తాడేపల్లి: ఉమ్మడి వైయస్ఆర్ జిల్లాకు చెందిన పార్టీ నాయకులతో వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్. జగన్ మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. వైయస్ఆర్, అన్నమయ్య జిల్లాల పార్టీ అధ్యక్షులుగా ఎవరిని నియమించాలన్నదానిపై వారితో చర్చలు జరిపారు. దీంతోపాటు రాబోయే వైయస్ఆర్ జిల్లా జడ్పీ ఛైర్మన్ అభ్యర్థిత్వంపైనా వారి అభిప్రాయాలు తీసుకున్నారు. పార్టీ సూచనల మేరకు వైయస్ఆర్ జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కమలాపురం మాజీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డిని, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డిని నియమించారు. అలాగే వైయస్ఆర్ జిల్లా జడ్పీ ఛైర్మన్ అభ్యర్థిగా బ్రహ్మంగారి మఠం జడ్పీటీసీ రామగోవిందరెడ్డిని ఎంపిక చేశారు.