర్టులో అరెస్టు చేసి హైదరాబాద్‌లో దింపారు. అంత దాష్టీకం, అకృత్యం, దుర్మార్గం చేస్తే.. ఇవాళ కాపులను ఓటేయలేదని నిందిస్తున్న పవన్ ఆరోజు ఎందుకు నోటికి తాళం వేసుకుని కూర్చున్నారు. కాపుల్ని మోసం చేసిన నీ పార్టనర్ చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదు. చంద్రబాబులా కాపులను మోసం చేయనని జగన్ గారు ముందే చెప్పారు సుప్రీంకోర్టు తీర్పుకు లోబడే రిజర్వేషన్లు ఉంటాయని నిజాయితీగా జగన్ గారు చెప్పారు కాపులను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్న పవన్ పైగా వైయస్ఆర్సీపీలో ఉన్న కాపుల్ని మీరు ఎలా కొమ్ము కాస్తారని పవన్ ప్రశ్నించటం హాస్యాస్పదం. కాపులకు రిజర్వేషన్లు వ్యతిరేకించారంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పు దృష్ట్యా 50% మించి రిజర్వేషన్లు ఇచ్చే అధికారం ఏ ప్రభుత్వానికి లేదు. అది నా చేతుల్లో లేదు. అది ఇవ్వలేను. కాపుల సంక్షేమం కోసం ఏటా రూ.2000 కోట్లు చొప్పన ఐదేళ్లు రూ.10 వేల కోట్లు వెచ్చిస్తానని జగన్ గారు చెప్పారు. చంద్రబాబులా మోసం చేయనని జగన్ గారు ఎన్నికలకు ముందే చెప్పారు. దమ్మున్న నాయకుడు జగన్ గారు నిజం మాట్లాడారు. ఆ నిజం కాపులకు నచ్చింది. పవన్, ఆయన పార్టనర్ చంద్రబాబు కలిసి ఎన్నికల మేనిఫెస్టోలో కాపులను బీసీ చేస్తానని మోసం చేశారు. అలా మోసం చేయటం నాకు చేతకాదని జగన్ గారు చెప్పారు. ఇది చేయను.. ఇది చేస్తానని చెప్పిన జగన్ గారి నిజాయితీ కాపులకు నచ్చింది. కాబట్టి అత్యధిక మంది కాపులు జగన్ గారిని బలపరిచారు. పవన్, చంద్రబాబు కలిసి కాపులను దగా చేశారు. ఇవాళ కాపు రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్నారని నిందవేస్తారు. చంద్రబాబు కోసం దుర్మార్గంగా అసత్యాలు, అబద్ధాలు పవన్ మాట్లాడుతున్నారు. కాపులను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయటానికి మాట్లాడతారు. భీమ్లా నాయక్ సినిమాకు ఏపీలో నష్టాలు వచ్చాయంటున్నారు సినిమా బావుంటే జనం చూస్తారు.. లేదంటే చూడరు. రూ.100 కోట్ల మార్కెట్టే లేనప్పుడు రూ.30 కోట్ల నష్టం ఎలా వస్తుంది? భీమ్లా నాయక్ సినిమాకి రూ.30 కోట్లు నష్టం కలిగించారని పవన్ మాట్లాడతారు. పవన్‌కు సినిమా మార్కెట్ ఎంత? రూ.100 కోట్లు దాటిన సినిమా ఏమైనా ఉందా? ఆ సినిమాకు పెట్టుబడి ఎంత పెట్టారు. రూ.30 కోట్లు నష్టం వచ్చిందంటే.. లెక్కలు చెప్పండి. రెమ్యునరేషన్ ఎవరెవరికి ఎంతెంత ఇచ్చారు. రండి.. లెక్క పెడదాం. సినిమా బావుంటే.. ఆడుతుంది. జనాలు చూస్తారు. సినిమా బాగోలేకపోతే? సినిమా బావుంటే చూస్తారు. ఎవరి భిక్షతో సినిమాల్లోకి నటుడిగా వచ్చావో.. ఆ పేరు మర్చిపోయి.. నేను ఒక కానిస్టేబుల్ కొడుకు అని చెప్పుకుంటున్నావు తప్పితే నేను చిరంజీవి తమ్ముడిని చెప్పుకోవటానికి సిగ్గుపడిపోతున్నావు. 60 ఏళ్ల వయస్సులో వాల్తేరు వీరయ్య సినిమా తీస్తే.. సినిమా బావుంది. బ్రహ్మాండమైన కలెక్షన్లు వచ్చాయి. నువ్వు సినిమా బాగా తీయి జనాలు చూస్తారు. చీప్‌గా సినిమా చుట్టేయాలి. ఎందుకు వస్తాయి. ఒకసారి ప్రశ్నించుకో. సినిమా బాగోలేకపోతే.. జగన్ గారికి సంబంధం ఏంటి? పవన్ సినిమాలు ఏనాడైనా రూ.100 కోట్లు దాటింది ఏదైనా ఉందా? పచ్చి మోసపు మాటలు. ఎమోషనల్ మాటలు. కులాన్ని రెచ్చగొట్టాలి. చిరంజీవి సినిమా బాగోలేకపోతే .. చూడరు. వాల్తేరు వీరయ్య అద్భుతంగా ఉంది. ఎంటర్టైన్మెంట్ ఉంది. జనాలు చూశారు. సినిమాలు ఏమో.. డబ్బింగ్.. ఓటీటీ సినిమాలు. ఏదో ఒకటి రీమేక్ చేసి డబ్బులు వేసేసుకోవాలి. ఆ ఆత్రంలో ఉంటే సినిమా ఎందుకు బావుంటుంది. రాజకీయాల్లో కుల ప్రస్తావన తెచ్చింది పవన్ కాదా? కులప్రస్తావన లేకుండా ఒక్క రోజైనా పవన్ మాట్లాడారా? చంద్రబాబును తిడితేనే మానవత్వం పొంగి పొర్లుతుందా? రాజకీయాల్లో కుల ప్రస్తావన తెచ్చేది.. మాట్లాడేది పవన్. కులం.. కులం అని మాట్లాడతావు. మొన్న బందరులో లెక్క చెప్పాను కదా. ఏ కులం గురించి ఎన్నిసార్లు మాట్లాడావో. మీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున కులాల గురించి మాట్లాడింది పవనే. 2018 నుంచి 2023 దాకా ఈ ఐదారేళ్లలో కులాల ప్రస్తావన లేకుండా నోరు విప్పావా? కుల ప్రస్తావన లేకుండా నోరు తెరుస్తున్నావా? చంద్రబాబుకు నాకు మధ్య అక్రమ సంబంధాలు లేవు. చంద్రబాబును తిడితే.. మానవతా వాదిగా స్పందించాను. టీడీపీ ఆఫీసులో పట్టాభి అనే వ్యక్తి సీఎం జగన్ గారిని అమానవీయంగా, పచ్చిగా అనకూడని మాట అంటే.. ఆరోజున పవన్ మానవత్వం చచ్చిపోయిందా? నోరు విప్పావా? బయటకు వచ్చి మాట్లాడావా? రోడ్డు ఎక్కలేదే. కనీసం ట్వీట్ చేయలేదు. ఎందుకు మాట్లాడలేదు. చంద్రబాబును తిడితేనే మానవత్వం పొంగి పొర్లుతుందా? టీడీపీలో చోటామోటా నాయకుల కోసం మానత్వం లావాలా రోడ్ల వెంట పొంగిపొర్లుతుంది. పవన్ వచ్చి మాట్లాడతారు. ట్వీట్లు చేస్తారు. ఇంత గొప్ప మానవతా వాదివి. ముసుగులు ఎందుకు. చంద్రబాబు, పవన్ కలసి వెళ్తామని చెప్పండి గతం కంటే జనసేనకు ఆదరణ పెరిగింది. కృష్ణా నుంచి శ్రీకాకుళం వరకు 25%, గోదావరి జిల్లాల్లో 35% రాష్ట్ర వ్యాప్తంగా 18%. టీవీ ఛానల్స్, పేపర్లకు అడ్వర్టేజ్మెంట్ వింగ్‌లు ఉంటాయి. ఆ మార్కెటింగ్ వాళ్లు మాకు ఇంత రేటింగ్ ఉంటుంది. పది సెకన్లు ఇంత అవుతుందంటారు. పేపర్ వాళ్లు ఇంత సర్క్యులేషన్ ఉంది.. అంగుళానికి ఇంత అవుతుందని బేరం ఆడతారు. పవన్ చెప్పేది చంద్రబాబు దగ్గర బేరానికి ఉపయోగపడుతుంది తప్ప ఎవరికి ఉపయోగం. కేడర్‌లో ఉత్సాహం రావటానికో మాట్లాడటానికో చెప్పు. నాదెండ్ల మనోహర్, పవన్ అసెంబ్లీలోకి కలిసి వెళ్లాలనుకుంటే మార్కెటింగ్‌కి పనికి వస్తుంది. త్రిముఖ పోటీలో బలి అవ్వొద్దు. నిన్ను బలి అవమని ఎవరు చెప్పారు. మొదటి రోజు నుంచి పవన్, చంద్రబాబు ఒక్కటే అని చెబుతున్నాం. ఇప్పుడు ఈనాడు ఆంధ్రజ్యోతిని మించి బరితెగించి రాసేస్తోంది. గతంలో ఎన్టీఆర్‌కు వ్యతిరేరకంగా ఏ ప్రభుత్వం ఉన్నా ఈనాడు జాగ్రత్తగా ఎలక్షన్ల వరకు పంచదార కోటింగ్ వేసి.. లోపల చేదు వార్తలు రాస్తుంది. ఎన్నికల ఏడాదిలో టీడీపీ అనుకూల వార్తలు రాసేది. ఈనాడు, రామోజీలా ముసుగు ఎందుకు.. చంద్రబాబు, పవన్ కలిసి వెళ్తామని చెప్పండి. చంద్రబాబు, పవన్ ఒక్కటేనని మొదటి నుంచి చెబుతున్నాం ముసుగు తీసి రండి. పవన్, చంద్రబాబులు ఒకేతానులో గుడ్డలు 2014లో చేసినట్లు పోటీ చేయకుండా చంద్రబాబు బస్సు ఎక్కి తిరుగు. చంద్రబాబు, పవన్ గోతికాడ నక్క తెలివితేటలు కాకుండా నేరుగా ప్రజలకు చెప్పండి. మేం ఇద్దరం కలిసి పోటీ చేస్తామని చెప్పండి. లాలూచీ కుస్తీ వ్యవహారం. WWFలా కొట్టుకున్నట్లు పవన్, చంద్రబాబులు నటించొద్దు. కలిసి మెలిసి పోటీ చేయండని చెబుతున్నాం. మీరిద్దరూ కలిసిపోతారు. ముసుగు తీయండని 2019 మొదటి రోజు నుంచి చెబుతున్నాం. ఇది చేస్తారని మాకు తెలీదా. చంద్రబాబుతో వెళ్లిపోతారని మాకు తెల్సు. చంద్రబాబు కోసం ముసుగేసుకుని మోసం చేయటంపై ముందు నుంచి ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నాం. వీళ్లద్దరూ ఒకేతానులో ముక్కలు. వీళ్లద్దరూ ఒక్కటే. తేడా లేదని చెబుతున్నాం. మొన్న పవన్ పోటీ చేసింది 137 స్థానాలకు. జగన్ గారు 175 స్థానాలకు పోటీ చేశారు. 2018లో జగన్ గారు ప్రజలతోనే పొత్తు అని టీవీ ఛానల్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు ఉంటారు. ప్రజలు అవకాశం ఇచ్చే వరకు పోరాటం చేస్తానని చెప్పారు. జనం, దేవుడిని నమ్ముకుని ఉన్నానని జగన్ గారు చెప్పారు. శత్రువులు ఎలా వచ్చినా.. జనం ద్వారా మిమ్మల్ని 2019లో చిత్తు చేశారు. 2024లోనూ చేస్తారు. తాడేపల్లిగూడెంలో రథం తగలబెడితే ఏం చేశారు? కనీసం రథాన్ని పునర్ నిర్మించారా? ఆలయాల మీద దాడులు చేసినవారిని అరెస్టులు చేయలేదని పవన్ అంటాడు. గతంలో పవన్, బీజేపీ, టీడీపీ ఉన్నప్పుడు తాడేపల్లిగూడెంలో ఒక రథాన్ని తగలబెడితే.. కనీసం ముద్దాయిల్ని పట్టుకోవటం కానీ, కేసును ముందుకు తీసుకువెళ్లని మీ ప్రభుత్వం తరుపున హిందువులకు ఎప్పుడైనా సంజాయిషీ ఇచ్చారా? ఆ రథాన్ని పునర్ నిర్మించటానికి పవన్, బీజేపీ, చంద్రబాబు సాయం చేశారా? ఇవాళ మతాన్ని, కులాన్ని రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకుందామని తద్వారా చంద్రబాబుకు మేలు చేద్దామని పవన్ చేస్తు్న్న కుట్రల్ని ప్రజలు చిత్తుచిత్తు చేస్తారు. పవన్‌కు నచ్చకపోవటానికి ప్రభుత్వం ఏమైనా సినిమా హీరోయిన్నా? *జగన్ పథకాలు మేం కూడా అమలు చేస్తామంటున్నారంటే.. ప్రభుత్వ పాలన బావుందనే కదా* పవన్‌కు నచ్చని ప్రభుత్వం ఉండటానికి వీల్లేదు. పవన్‌కు నచ్చదు అంటే ఏమిటి? సినిమా హీరోయిన్లులా అందంగా ఉండాలా? ఏమిటి? పవన్‌కు ఏం నచ్చాలి. నచ్చకపోతే ఇన్నాళ్లూ జగన్ గారి ప్రభుత్వం అమలు చేసిన పథకాలూ అమలు చేస్తామని చంద్రబాబు, పవన్ చెప్పటం జగన్ గారి ప్రభుత్వ విజయం కాదా? ఇది మంచి ప్రభుత్వమని మీ నోటితో మీరు చెబుతున్నట్టే కదా. ఇంతకంటే ప్రజా ప్రభుత్వం ఇంకేం కావాలి. ఈ ప్రభుత్వం అద్భుతంగా ఉందని. మీ హయాంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ వచ్చిందా? విద్య నా ప్రభుత్వ బాధ్యత అని జగన్ గారు తీసుకున్నారు చంద్రబాబు ఏనాడైనా ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ స్థాపించారా? ఒక నర్సు కాలేజీ అయినా స్థాపించారా? ప్రజలకు ఏం మేలు చేశారు. మా హయాంలో 17 మెడికల్ కాలేజీలు స్థాపించనున్నాం. చదువులు అనేవి ప్రభుత్వానికి బాధ్యతలేదనిచంద్రబాబు మాట్లాడారు. పవన్ కావాలంటే చంద్రబాబు మాటల వీడియోలు కూడా పంపిస్తాం. పేద, మధ్యతరగతి వర్గాల చదువు మొత్తం నా ప్రభుత్వానిది బాధ్యత అన్నారు. దేశ చరిత్రలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్టేట్ ఫస్ట్ వచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా ప్రైవేటు కాలేజీలతో పోటీ పడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు స్టే్ట్ టాపర్లుగా రావటం ఎప్పుడైనా జరిగిందా? విద్య ప్రైవేటీకరణ చెందిన తర్వాత ప్రైవేటు పాఠశాలలతో పోటీ పడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు స్టేట్ టాపర్లు అయ్యారు. ఇది మార్పు కాదా? వైద్యం, విద్యలో, సామాజిక సమతుల్యంలో మార్పు. జనాభా దామాషా ప్రకారం ప్రతి కులానికి సముచిత స్థానాన్ని, గౌరవాన్ని ప్రభుత్వంలో ఇవ్వటం జరిగింది. ఇలా ఎప్పుడైనా జరిగిందా? చంద్రబాబు కోసమే పవన్ రాజకీయాలు చంద్రబాబే నాయకుడు అని పవన్ ఒప్పుకొని భజన చేసుకో. . చంద్రబాబు కోసం పవన్ కల్యాణ్ నిసిగ్గుగా రాజకీయాలు చేస్తున్నారు. ఎంతసేపూ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారిని లక్ష్యంగా పవన్ దూషించటం, ద్వేషిస్తున్నారు. చంద్రబాబు పట్ల పవన్‌కు మమకారమే ఎక్కువ. పవన్ కల్యాణ్ చేస్తోంది చంద్రబాబు భజనే. మా నాయకుడు జగన్ గారు కాబట్టి ఆయన చేసిందే చెబుతున్నాం. పవన్ కల్యాణ్‌కు నాయకుడు చంద్రబాబు అని ఒప్పుకో.. భజన చేసుకో. ఆమాట చెప్పుకుండా ఈ భజన దేనికి. ఈ తప్పుడు.. ముసుగు రాజకీయాలు మానేసి. చంద్రబాబు కోసమే రాజకీయంగా బ్రతుకుతామని చెప్పు. షంషేర్‌గా చంద్రబాబు కోసమే బ్రతుకుతున్నానని చెప్పు. మేం ఎలా కాపు బిడ్డలం అని చెప్పుకుంటున్నాము. మాకు పోటీగా నికార్సయిన కాపు బిడ్డ దొరికాడనుకుంటాం. రాజకీయాలు చేస్తే.. చిరంజీవిలా, వంగవీటి రంగాలా చేయి. ఈ తోడేలు, నక్క రాజకీయాలు కట్టిపెట్టమని పవన్‌కు హితవు చెబుతున్నాం. - కర్నాటక రాజకీయాలకు, ఏపీకి సంబంధం ఏంటి? కర్నాటకలో బిస బిల్లా బాత్ తింటారు. ఏపీలో అన్నం తింటారు. ఎవరి జిహ్వరుచి వారిది. - ఇంతకంటే నమ్మకమైన ప్రభుత్వం ఎక్కడ దొరుకుతుంది. ఏపీలో మళ్లీ వైయస్ జగన్ గారి ప్రభుత్వమే వస్తుంది. - బీజేపీ కర్నాటకలో నాశనమైపోతే.. ఆంధ్రాలో పొత్తు పెట్టుకోవాలని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అంటారా? - కర్నాటకలో బీజేపీ ఓడిపోతే.. వైయస్ఆర్సీపీకి వణుకు ఎందుకు? - 2019లో జరిగినట్లే 2024లోనూ శృంగభంగం తప్పదు. - ఇప్పుడు పేద ప్రజల్లో సీఎం వైయస్ జగన్ గారికి భారీ ఆదరణ ఉంది. ఇది ప్రజా ప్రభుత్వం 2024లోనూ వైయస్ జగన్ గారి ప్రభుత్వం కొనసాగి తీరుతుందని పేర్ని నాని ధీమా వ్యక్తం చేశారు. క్విడ్ ప్రోకోపై.. చంద్రబాబు ధైర్యంగా విచారణను ఎదుర్కోవాలి అమరావతి రాజధానిలో జరిగిన అక్రమాలపై గత ప్రభుత్వం పట్టించుకోలేదు. జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధారాలతో సహా పిటిషన్ ఇచ్చారు. ఆ పిటిషన్‌పై సీబీసీఐడీ ఎంక్వైరీ వేయటం జరిగింది. ఆ ఎంక్వైరీలో భాగంగా లింగమనేని రమేష్, ఇతర వ్యక్తులకు లబ్ధి చేకూరేలా జరిగిందని విచారణలో వెల్లడైంది. నగదు, ఆస్తి చేతులు మారి లబ్ధి జరిగిందని సీబీసీఐడీ తేల్చటంతో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. దాని ప్రకారం నిందితుల ఆస్తులు అటాచ్ చేస్తూ ప్రభుత్వం జీవోలు జారీ చేయటం జరిగింది. ఆ గెస్ట్ హౌస్‌లో చంద్రబాబు ఎందుకు ఉంటున్నారు? - లింగమనేని రమేష్ లబ్ధి పొందిన దానికి ప్రతిఫలంగా చంద్రబాబుకు కరకట్ట గెస్ట్ హౌస్ ఇచ్చిపుచ్చుకున్నట్లుగా సీబీసీఐడీ విచారణలో వెల్లడైంది. సీబీసీఐడీ సిఫార్సుల మేరకు ఆస్తుల్ని అటాచ్ చేస్తూ హోంశాఖ జీవోలను విడుదల చేసింది. ఇది లింగమనేని రమేష్ ఆస్తి. పూలింగ్‌లో ప్రభుత్వానికి అప్పజెప్పారు. అందుకు నేను ఉంటున్నానని మీడియాతో చంద్రబాబు అన్నారు. కానీ పూలింగ్‌లో ఇచ్చినట్లు ఆధారాలు లేవు. మరి, చంద్రబాబు ఉచితంగా ఆ ఇంటిలో ఎందుకు ఉంటున్నారో చెప్పాలి కదా. లింగమనేని రమేష్‌కు అద్దె కడుతున్నారా? ఒక్క లింగమనేని రమేష్ మాత్రమే కాదు.. చంద్రబాబు తప్పుడు విధానాల వల్ల చాలా మంది వ్యక్తులకు ఉద్దేశపూర్వకంగా లబ్ధి చేకూరింది. వారి ఆస్తులు అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. తప్పు చేయకపోతే విచారణ ఎదుర్కోండి. పెద్ద లాయర్లను పెట్టి.. స్టేలు ఎందుకు? - స్టేలు తెచ్చుకుని దాక్కోవటం ఎందుకు? దమ్ముంటే విచారణ ఎదుర్కోమనండి. డబ్బుండి.. పెద్ద పెద్ద ప్లీడర్లను తెచ్చి కోర్టుల్లో వింత వాదనలు వినిపించి.. బెయిల్లు, స్టేలు తెచ్చుకోవడం ఎందుకు. విచారణ ఎదుర్కోవచ్చు. - లింగమనేని రమేష్‌ది ఇల్లు అయితే.. చంద్రబాబు ఎందుకు ఉంటున్నాడు. ఏంటీ వీళ్లద్దరి సంబంధం? పోనీ, అద్దెకు ఇచ్చారా? అద్దె కడుతున్నారా? పూలింగ్‌లో లేని ఆస్తి, పూలింగ్ కాని ఆస్తిని ప్రభుత్వానికి అప్పజెప్పారని చంద్రబాబు ఎలా చెప్పారు...? - కక్షసాధింపులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ఇన్నర్ రింగ్ రోడ్డు వేస్తున్నారని.. అలైన్మెంట్ ఇస్తున్నట్లు జీఓలు ఉన్నాయి. చంద్రబాబు సంతకాలతో నోట్‌ఫైల్స్ ఉన్నాయి. రింగ్‌రోడ్డుపై సీఆర్డీఏలో చెప్పారు. ఇవాళ కాదని ఎలా అంటారు. ఆ చెప్పేది ఏమిటో సీబీసీఐడీ దగ్గరకు వెళ్లి చెప్పమనండి. తప్పులు చేసినవారిపై చర్యలు ఉంటాయ్ - లింగమనేని రమేష్‌ది రెండు ఆవుల దూడ వ్యవహారం. అటు పవన్ కల్యాణ్ దగ్గర.. ఇటు చంద్రబాబు దగ్గర ఉంటాడు. కోట్లాది విలువైన ఆస్తుల్ని లక్షలకే పవన్‌కు ఇచ్చేస్తాడు. మరోవైపు చంద్రబాబుకేమో ఊరికే ఇచ్చేశాడు.అక్కడా ఇక్కడా పదేళ్లుగా ఇద్దరికీ పాలు ఇచ్చే ఆస్తి లింగమనేని రమేష్. సాక్ష్యాలు ఆధారంగా మా ప్రభుత్వం ఎవరైతే తప్పులు చేశారో వారిని దోషులు చేయటం జరుగుతుంది. అంతకుమించి ఆలోచించే పనిలేదు. గతంలో అగ్రిగోల్డ్ విషయంలోనూ ఇలాగే అటాచ్ చేశారు - రాజధానిలో తప్పులు జరిగాయని మంగళగిరి ఎమ్మెల్యే పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ విచారణలో తప్పులు రుజువు అయ్యాయని ప్రభుత్వం రెండు జీవోలు ఇవ్వటం జరిగింది. గతంలో అగ్రిగోల్డ్, ఇతర వ్యవహారాలు సీబీసీఐడీ వ్యవహరించింది కదా. అలాగే ఇక్కడా అంతే. తప్పులు చేసిన వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవటం జరుగుతుంది. - మీడియా వద్ద జీవోలు ఉన్నాయని భావిస్తున్నాను. కావాలంటే తెప్పించి అందజేస్తాను. - ఎవరైనా తప్పులు చేసి.. మీడియా అనో, ఇతరత్రా సాకులు చూపుతూ చర్యలు తీసుకోవద్దు అనటం సరికాదు. - ప్రభుత్వం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంది.. కానీ, కోర్టులను అడ్డంపెట్టుకుని చంద్రబాబు, ఆయన బినామీదారులు స్టేలు తెచ్చుకున్నారు. ఇప్పుడు స్టేలు తొలిగాయి. - లింగమనేని రమేష్ స్టార్ వ్యాపారస్తుడు. విమానాల కంపెనీ పెట్టారు. తర్వాత తీసేశారు. సినిమా యాక్టర్‌కు పార్టీ ఆఫీసు, ఇల్లు ఇచ్చాడు. ఎన్టీఆర్ చెప్పినట్లు తనకంటే గొప్ప యాక్టర్ చంద్రబాబుకు నది ఒడ్డున గెస్ట్ హౌస్ ఇచ్చాడు. స్టార్ బిజినెస్ మేన్ లింగమనేని మీద మాత్రమే మాట్లాడటం ఎందుకు? మిగతా ముద్దాయిల పేర్ల మీద దృష్టి పెట్టండి. - దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతోంది. దాంట్లో ఎవరు దోషులుంటే.. వారు బయటకు వస్తారు.